Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC SELECTION POST PHASE X 2022 APPLICATIONS INVITING FOR 2065 VACANCIES HERE DETAILS

 SSC Job Notification 2022: నిరుద్యోగులకు అలర్ట్.. 2065 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలా అప్లై చేసుకోవాలో వివరణ.

SSC SELECTION POST PHASE X 2022 APPLICATIONS INVITING FOR 2065 VACANCIES HERE DETAILS


నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లోని పలు కేటగిరీల్లో భారీగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లోని పలు కేటగిరీల్లో భారీగా ఖాళీలను (Central Government Jobs) భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. మొత్తం 2065 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్  నుంచి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 13వ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించనున్నారు.

నర్సింగ్ ఆఫీసర్లు, సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్లు, టెక్నికల్ ఆఫీసర్లు, రిసెర్చ్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ల్యాబొరేటరీ అటెండెంట్లు, పర్సనల్ అసిస్టెంట్, సర్వేయర్, ఎంటీఎస్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

విద్యార్హతల వివరాలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టులను అనుసరించి టెన్త్ ఇంటర్, గ్రాడ్యుయేషన్ తదితర విద్యార్హతలను కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25, జనరల్ అవేర్ నెస్ నుంచి 25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి మరో 25 ప్రశ్నలు ఉంటాయి.

అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

దరఖాస్తు విధానం

  • స్టెప్-1: సంస్థ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inను సందర్శించాలి.
  • స్టెప్-2: హోమ్ పేజీలోని ఎస్‌ఎస్‌సీ క్యాండిడేట్స్ పోర్టల్‌లో అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
  • స్టెప్-3: ఆ తరువాత ఫేజ్ X 2022 పరీక్ష కోసం లాగిన్ అయి దరఖాస్తు చేసుకోండి.
  • స్టెప్-4: అన్ని వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. అలాగే అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  • స్టెప్-5: ఆపై దరఖాస్తు రుసుమును చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి.
  • స్టెప్-6: దరఖాస్తు ఫారమ్ కన్ఫర్‌మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోండి.
  • స్టెప్-7:  దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 13, 2022 వరకు అవకాశం ఉంది.

ప్రిప‌రేష‌న్ విధానము

SSC Phase-10 Preparation: స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌లో 2065 ఉద్యోగాలు.. ప‌రీక్ష విధానం, ప్రిప‌రేష‌న్ టిప్స్ ఫాలో అవ్వండి

SSC Phase-10 Exams Preparation Plan స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సెలక్షన్ పోస్ట్ ఫేజ్ X-2022 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం తెలుసుకొని ప్రిపరేషన్ ప్లాన్ సిద్ధం చేసుకొంటే కేంద్ర కొలువు సాధించడం పెద్ద కష్టమేమి కాదు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సెలక్షన్ పోస్ట్ ఫేజ్ X-2022 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ssc.nic.inల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 13లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కంప్యూటర్ మోడ్‌లో ఆగస్టు 2022లో జరుగుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 2065 ఖాళీలను ఎస్‌ఎస్‌సీ భర్తీ చేయనుంది.  ఈ నేపథ్యంలో  పరీక్ష విధానం తెలుసుకొని ప్రిపరేషన్ ప్లాన్ సిద్ధం  చేసుకొంటే కేంద్ర కొలువు సాధించడం పెద్ద కష్టమేమి కాదు.

ఈ పరీక్షలో వ‌చ్చే విభాగాలు

  • (i) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
  • (ii) జనరల్ ఇంటెలిజెన్స్
  • (iii) ఇంగ్లీష్‌
  • (iv) జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్

ప‌రీక్షా విధానం.

స‌బ్జెక్ట్ప్ర‌శ్న‌లుమార్కులు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్2550
జనరల్ ఇంటెలిజెన్స్2550
ఇంగ్లీష్‌2550
జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్2550
మొత్తం100200

ఎక్జామ్ టిప్స్.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో సాధారణంగా ప్రతి సంవత్సరం కొన్ని పునరావృతమయ్యే ప్రశ్నలు ఉంటాయి. ఈ అంశాల‌ను గుర్తిస్తే జనరల్ నాలెడ్జ్ చాలా స్కోరింగ్ కావచ్చు.

గణితానికి సంబంధించిన బేసిక్స్‌పై ఎక్కువ ప్ర‌శ్న‌లు అడుగుతారు. కాబ‌ట్టి పెద్ద సూత్రాల కంటే మౌలిక సూత్రాల అభ్యాసం అవ‌స‌రం.

ఈ పరీక్ష తయారీకి కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యం. సొంతంగా నోట్స్ చేసుకొవ‌డం వ‌ల్ల క‌రెంట్ ఎఫైర్స్ త‌ప్పులు లేకుండా ఆన్సర్ చేయొచ్చు.

తెలుగు మీడియం (Telugu Medium) నుంచి వ‌చ్చే వారికి ఇంగ్లీష్ (English) కాస్త క‌ఠినంగా అనిపించినా.. పర్యాయపదాలు, వ్యతిరేకపదాలు, వన్-వర్డ్ సబ్‌స్టిట్యూషన్ & ఇడియమ్స్/పదబంధాలు అభ్య‌సం చేసినా మంచి స్కోర్ చేయొచ్చు.

Note - అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం నెగిటీవ్ మార్కింగ్. 0.5 మార్కులు ప్రతీ తప్పు ప్రశ్నకు నష్టపోతారు కాబట్టి కచ్చిమైన సమాధానాలు సాధించడం అభ్యాసం చేయాలి.

ప్రిప‌రేష‌న్ ప్లాన్ ఎలా ఉండాలి.

టైమ్ టేబుల్‌ని రూపొందించుకోండి: ప‌రీక్ష‌ప్రిప‌రేష‌న్ (Exam Preparation) అయ్యే వారు ముందుగా ఏం చ‌ద‌వాలి. ఎప్పుడు ఏ స‌బ్జెక్ట్‌కు ఎంత స‌మ‌యం కేటాయించాలో క‌చ్చితంగా టైం టేబుల్ ఉండాలి. మీ స‌క్సెస్ ఆ టైం టేబుల్ త‌యారీపై ఆధార ప‌డి ఉంటుంది.

కాన్సెప్ట్‌లపై దృష్టి: ఎక్కువ విష‌యాలు చ‌ద‌వ‌డం కాకుండా. అవ‌స‌ర‌మైన కాన్సెప్ట్‌ల‌ను నోట్ చేసుకొని వాటిని ప్రిపేర్ అవ్వాలి. రిపీటెడ్ ప్ర‌శ్న‌ల‌ను అభ్య‌సం చేస్తూనే వాటి కాన్సెప్ట్ నేర్చుకోండి. స్కోరింగ్ రిపీటెడ్ కాన్సెప్ట్ చాలా అవ‌స‌రం

స్వీయ-అంచనా : ఎవ‌రికీ చెప్ప‌కున్నా మీకు మీరు త‌ర‌చూ అంచ‌నా వేసుకోవాలి. ప్ర‌తీ నాలుగు రోజుల‌కు మోడ‌ల్ పేప‌ర్ చేసి. మార్కుల వ్య‌త్యాసం గుర్తించడం. ఏ కాన్సెప్ట్ వీక్ ఉన్నారో అవి ప్రిపేర్ అవ్వాలి. స్వీయ అంచనాకు మించి మాస్టర్ ఎవ్వ‌రూ లేరు.

మాక్ టెస్ట్‌లు: SSC CHSL ప్రిపరేషన్‌లో మాక్ టెస్ట్‌లు (Mock Test) ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రతీ ప‌రీక్ష‌లో 10 నుంచి 15శాతం రిపీటెడ్ ప్ర‌శ్న‌లు లేదా కాన్సెప్ట్‌లు ఉంటాయి. వీటిని త‌క్కువ క‌ష్టంతోనే నేర్చుకోవ‌చ్చు. ఇవీ మార్కులు పెంచుతాయి. మాక్ టెస్ట్‌లు రాయ‌డం ద్వారా వీటిని సుల‌భంగా సాధించ‌వ‌చ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSC SELECTION POST PHASE X 2022 APPLICATIONS INVITING FOR 2065 VACANCIES HERE DETAILS "

Post a Comment