Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

H - 1B Visa

 H - 1B Visa : స్టార్ట్లకు గుడ్న్యూస్ .. ఇక Green Card జారీ మరింత వేగవంతం.

H - 1B Visa


  • స్టార్ట్‌పలకు హెచ్‌-1బీ మరింత సరళీకృతం
  • గ్రీన్‌కార్డు జారీ ఇక వేగిరం. అమెరికా డీహెచ్‌ఎస్ ప్రతిపాదన

వాషింగ్టన్‌, జూన్‌ 24: స్టార్ట్‌పలకు హెచ్‌-1బీ వీసా (H-1B Visa) జారీ ప్రక్రియ మరిత సులభతరం చేసేందుకు అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (డీహెచ్‌ఎస్) ప్రతిపాదనలు రూపొందిస్తోంది.

ఇందులో భాగంగా మార్గదర్శక ఎజెండాకు అదనంగా.. ఫామ్‌ ఐ-485 ప్రాసెసింగ్‌ను మెరుగుపరిచేందుకు నియమాలను జారీ చేయాలని చూస్తోంది. దీంతో హెచ్‌-1బీ (H-1B Visa) మీద అమెరికాలో ఉంటూ గ్రీన్‌ కార్డు (Green Card) పొందేందుకు దశాబ్దాల పాటు వేచి చూసే పరిస్థితి మారనుంది. ఫామ్‌ ఐ-485.. అమెరికాలో ఒక వ్యక్తి చట్టబద్ధ శాశ్వత నివాస స్థితికి చేసే దరఖాస్తు.

ఇకపై ఈ దరఖాస్తులను వేగంగా పరిశీలించనున్నారు. 2023కు సంబంధించి క్రమబద్ధీకరణ ఎజెండాలో భాగంగా హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌ను ఆధునికీకరించాలని అమెరికా భావిస్తోంది. స్టార్ట్‌పలు.. హెచ్‌-1బీ నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాపై విదేశీ ఉద్యోగులను నియమించుకోవడాన్ని ఇది సులభతరం చేయనుంది. హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ విధానంలో మోసాలు, దుర్వినియోగాన్ని తగ్గించేందుకు పలు నిబంధనలను సవరించనుంది. దీంతో ప్రవాస భారతీయులకు గొప్ప మేలు చేకూరుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " H - 1B Visa"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0