Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for Srivari devotees .

 శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ .. ఇకపై వారికీ ప్రత్యేక సౌకర్యాలు.త్వరలో మెట్లమార్గం రీ ఓపెన్ TTD కీలక నిర్ణయం.

Good news for Srivari devotees .


తిరుమల (Tirumala) శ్రీవారి భక్తలకు టీటీడీ (TTD)శుభవార్త చెప్పింది. ఇకపై సామాన్య భక్తలకు మరింత వేగంగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేస్తామని టీటీడీ ప్రకటించింది.

శనివారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల విలువైన భూమిని విరాళంగా ఇచ్చిందని టీటీడీ తెలిపింది. అలాగే శ్రీనివాస సేతు రెండో దశ పనులకు రూ.100 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరింత సౌకర్యవంతంగా, వేగంగా దర్శనం కల్పించేందుకు టీటీడీలోని అన్నివిభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. దాదాపు రెండేళ్ల తరువాత అధిక సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యార్థం సర్వ దర్శనం, టైం స్లాటెడ్ దర్శనాలు కొనసాగిస్తామన్నారు. నడక దారి భక్తులకు త్వరలో టోకెన్లు జారీని ప్రారంభిస్తామన్నారు.

నవీ ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిందన్నారు. అక్కడ శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.60 కోట్లు విరాళమిచ్చేందుకు దాత రేమండ్ సంస్థ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకొచ్చారన్నారు. ప్రస్తుతం ముంబై నగరంలో శ్రీవారి ఆలయం కేవలం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇరుకైన ప్రాంతంలో రెండు దశబ్ధాలుగా ఉందన్నారు. అటువంటిది ఇంత విశాలమైన ప్రాంగణంలో శ్రీవారి ఆలయం నిర్మాణం జరగడం చారిత్రత్మకమైనదన్నారు.

గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గాన్ని పునఃరుద్ధరించి మే 5వ తేదీ నుండి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు కొత్త బంగారు సింహాసనాలకు బంగారు పూత పోయడానికి రూపాయలు రూ.3.61 కోట్లతో టెండర్లు ఆహ్వానించేందుకు టీటీడీ ఆమోదం తెలిపింది. అలాగే శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలలో రూ.21.20 కోట్లతో ఇ మరియు ఎఫ్ బ్లాకుల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది.

ఐఐటి నిపుణుల సూచనల మేరకు తిరుమల రెండు ఘాట్ రోడ్లలో ఆర్‌సిసి రోడ్లు, క్రాష్ బ్యారియర్స్‌ నిర్మాణం కోరకు మొదటి దశలో రూ.20 కోట్లు, రెందవ దశలో రూ.15 కోట్లతో పనులకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీనివాస సేతు రెండో దశ పనులకు రూ.100 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. 2023 మార్చి నాటికి రెండవ దశ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది.

ఇక తిరుమల బాలాజీ నగర్ వద్ద 2.86 ఎకరాల స్‌ంలం ఎలక్ట్రిక్ బస్ స్టేషన్‌కు ఏర్పాటుకుల చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో తడిచెత్త ద్వారా బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు, టీటీడీ ఉద్యోగుల కోసం తిరుమలలో గల క్వార్టర్స్ అభివృద్ధి చేసేందుకు రూ.19.40 కోట్లతో టెండరకు ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు నగదు విరాళమిచ్చిన భక్తులకే ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని., ఇకపై వస్తు రూపంలో విరాళాలు అందించే దాతలకు కూడా నగదు రూపంలో విరాళాలు అందించే దాతల తరహాలో ప్రయోజనాలు వర్తింపజేయాలని టీటీడీ నిర్ణయించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for Srivari devotees ."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0