Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Center good news for farmers .. Modi govt announces minimum support price for kharif crops.

 PM Modi : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన మోడీ సర్కార్ .

రైతులకు ఊరట కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ పంటలకు MSP (కనీస మద్దతు ధర)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

2022-23 సీజన్‌కు ఖరీఫ్ పంటల MSP ఆమోదించబడింది. ప్రస్తుతం, 2021-22 వరి ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.1940 ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 17 పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది కేంద్రం. వరి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.100 పెంచినట్టు కేంద్రం తెలిపింది. దీంతో క్వింటాల్‌కు ధాన్యం ధర రూ. 2040కి అయ్యిందని కేంద్రం తెలిపింది. ఇందులో సోయాబిన్‌కు క్వింటాల్‌కు రూ.300, కందులపై ఎంఎస్‌పీ రూ.300 , పెసర్లు రూ.480 , నవ్వులు రూ. 523 , పొద్దుతిరుగుడుపై రూ. 385 పెంచినట్టు కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, ఖరీఫ్, రబీ సీజన్‌లో ఎరువుల అవసరాలను తీర్చడానికి భారతదేశంలో తగినంత యూరియా నిల్వ ఉన్నాయని అన్నారు. డిసెంబర్ వరకు దానిని దిగుమతి చేసుకోవలసిన అవసరం లేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు తగ్గుముఖం పట్టాయని, రానున్న ఆరు నెలల్లో వీటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. దేశంలో తగినంత యూరియా అందుబాటులో ఉంది. దేశీయ అవసరాలకు అనుగుణంగా డిసెంబర్ వరకు యూరియా నిల్వ ఉంది. డిసెంబర్ వరకు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు.

యూరియా తగినంత స్టాక్

డి-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP) విషయంలో డిసెంబరు నాటికి స్థానిక డిమాండ్‌ను తీర్చడానికి దేశీయ ఉత్పత్తితో పాటు దీర్ఘకాలిక దిగుమతి విధానం సరిపోతుందని కేంద్ర మంత్రి మాండవ్య వెల్లడించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం సరసమైన ధరలకు ఎరువులు అందుబాటులో ఉండేలా సబ్సిడీని పెంచిందన్నారు. అక్టోబరులో రబీ పంటల నాట్లు ప్రారంభం కాగా ఖరీఫ్ (వేసవి నాట్లు) సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల వద్ద 70 లక్షల టన్నుల యూరియా నిల్వ ఉండగా.. 1.6 మిలియన్ టన్నుల యూరియా దిగుమతి అవుతోంది. డిసెంబర్ నాటికి 175 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుందని ఎరువుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది కాకుండా, బరౌని, సింద్రీలోని రెండు కొత్త ప్లాంట్ల నుండి ఆరు లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉంటుందన్నారు. ఇది అక్టోబర్‌లో ప్రారంభించబడుతుందని.. మరో రెండు మిలియన్ టన్నుల సాంప్రదాయ యూరియా వినియోగం లిక్విడ్ నానో యూరియాతో భర్తీ చేయబడుతుందని అధికారి తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Center good news for farmers .. Modi govt announces minimum support price for kharif crops."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0