Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Exact reasons not to have a house near the temple.

 గుడి దగ్గర్లో ఇల్లు ఉండకూదనడానికి ఖచ్చితమైన కారణాలు.

గుడి నీడ ఇంటి మీద పడే విధంగా ఇల్లు నిర్మించకూడదంటారు. నిజమేనా...? 

గుడినీడ పడకూడదు అంటే గుడికి దగ్గర ఇల్లు నిర్మించరాదు అని అర్థం. గుడి అత్యంత శక్తివంతమైనది. ఆ శక్తి గుడి పరిసరాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని సమయాల్లో ఈ శక్తి ఇంటిని ప్రశాంతంగాఉంచకపోవచ్చు. 

అందుకనే పురాతన గుళ్ళుచూసినట్లైతే గర్భగుడి చుట్టూ ఒకటికంటే ఎక్కువ ప్రహరీ గోడలు నిర్మించి ఉండటం గమనించినవచ్చు. అందువల్ల గుడి గోడ నీడ పడే విధంగా ఇంటిని నిర్మించకుండా ఉంటే మంచిది.

అసలు గుడికి దగ్గర్లో ఇల్లు కట్టుకోవచ్చా? ఒకవేళ కట్టుకుంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి? ఆ విషయాలే ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాని మనిషికి ప్రశాంతత మాత్రం కరువైపోయింది. మనసు ప్రశాంతత కోరినప్పుడు చాలా మంది గుడికి వెళ్తుంటారు. అందుకే ఇప్పటికి చాలా మంది గుడికి దగ్గర్లో ఇల్లు కట్టుకుంటారు. కాని ప్రాచీన గ్రందాల ప్రకారం కొన్ని మంచి, కొన్ని చెడు ప్రభావాలు ఉంటాయని తెలుస్తుంది.

శాస్త్రాల ప్రకారం దేవాలయం బయట ఉండే ధ్వజస్తంభం యొక్క నీడ ఇంటిపైన పడకూడదనే సూత్రం ఉంది. వాస్తు శాస్త్రంలో ఈ విషయం పై చక్కని వివరణ కూడా ఉంటుంది. అలాగే ధ్వజస్తంభానికి ఎదురుగా ఇల్లు కట్టుకుంటే హాని జరుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయి.

అదే విధంగా శివుని గుడికి, గ్రామ దేవతల గుడికి, అమ్మవారి గుడికి ఎదురుగా ఇల్లు కట్టుకోకుడదు. శివాలయం ఎదురుగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనీసం 100 అడుగుల దూరం పాటించాలి. శివుని యొక్క చూపు ఎల్లవేళలా ఇంటి పైన పడటం అంత క్షేమం కాదట. ఈ విషయాన్ని ప్రాచీన గ్రంధాల్లో వివరించారు.

అలాగే విష్ణు దేవుని గుడి వెనకాల కూడా ఇల్లు కట్టుకోకూడదని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనీసం 20 అడుగుల దూరం పాటించాలి.

శక్తి ఆలయాలకు ఇరు వైపులా కూడా ఇల్లు కట్టుకోకూడదు అంటున్నాయి శాస్త్రాలు. ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనీసం 120 అడుగుల దూరం పాటించాలని వాస్తు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కొన్ని గ్రంధాలలో శక్తి ఆలయాలకు వెనక వైపున ఇల్లు కట్టుకోకుడదు. కొన్ని గ్రంధాలలో విష్ణు దేవుని ఆలయానికి పక్క ఇల్లు కట్టుకోకుడదు అని ఉన్నాయి. అలాగే కొన్ని గ్రంధాలలో శక్తి ఆలయాలకు వెనక వైపున ఇల్లు కట్టుకోకుడదు అని ఉన్నాయి.

మిగితా దేవుళ్ళ యొక్క ఆలయాలకి 80 అడుగుల లోపల ఎటువంటి నివాసయోగ్యమైన ఇల్లు కట్టకూడదట.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Exact reasons not to have a house near the temple."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0