Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Dsc-1998

 AP Dsc-1998: ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి.. ఆయన స్టోరీ వింటే కన్నీళ్లు రాకమానవు..!

AP Dsc-1998


AP D.Sc 1998: ప్రస్తుతం 1998 డీఎస్సీకి క్వాలిఫై అయిన వారిలో కొందరి పరిస్థితి ఇలాగే ఉంది. వారిలో కొందరు ఏవేవో ఉద్యోగాలు సాధించి సెటిలైతే మరికొందరు ఏం చేయాలో తెలియక జీవితాన్ని ప్రశ్నార్ధకం చేసుకున్నారు. ఒకరిద్దరు అభాగ్యులుగా మిగిలిపోయారు. అలాంటి వారిలో ఒకరే శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) పాతపట్నం మండలం పెద్దసీది గ్రామానికి చందిన అల్లక కేదారేశ్వరరావు.

కొన్ని అనుకోని ఘటనలు కొందరి జీవితాలను ఊహించని మలుపులు తిప్పుతాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగానికి అర్హత సాధించినా అందని ద్రాక్షగా మారితే.. ఎలా ఉంటుంది. జరగాల్సిన న్యాయం సమయానికి జరగకపోయినా అన్యాయం జరిగినదానికంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. జీవితాలు నాశనమయ్యాక కష్టానికి తగ్గిన ఫలితం వచ్చినా అది శూన్యమే. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత సాధించి.. ఎవేవో కారణాల వల్ల ఆలస్యమయితే వారి జీవితం అంథకారంలో పడ్డట్లే. ఆ ఉద్యోగం కోసం ఎదురు చూడలేరు.. మరో ఉద్యోగానికి వెళ్లనూ లేరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) లో 1998 డీఎస్సీకి క్వాలిఫై అయిన వారిలో కొందరి పరిస్థితి ఇలాగే ఉంది. వారిలో కొందరు ఏవేవో ఉద్యోగాలు సాధించి సెటిలైతే మరికొందరు ఏం చేయాలో తెలియక జీవితాన్ని ప్రశ్నార్ధకం చేసుకున్నారు. ఒకరిద్దరు అభాగ్యులుగా మిగిలిపోయారు.

అలాంటి వారిలో ఒకరే శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) పాతపట్నం మండలం పెద్దసీది గ్రామానికి చందిన అల్లక కేదారేశ్వరరావు. ఈయన 1994లో డీఎస్సీని తృటిలో కోల్పోయారు.. 1996లో సెలెక్ట్ అయినా కొన్నికారణాల వల్ల అవకాశం రాలేదు. ఆ తర్వాత కష్టపడి చదివి 1998లో డీఎస్సీకి క్వాలిఫై అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ ఏడాది డీఎస్సీ వివాదంలో పడింది. దీంతో కేదారేశ్వరరావు జీవితం అల్లకల్లోలమైంది. మంచి చదవు, వాగ్దాటి, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం ఉన్నా.. ఆయన మాత్రం నిరాశలోకి వెళ్లిపోయారు.

అంతేకాదు అప్పటివరకు హాయిగా ఉన్న జీవితం ఒక్కసారి తలక్రిందులైంది. నిర్వేదంలో తన గురించి తానే పట్టించుకోవడం మానేశాడు. సరైన తిండిలేక ముఖంలో జీవం పోయింది. సరే జరిగిందేదో జరిగిపోయిందని.. అన్నీ వదిలేసి.. సైకిల్ పై బట్టల వ్యాపారం చేద్దామనుకుంటే.. ఆయన రూపం చూసి ఎవరూ కొనేవారు కాదు. పైగా చులకనగా చూసేవారు. దీంతో తినడానికి తిండిలేక కాలే కడుపు నింపుకోవడానికి యాచించడానికి కూడా వెనుకాడలేదు. ఆయన ఇంతటి విద్యావంతుడా అంటే ఎవరూ నమ్మేవారు కూడా కాదు, గ్రామంలో బాగా తెలిసిన వాళ్లకే కేదరాశ్వేరరావు గురించి తెలుసు.

అలాంటిది ఇప్పుడు అంటే ఆయన డీఎస్సీకి క్వాలిఫై అయిన తర్వాత 24 ఏళ్లకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆయన వయసు 55 ఏళ్లు. అంటే గట్టిగా పదేళ్లు కూడా ఉద్యోగం చేయకుండానే రిటైర్ అవ్వావ్సిన పరిస్థితి. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆయనకు ఉద్యోగం వచ్చిన ఆయనకే తెలియదు. స్థానికంగా ఉండే కొందరు యువకులు తమ మొబైల్స్ లో చెక్ చేసి చెప్పిన తర్వాతే ఉద్యోగం వచ్చినట్లు తెలిసింది.

DSC-1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల లిస్ట్ 

DOWNLOAD DSC-1998 LIST

VIEW THE VIDEO


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Dsc-1998"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0