Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New Rules For Ration Card

 New Rules For Ration Card  రేషన్ కార్డుకు కొత్త రూల్స్‌.. అనర్హులు సరెండర్ చేయాలో వివరణ.

New Rules For Ration Card

New Rules For Ration Card  రెండేండ్ల క్రితం కరోనా మహమ్మారి టైంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ సరఫరా చేసింది.

కానీ పలువురు రేషన్ కార్డుల యజమానులు రేషన్ కార్డులకు అనర్హులైనా.. ఉచిత రేషన్‌తో లబ్ధి పొందారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అర్హులైనా పలువురు రేషన్ కార్డుల యజమానులు బెనిఫిట్ పొందలేదని సమాచారం. 

అనర్హులైన వారు రేషన్ కార్డులను తక్షణం సరెండర్ చేయాలని ప్రభుత్వం కోరింది. ఒకవేళ అనర్హులైన కార్డుల యజమానులు తమ రేషన్ కార్డులను సరెండర్ చేయకపోతే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

రూ.10 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారిని మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) కుటుంబాలుగా పరిగణిస్తారు. వారికి మాత్రమే రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేస్తుంది.

ఎవరెవరు రేషన్ కార్డు సరెండర్ చేయాలంటే

100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ నిడివి గల ఇల్లు లేదా ఫ్లాట్‌, కారు లేదా ట్రాక్టర్‌, గ్రామంలో రూ.2 లక్షలకంటే ఎక్కువ వార్షికాదాయం, నగరాల్లో రూ.3 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం గల వారు సంబంధిత తహసీల్దార్‌కు గానీ, డీఎస్‌వో ఆఫీసులో గానీ రేషన్ కార్డు సరెండర్ చేయాలి.

ఎల్లో రేషన్‌కార్డులకు అర్హత

  • వార్షికాదాయం రూ.15 వేల వరకు గల కుటుంబాలు.
  •  కుటుంబంలో డాక్టర్‌, న్యాయవాది, ఆర్కిటెక్‌, చార్టర్డ్ అకౌంటెంట్ లేని వారు.
  • ప్రొఫెషనల్ టాక్స్/ సేల్స్ టాక్స్/ ఇన్‌కం టాక్స్ చెల్లింపుదారులు లేని కుటుంబాలు
  • రెసిడెన్షియల్‌లో ఫోన్ ఫెసిలిటీ లేని కుటుంబాలు.
  • కారు లేని కుటుంబాలు
  • కుటుంబంలోని సభ్యులందరికీ కలిపి రెండు హెక్టార్ల మెట్ట, హెక్టార్ మాగాణి, కరువు ప్రాంతాల్లో అర్ధ హెక్టార్ భూమి కూడా లేని వారు.

కాషాయ రేషన్ కార్డులకు అర్హత

  • రూ.15 వేల నుంచి రూ. లక్ష లోపు వార్షిక ఆదాయం గల కుటుంబాలు
  • టాక్సీ మినహా కార్లు లేని కుటుంబాలు
  • నాలుగు హెక్టార్ల కంటే తక్కువ భూమి గల కుటుంబాలు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New Rules For Ration Card"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0