Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PM Kisan 11th Installment

PM KISAN : గుడ్ న్యూస్ .పీఎం కిసాన్ డబ్బులు వచ్చేది ఎప్పుడో వివరణ. ప్రధాని కార్యాలయం కీలక ప్రకటన.

PM Kisan 11th Installment

 1. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 11వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను (PM Kisan 11th Installment) త్వరలో విడుదల చేయనుంది.

రైతుల అకౌంట్‌లో రూ.2,000 చొప్పున జమ కానుంది. 11వ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం 12 కోట్లకు పైగా రైతులు ఎదురుచూస్తున్నారు. ఈసారి పీఎం కిసాన్ ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే అకౌంట్‌లో డబ్బులు జమ కానున్నాయి.

2. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 11వ విడత మొత్తాన్ని రూ.21,000 కోట్లకు పైగా లబ్ధిదారులకు మే 31న ప్రధాని మోదీ విడుదల చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం శనివారం తెలిపింది.

3. అయితే పీఎం కిసాన్ ఇకేవైసీ గడువు పెంచినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. కొత్తగా గడువు ఏమీ పెంచలేదన్న విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఇకేవైసీ గడువు 2022 మే 31 వరకే ఉంది. ఈ గడువును గతంలోనే పెంచారు. తాజాగా గడువు పెంచారని ప్రచారం జరుగుతోంది. (image: https://pmkisan.gov.in/)

4. పీఎం కిసాన్ ఇకేవైసీ గడువు పెంచారని ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రైతులు గుర్తుంచుకోవాలి. పెంచినట్టుగా చెబుతున్న గడువుకు సంబంధించి మార్చిలోనే ప్రకటన వచ్చింది. అప్పుడే 2022 మే 31 డెడ్‌లైన్ అని ప్రకటించారు. 

5. పీఎం కిసాన్ లబ్ధిదారుల్లో 80 శాతానికి పైగా రైతులు ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేశారని అంచనా. మిగతావారికి మరో వారం రోజుల గడువు ఉంది. మే 31న పీఎం కిసాన్ నిధులు విడుదలవుతాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మధ్యప్రదేశ్‌లో ఓ ఈవెంట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లోగా ఇకేవైసీ పూర్తి చేసినవారికి కూడా రూ.2,000 అకౌంట్‌లో జమ అవుతాయి.

6. రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ లో ఓటీపీ బేస్డ్ ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో eKYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. మీ ఆధార్ కార్డుకు లింకైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. 

7. ఆ తర్వాత Get OTP ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇ-కేవైసీ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది. ఇక ఇప్పటికే ఇకేవైసీ పూర్తి చేసిన రైతులు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో స్టేటస్ చెక్ చేయొచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Farmers Corner సెక్షన్‌లో Beneficiary Status పైన క్లిక్ చేయాలి.

8. రైతులు తమ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేయాలి. స్టేటస్‌లో 'FTO is generated and Payment confirmation is pending' అని కనిపిస్తే వెరిఫికేషన్ పూర్తైనట్టే. ఈ స్టేటస్ కనిపించేవారికి పీఎం కిసాన్ నిధులు విడుదల చేయగానే అకౌంట్‌లో రూ.2,000 జమ అవుతుంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "PM Kisan 11th Installment"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0