Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs at airports with 10th qualification without exam

 పరీక్షా లేకుండానే 10th అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు

Jobs at airports with 10th qualification without exam

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నందు వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మంచి నోటిఫికేషన్ తాజాగా విడుదల కావడం జరిగింది. 10వ తరగతి అర్హత గల వారికి ఈ నోటిఫికేషన్ నందు ఉద్యోగాలు కలవు. డిప్లొమా పాసైన వారికి ఉద్యోగాలు కలవు, బి టెక్ పాసైన వారికి ఉద్యోగాలు కలవు, ఏదైనా డిగ్రీ పాసైన వారు కూడా అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా కస్టమర్ ఏజెంట్, జూనియర్ కస్టమర్ ఏజెంట్, రాంప్ సర్వీస్ ఏజెంట్, యూటీలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్, హ్యాండీ మాన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

AIATSL Vijayawada Recruitment 2022 Vacancy Details :

పోస్టు పేరు ఖాళీలు

కస్టమర్ ఏజెంట్                 8

జూనియర్ కస్టమర్ ఏజెంట్ 4

రాంప్ సర్వీస్ ఏజెంట్.       2

యూటీలిటీ ఏజెంట్ కమ్ 

రాంప్ డ్రైవర్ 6

హ్యాండీ మాన్ 25

AIATSL Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

AIATSL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 33 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

జూనియర్ కస్టమర్ ఏజెంట్ :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 10+2+3 విధానంలో గ్రాడ్యుయేట్ లేదా

గ్రాడ్యుయేట్ తో పాటు సంబంధిత విభాగాలలో డిప్లొమా ను కంప్లీట్ చేసిన వారు కస్టమర్ ఏజెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా

10+2 విధానం ద్వారా సంబంధిత విభాగాలలో డిప్లొమా కోర్సులు కంప్లీట్.

2. రాంప్ సర్వీస్ ఏజెంట్ :

మెకానికల్ / ఎలక్ట్రికల్ / ప్రొడక్షన్ / ఎలక్ట్రానిక్స్ / ఆటో మొబైల్ ఇంజనీరింగ్ విభాగాలలో మూడేళ్ల డిప్లొమా కోర్సులను కంప్లీట్ చేసిన వారు లేదా ఆటో ఎలక్ట్రికల్ / ఎయిర్ కండిషనింగ్ / డీజిల్ మెకానిక్ / బెంచ్ ఫిట్టర్ / వెల్డర్ విభాగాలలో ఐటీఐ మరియు ఎన్సీటీవీటీ కోర్సులను కంప్లీట్ చేసి, వాలీడ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఉండాలి.

3. రాంప్ డ్రైవర్ :

10వ తరగతి అర్హతలుగా కలిగి ఉండి, HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

4. హ్యాండీ మెన్ :

10వ తరగతి పాస్ అయ్యి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదవడం మరియు వ్రాయడం వచ్చి ఉండి, లోకల్ మరియు హిందీ లాంగ్వేజ్ లపై నాలెడ్జ్ కలిగి ఉండాలి.

Airport Jobs 2022 Apply Process :

అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని తగు సెర్టిఫికేట్లను “HR Department, AI Airport Services Limited, AI Unity Complex, Pallavaram Cantonment, Chennai – 600 043.” అనే చిరునామాకు పంపించండి.

దరఖాస్తు ఫీజు :

జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- 

మిగితా అభ్యర్ధులు – రూ 0/-

Airport Jobs Vijayawada 2022 Important Dates :

దరఖాస్తు కు ప్రారంభ తేది :  01.05.2022

దరఖాస్తు కు చివరి తేది :  18.05.2022

ఎంపిక విధానం :

పర్సనల్ ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్ / ట్రేడ్ టెస్ట్ / స్క్రీనింగ్  టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs at airports with 10th qualification without exam"

Post a Comment