Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Petrol, diesel and cooking gas prices have come down drastically

 దేశప్రజలకు ఊరట.. భారీగా తగ్గిన పెట్రోల్,డీజిల్ వంటగ్యాస్​​​ ధరలు

Petrol, diesel and cooking gas prices have come down drastically


 భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో దేశ ప్రజలు సతమతం అవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. చమురు, గ్యాస్‌పై పన్నులు తగ్గించింది. లీటర్‌ పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ప్రభుత్వానికి ప్రతిఏటా దాదాపు రూ.1 లక్ష కోట్ల వరకు ఆదాయం తగ్గిపోనుంది.తాజా తగ్గింపుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7 రూపాయలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల్‌యోజన కింద 9 కోట్ల మంది లబ్దిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు రూ.6100 కోట్లు రెవెన్యూ నష్టం వస్తుందన్నారు. అలాగే.. దిగుమతిపై అధికంగా ఆధారపడే ప్లాస్టిక్​ ఉత్పత్తుల ముడి పదార్థాలపై కస్టమ్స్​ డ్యూటీని తగ్గిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా తయారీ ఖర్చు భారీగా తగ్గుతుందన్నారు. వాటితో పాటు ఇనుము, స్టీల్​ ఉత్పత్తుల ధరలు తగ్గించేందుకు ముడి సామగ్రిపై కస్టమ్స్​ డ్యూటీ తగ్గిస్తున్నట్లు చెప్పారు. సిమెంట్​ను అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ధరలు తగ్గేందుకు మెరుగైన రవాణా వ్యవస్థలను అందుబాటులో ఉంచేందుకు యత్నం చేస్తున్నామన్నారు మంత్రి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Petrol, diesel and cooking gas prices have come down drastically"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0