Govt Jobs 2022
Govt Jobs 2022 : ఈ వారం దరఖాస్తు చేసుకోవలసిన ప్రభుత్వ ఉద్యోగాలు అర్హతలు , అప్లికేషన్ ప్రాసెస్.
ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసే అభ్యర్థులు.. జాబ్ అప్లికేషన్ (Job Applications)లను త్వరగా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివరి నిమిషంలో సర్వర్ సమస్యల వల్ల దరఖాస్తు కష్టం అవ్వొచ్చు.
ఎన్‌హెచ్ఎం తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు..
తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పని చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. అన్ని విభాగాల్లో కలిపి 12 పోస్టులు ఉన్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 వేతనం అందిస్తారు. ఎటువంటి పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://chfw.telangana.gov.in/home.do ను సందర్శించాలి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ మే 20,2022. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని ఇంటర్వ్యూకి హాజరు అవగలరు.
టెన్త్, ఇంటర్, డిప్లొమా అర్హతతో ఓఎన్జీసీలో 922 జాబ్స్.
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 922 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయగలరు
పరీక్ష లేకుండా 38,926 ఉద్యోగాలు.
ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల (Gramin Dak Sevak Posts) భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 38,926 పోస్టులున్నాయి. తెలంగాణలో 1226, ఆంధ్రప్రదేశ్‌లో 1716 పోస్టులు కలిపి తెలుగు రాష్ట్రాల్లోని పోస్ట్ ఆఫీసుల్లో మొత్తం 2,942 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 జూన్ 5 చివరి తేదీ. ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే టెన్త్ పాసైతే చాలు. కేవలం పదవ తరగతి అర్హతతో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. మెరిట్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయగలరు
0 Response to "Govt Jobs 2022"
Post a Comment