Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Prepare the field for teacher transfers!

టీచర్ల బదిలీలకు రంగం సిద్ధం!

Prepare the field for teacher transfers!

  • స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కూడా
  • ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తయిన వారికే
  • జూన్ 6న నోటిఫికేషన్ వచ్చే అవకాశం
  • సెలవులు ముగిసేలోగా ప్రక్రియ పూర్తి

రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. వేసవి సెలవులు పూర్తయ్యే లోగా ఉపాధ్యాయుల బదిలీలు, అర్హులైన వారికి పదోన్నతులు పూర్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 6న బదిలీల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు. చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పదో తరగతి పరీక్షలు పూర్తయి, స్పాట్ వాల్యుయేషన్ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మూల్యాంకనం పూర్తయిన తర్వాత బదిలీలు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. బదిలీలు చేపట్టడానికి ముందుగానే ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పదవులకు ప్రమోషన్లు కల్పించాలని, ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోసం ఇప్పటికే నివేదిక పంపినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 వేల పోస్టులు ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా.. ఆర్థిక శాఖ 11 వేల 500 పోస్టులకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ అనంతరం జూన్ 6 నుంచి ఉపాధ్యాయ బదిలీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. మరోవైపు పాఠశాలల విలీనం విషయంలో ఒక అడుగు ముందుకువేసిన విద్యాశాఖ కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్స్ మెర్జింగ్ మ్యాపింగ్ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సమీప ప్రాథమిక పాఠ శాలల ఉపాధ్యాయుల వివరాలను టీఐఎస్ ద్వారా గుర్తించి, వారి కోసం ఉత్తర్వులు ఇవ్వనున్నారు. బదిలీల ప్రక్రియను బదిలీల వేసవి సెలవులు ముగిసేలోగానే పూర్తి చేయాలని, అందుకు జూలై తీసు గడువుగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది.

సర్దుబాటుతో సరా?

®️విద్యాశాఖ చేపట్టనున్న బదిలీలు సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీ) గుదిబండలా మారబోతున్నాయా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నా యి. కేవలం 8 సంవత్సరాలు పూర్తయిన ఎస్టిటీ లకు మాత్రమే బదిలీలు ఉంటాయని వారు కూడా కేవలం లాంగ్ స్టాండింగ్ వేకెన్సీలలో ఒకరి ప్లేస్లో మరొకరు సర్దుకోవాల్సిందేనన్న' సమాచారం వారి లో ఆందోళన రేకెత్తిస్తోంది. మరోవైపు బ్లాక్ చేసిన ఖాళీలన్నీ శాశ్వతంగా రద్దయినట్లేనా అన్న అను మానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పొడిగించిన నేపథ్యంలో రెండు సంవత్సరాల వరకు ఎలాంటి రిటైర్మెంట్లు ఉండబోవు, ఏవైనా కారణాలతో కొంతమంది రిటైర్మెంట్ కోరుకున్నా.. ఆ ఖాళీలలో ఎయిడెడ్ ఉపాధ్యాయులు, 1998, 2008 డీఎస్సీ, ఎంటీఎస్ ఉపాధ్యాయులు, అంతర్ జిల్లా.  బదిలీల ఉపాధ్యాయులు సర్దుబాటు అయ్యే అవకాశాలు న్నాయి. ఒకవేళ ప్రమోషన్లు ఇచ్చినా ఆ పోస్టుతో సహా ఉపాధ్యాయుడు వెళ్లిపోవడం జరిగి.. ఎస్జీటీపోస్టు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెర్టింగ్లో 1.2 తరగతులు మిగిలిన పాఠశాలలన్నీ సింగిల్ ఎస్జీటీ పాఠశాలలుగా మిగిలిపోతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో దాదాపు 35 వేల మంది స్కూల్ అసిస్టెంట్ల అవసరం ఉండగా.. ఆర్థిక శాఖ 11 వేల 500 ఎస్ఏ పోస్టులకు మాత్రమే ఆమోదం తెలపనున్నట్లు తెలు స్తోంది. దీంతో మిగిలిన వేకెన్సీలలో తాత్కాలికంగా ఎస్జీటీలను సర్దుబాటు చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

బ్లాక్ చేయకుండా బదిలీలు జరపాలి: టీఎనోయూఎస్

రాష్ట్రంలో పాఠశాల్లోని 3.4.5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని ఆపాలని తెలుగునాడు. ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాల పరిధిలోని ఒక కి. మీ. లోప ప్రాథమిక పాఠశాలలను తరలించడం ద్వారా 9,450 పాఠశా లలు మూతపడి, డ్రాపొట్స్ పెరిగే అవకాశం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. బదిలీలలో పారదర్శకత లేకుండా పోస్టులు బ్లాక్ చేయడం వల్ల అనేక మందికి ట్రాన్స్ఫర్స్లో ఉపయోగం కూడా లేకుండా పోయిందని, గతంలో బదిలీలు సంవత్సరం పాటు జరపడం, వారికి బదిలీ ఆర్డర్స్ కూడా ఇవ్వక చాలా మంది రిలీవ్ కాలేకపోయారని, కనుక బ్లాక్ చేయకుండా ట్రాన్స్ఫర్స్ జరపాలని ఉపాధ్యాయులు ఆశిస్తున్నారన్నారు.

బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ ప్రకటించాలి: ఆపస్

ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న బదిలీలు, ప్రమోషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ శ్రావణ్ కుమార్, ఎస్. బాలాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విధంగా అడ్వాక్ సర్వీస్ రూల్స్ ఆమోదించి ఎంఈఓ, జూనియర్ లెక్చరర్లు, డైట్ లెక్చరర్స్, హెడ్మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్లు అన్ని క్యాడర్ల ప్రమోషన్లను చేపట్టేందుకు షెడ్యూల్ విడుదల చేయాలని, శాశ్వత ప్రాతిపదికన బదిలీల కోడ్ రూపొందిం చాలని వారు కోరారు.

సెలవుల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి: ఏపీ ఎస్సీ ఎస్టీయూ

వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులకు పదోన్న తులను, బదిలీలను చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సామల సింహాచలం, మేకల శివార్జున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ పదోన్నతులు, బదిలీలు కోసం ఎదురు చూస్తున్నారన్నారు.

బదిలీ కోడ్ రూపొందించాలి: ఎన్డీఏ

ఉపాధ్యాయ బదిలీ కోడ్ రూపొందించాలని నవ్యాంధ్ర టీ చర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ మాగంటి శ్రీనివాసరావు కోరారు. వేసవి సెలవుల్లో బదిలీలు నిర్వహిస్తే విద్యా సంవత్సరానికి ఆటంకం కలగదన్నారు. అలాగే ఎస్జీటీ, ఎస్ఏ, జేఎల్ పదోన్నతులు కల్పించాలని కోరారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Prepare the field for teacher transfers!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0