Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PAN Card: An explanation of what to do if someone loses their PAN card.

 PAN Card : ఎవరైనా వాళ్ళ పాన్ కార్డ్ పోగొట్టుకుంటే ఏంచేయాలో వివరణ.

PAN Card: An explanation of what to do if someone loses their PAN card.

పాన్ కార్డ్ హోల్డర్లు ఒక్కసారైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని ఉంటారు. పాన్ కార్డ్ పోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇ-పాన్ కార్డ్ సులువుగా డౌన్‌లోడ్ చేయొచ్చు. లేదా పాన్ కార్డ్ రీప్రింట్ చేయించొచ్చు. ఇందుకోసం పాన్ కార్డ్ వివరాలు ఉంటే చాలు. 

2. ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండానికి ముందుగా https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html లింక్ ఓపెన్ చేయాలి. PAN ఆప్షన్ సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, నియమనిబంధనలు అంగీకరించి Submit పైన క్లిక్ చేయాలి.

3. ఆ తర్వాత పాన్ కార్డ్ కనిపిస్తుంది. పాన్ కార్డును వెరిఫై చేయాలి. ఓటీపీ జనరేట్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేసి, నామినల్ ఫీజు చెల్లించి ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయొచ్చు.

4. పాన్ కార్డ్ రీప్రింట్ చేయండానికి ముందుగా https://www.pan.utiitsl.com/PAN/mainform.html వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Reprint PAN Card పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మరోసారి Reprint PAN Card ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

5. ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇండియాలోని అడ్రస్‌కు రూ.50, విదేశాల్లోని అడ్రస్‌కు రూ.959 ఆన్‌లైన్ ఫీజు చెల్లించాలి. ఆదాయపు పన్ను శాఖ రికార్డ్స్‌లో ఉన్న మీ అడ్రస్‌కు పాన్ కార్డ్ ఫిజికల్ కాపీ వస్తుంది.

6. చాలావరకు భారీ ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డును సమర్పించడం తప్పనిసరి. ఇటీవల కొత్త రూల్స్ కూడా వచ్చాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేసినా, డిపాజిట్ చేసినా పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరిగా వెల్లడించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ప్రకటించింది.

7. ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం 18 రకాల లావాదేవీలకు పాన్ కార్డ్ వివరాలు తప్పనిసరిగా వెల్లడించాలి. వాహనాల కొనుగోలు లేదా అమ్మకం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డుకు దరఖాస్తు చేయడం లాంటివాటి కోసం పాన్ కార్డ్ వివరాలు ఇవ్వాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "PAN Card: An explanation of what to do if someone loses their PAN card."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0