Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you know of a village where theft does not take place? Is that the only village in the world like that?

దొంగతనమే జరగని గ్రామం గురించి తెలుసా? ప్రపంచంలో అటు వంటి గ్రామం అదొక్కటే ?

Do you know of a village where theft does not take place?  Is that the only village in the world like that?

సాధారణంగా మన వస్తువులను సంపదను భద్రపరుచుకోవడానికి ఇల్లు కట్టుకుని దానికి తలుపులు వేయిస్తాం. అయితే ప్రపంచంలో ప్రస్తుతం నివాసయోగ్యంగా ఉన్న కేవలం ఒక్క గ్రామంలో మాత్రం ఇల్లకు ఎటువంటి తలుపులు ఉండవు. కేవలం ప్రజల ఇళ్లకే కాకుండా పోస్టాఫీసు, ఆసుపత్రి తదితర ప్రభుత్వ భవనాలకు కూడా ఎటువంటి ద్వారాలు ఉండవు. అక్కడ ఉన్న ఒక దైవం తమ సంపదను రక్షిస్తోందన్న నమ్మకమే ప్రజలను ఇంటికి తలుపులు చేయించడం లేదు. ఇది పది, పదిహేనేళ్ల నాటి సంగతి కాదు. కలియుగం మొదటి నుంచి కూడా ఇటువంటి పరిస్థితే ఉంది. ప్రజలు పక్క ఊరికి వెళ్లినా కూడా ఇంటికి తలుపులను బిగించి వెళ్లరు. గొళ్లెం, తాళాల ఊసే లేదు. ఈ గ్రామం మన దేశంలోనే ఉంది. ఆ గ్రామం ఏమిటి ఎక్కడ ఉంది, దిని విశిష్టతలు తదితర విషయాలకు సంబంధించిన కథనం పాఠకుల కోసం.

మహారాష్ట్రలోని, శని శింగనాపూర్ లో ఉన్న ఈ ఆలయం శని దేవుని ముఖ్య పుణ్యక్షేత్రం. ఇక్కడ ఆ పరమాత్ముడు అరుబయటనే ఉంటాడు. ఎటువంటి ప్రత్యేక దేవాలయం ఉండక పోవడం ఇక్కడ ఉన్న విశిష్టత. తాను అనంతానంత స్వరూపడని ప్రజలకు చెప్పే క్రమంలోనే శనీశ్వరుడు తనకు దేవాలయం అవసరం లేదని ఇక్కడి వారికి చెప్పినట్లు స్థానిక కథనం

స్వయంభువుడుశని శింగనాపూర్ అనే గ్రామం ప్రసిద్ధ పుణ్యక్షేతమైన షిరిడి నగరానికి మరియు ఔరంగాబాద్ నగరానికి మధ్యలో నెలకొని ఉంది. ఇక్కడి దైవము "స్వయంభు" అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించినదదని అర్థం. నల్లని, గంభీరమైన రాతి విగ్రహం. కచ్చితంగా ఏ కాలానికి చెందినదో ఎవరికీ తెలియదు. అయినా చాలా కాలం నుంచి ఈ విగ్రహాన్ని ఇక్కడ పూజిస్తున్నారు.

పూర్వం శని శింగనాపూర్ ఒక కుగ్రామం. స్థానిక పల్లెటూరికి చెందిన గొర్రెల కాపురుల చెప్పే కథనం ప్రకారం... స్వయంభువుడైన శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువైయున్నాడు. కనీసం కలియుగం ప్రారంభం నుండి దీని ఉనికి ఉన్నట్టుగా నమ్ముతారు. అప్పటి నుంచి ఉన్నాకూడా ఇక్కడ దేవుడికి దేవాలయం లేకపోవడం విశేషం. ఎంత ప్రయత్నించినా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించలేరు.

పూర్వం గొర్రెల కాపరి అటు వైపుగా వెలుతూ తన చేతిలో ఉన్న కర్రతో ఈ రాతి పై గట్టిగా మొదాడు. వెంటనే రాతి నుంచి రక్తం స్రవించడం మొదలయ్యింది. వెంటనే అక్కడ ఒక ప్రకాశవంతమైన వెలుగు ప్రసురించింది. ఈ విషయాన్నిగొర్రె కాపరులు దిగ్బ్రాంతితో చూడసాగారు. ఈ విషయం ఆనోటా ఈ నోట గ్రామం మొత్తం చేరిపోయింది. వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతాన్ని చూచేందుకు గుమికూడింది.

ఆ రోజు రాత్రి శనీశ్వరుడు గొర్రెల కాపరి స్వప్నంలో కనిపించాడు. తాను "శనీశ్వరుడి"నని చెప్పెను. అద్వితీయముగా కనిపించుచున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని కుడా ఆ గొర్రె కాపరికి చెప్పాడు. గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించడమే కాకుండా తన తప్పును క్షమించమని వేడుకొన్నారు. తన తప్పుకు శిక్షగా తాను స్వామికి ఆలయం నిర్మించి ఇస్తానని ప్రాధేయపడ్డాడు. శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని చెప్పాడు. తాను సర్వేశ్వరుడినని చెప్పడమే కాకుండా తనకు ఎటువంటి దేవాలయం అవసరం లేదని స్పష్టం చేశాడు. తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని చెప్పెను. ప్రతిరోజూ పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా 'తైలాభిషేకం' చేయమని శనీశ్వరుడు గొర్రెల కాపరికి చెప్పెను. దీంతో గొర్రెల కాపరి తన ప్రయత్నాన్ని విరమించాడు.

అంతేకాక మొత్తం పల్లెకి బందిపోటుల లేదా కన్నములు వేసే వారు లేదా దొంగల భయం ఉండదని మాట ఇచ్చెను. అందుచే ఈరోజు వరకు కూడా శనీశ్వర స్వామిని ఎటువంటి కప్పు లేకుండా ఆరు బయట చూడవచ్చును. ఈ రోజు వరకు ఏ ఇంటికి, దుకాణముకు, ఆలయముకు కూడా తలుపులు ఉండవు. తపాలా కార్యాలయానికి కూడా తలుపులు, తాళాల ప్రసక్తి లేకపోవడం మనం చూసి నమ్మవచ్చు.

ఇళ్లతో పాటు దుకాణాలకు కూడాశనిభగవానుని యందు భయముచే, శనిభగవానుని ఆలయము వద్ద ఒక కిలోమీటరు వ్యాసార్థం లోపల ఉన్న నివాస స్థలములు, గుడిసెలు, దుకాణములు మొదలైనవాటి వేటికి తలుపులు కాని తాళాలు కాని ఉండవు. శని శింగనాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటు వంటి స్థానికులే కాకుండా పోలీసు రికార్డులు కూడా స్పష్టం చేస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you know of a village where theft does not take place? Is that the only village in the world like that?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0