Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About 1998 DSC

 1998 DSC చరిత్ర

About 1998 DSC

1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ-1998 నోటిఫికేషన్ జారీచేసింది. ఆ సమయంలో అభ్యర్థుల కటాఫ్ మార్కులకు సంబంధించి.. ఓసీలకు 50, బీసీలకు 45; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించింది. ఆ మేరకు అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు కూడా పిలిచారు. దీనికి సంబంధించి అప్పటి ప్రభుత్వం 221 జీవోను జారీ చేసింది. అయితే కొన్ని విభాగాల్లో కటాఫ్ ఉన్న అభ్యర్థులు లేకపోవడంతో ఓసీలకు 45, బీసీలకు 40; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 35 మార్కులను కటాఫ్‌గా నిర్ణయిస్తూ ప్రభుత్వం మరో జీవో 618 విడుదల చేసింది.

అయితే అదే సమయంలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడంతో కొన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఆయా జిల్లాల్లో తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రభుత్వం ఇలా రెండు జీవోలు జారీచేయడంతో.. మొదట 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత.. 618 జీవో ప్రకారం తక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది.

కాని అధికారుల పొరపాటుతో ఎక్కువ కటాఫ్, తక్కువ కటాఫ్ ఉన్న రెండురకాల అభ్యర్థులను ఒకేసారి ఇంటర్వ్యూలకు పిలిచారు. దీంతో 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు లభించలేదు. దీంతో వీరంతా ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.

పలు దఫాలుగా అభ్యర్థుల వాదనలు విన్న ట్రైబ్యునల్ వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని 2009లో ఆదేశాలు జారీచేసింది. 2011లో హైకోర్టు కూడా త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే డీఎస్సీ నియామకాలకు సంబంధించి హైకోర్టు తీర్పు కూడా అమలుకాకపోవడంతో అభ్యర్థులు చివరగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ-1998 మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది.

ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం తో 1998 DSE క్వాలిఫైడ్ అభర్ధులకు మోక్షం కలుగబోతుంది

DSC-1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల లిస్ట్ 

DOWNLOAD DSC-1998 LIST

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "About 1998 DSC"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0