Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Exit those groups immediately

ఆ గ్రూపులనుండి వెంటనే ఎగ్జిట్ అవండి
Exit those groups immediately

  • నేడు క్రిప్టో ట్రేడింగ్‌
  • దేశవ్యాప్తంగా నెలకు రూ.30కోట్ల మోసం

 క్రిప్టో కరెన్సీ, బిట్‌ కాయిన్‌ ట్రేడింగ్‌ల పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌ల నుంచి ఎగ్జిట్‌ కావాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ గ్రూపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకు రెండు, మూడు కోట్ల మోసం జరుగుతుండగా, దేశ వ్యాప్తంగా రూ.30 కోట్లకుపైగా ఉంటుంది. క్రిప్టో ట్రేడింగ్‌లో భారీ లాభాలున్నాయంటూ నమ్మిస్తూ అమాయకులను నైజీరియన్‌, ఉత్తరభారత దేశానికి చెందిన పలువురు సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు.

పదేండ్ల కిందట బిళ్లలాట..!
పదేండ్ల కిందట బిళ్లలతో ఆటాడుతూ గ్యాంబ్లింగ్‌ చేసేవారు. లేబర్‌ అడ్డాలు, బస్‌స్టాండ్‌లు.. ఇతర ప్రాంతాల్లో బిళ్లలు కలుపుతూ గ్యాంబ్లింగ్‌ ఆడేవాళ్లు. ఆ ఆట నిర్వహించే గ్యాంగ్‌ అంతా చుట్టముట్టి ఆటలో పాల్గొంటూ భారీ లాభాలు గెలుచుకున్నట్లు నటిస్తూ.. ఆట చూసేందుకు వచ్చిన సామాన్యులను రెచ్చగొట్టి చాలా మందిచే పెట్టుబడి పెట్టించి జేబులు గుళ్లచేసేవారు. దీనిపై హైదరాబాద్‌ పోలీసులు ఉక్కుపాదం మోపడంతో నేడు ఆ ఆట దాదాపు కరుమరుగైంది.

ఇప్పుడు క్రిప్టో కరెన్సీ పేరుతో..
టెక్నాలజీ ముసుగులో ఇప్పుడు వాట్సాప్‌ అడ్డాగా మోసాలకు పాల్పడుతున్నారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెడితే రెండింతలు వస్తాయని అమాయకులను నమ్మిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. వివిధ మార్గాల ద్వారా ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్న సైబర్‌నేరగాళ్లు ఆ నంబర్లతో వాట్సాప్‌లో బిట్‌కాయిన్‌, బిట్స్‌1, క్రిప్టో ట్రేడ్‌, క్రిప్టో1, బిట్‌ ఆర్మీ తదితర పేర్లతో గ్రూప్‌ను తయారు చేస్తున్నారు. అందులో ఉన్న సైబర్‌ నేరగాళ్లు వివిధ పేర్లతో అమాయకుల నంబర్లను యాడ్‌ చేస్తున్నారు.

గ్రూపులో చర్చపెట్టి.. రెచ్చగొట్టి..!
పలానా క్రిప్టో కరెన్సీ ట్రెండింగ్‌లో ఉందంటూ బిట్‌కాయిన్‌లో భారీ లాభాలు వచ్చాయంటూ సైబర్‌ నేరగాళ్లు చర్చించుకుంటారు. అందులో ఉండే మిగతా గ్రూప్‌ సభ్యులలో ఎవరైనా స్పందిస్తే.. వారిని మాయమాటతో నమ్మిస్తారు. వారికి ఒకటి, రెండు రోజులు సలహాలు, సూచనలు ఇచ్చిన తర్వాత వారికి వాట్సాప్‌లో యాప్‌ లింక్‌ పంపిస్తారు. ఆ యాప్‌ ద్వారానే ట్రేడింగ్‌ చేయాలంటూ సూచిస్తారు. ముందుగా కొంత మొత్తంలో బిట్‌కాయిన్‌, ఇతర క్రిప్టోకరెన్సీని కొనిపించి దాని వ్యాలెట్‌ నంబర్‌ తీసుకుంటారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ యాప్‌లో స్క్రీన్‌పై పెట్టుబడి పెట్టిన క్రిప్టో కరెన్సీకి భారీ లాభాలు వచ్చినట్లు చూపిస్తారు. అదే భ్రమలో బాధితులు నెమ్మదిగా పెట్టుబడి పెంచుతూ వెళ్తారు. ఎప్పుడైతే లాభాలను డ్రా చేసుకోవాలని ప్రయత్నిస్తారో, ఆ యాప్‌లో నుంచి డ్రా చేసుకునేందుకు అవకాశముండదు. దీంతో యాప్‌ నిర్వాహకులను నిలదీయడంతో సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ చేస్తూ తప్పించుకుంటారు. ఇలా అనేకమంది కోట్ల రూపాయలు మోసపోయిన తరువాత కండ్లు తెరుస్తున్నారు.

వాట్సాప్‌ గ్రూప్‌లలో స్పందించొద్దు:కేవీఎం ప్రసాద్‌, సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ

సైబర్‌ నేరగాళ్లు వేసే వలలో చిక్కుకోవద్దు. బిట్‌కాయిన్స్‌, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ల పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌లలో సభ్యులుగా చేర్చుకున్నారంటే మిమ్మల్ని మోసం చేసేందుకు అని గుర్తించండి. వెంటనే ఆయా గ్రూప్‌ల నుంచి ఎగ్జిట్‌ కావాలి. డబ్బు త్వరగా సంపాదించాలని ఆశకు పోవద్దు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Exit those groups immediately"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0