Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Have you ever seen a Ramalayam without Lakshmana?

 లక్ష్మణుడు లేని రామాలయం ఎక్కడైనా చూసారా ?

Have you ever seen a Ramalayam without Lakshmana?

మనదేశంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయాలు చాలా ఉన్నాయి. కానీ హనుమంతుడు సీత సమేతంగా శ్రీరాముడు విగ్రహాలు మాత్రమే ఉండి లక్ష్మణుడి విగ్రహం లేకుండా ఏ గుడిలో ఉండవు. కానీ దేశం మొత్తంలో ఒక్క చోటే ఈ ఆలయం ఉంది. ఎక్కడంటే... ఎల్లప్పుడు రాముడికి తోడు నీడగా ఉండే లక్ష్మణుడు లేకుండానే తెలంగాణాలో నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గ్రామంలో ఒక రామాలయం ఉంది. మిగతా ఆలయాలతో పోలిస్తే ఈ రామాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో లక్ష్మణుడు లేకుండానే హనుమంతుడు సీత సమేతంగా శ్రీరాముడు కొలువుదీరాడు. 

ఒకసారి ఈ ఆలయం చరిత్రను పరిశీలిస్తే సుమారు రెండు వందల ముప్పై సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల కాలంలో శ్రీమతి శీలం జానకి బాయి వంశీయులు నిర్మించినట్టు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.

అంతే కాకుండా కాశీ చరిత్ర అనే పుస్తకంలో ఏనుగుల వీర స్వామి అనే సుప్రీం కోర్టు జడ్జి మద్రాసు నుంచి కాశి యాత్రగా వెళ్తూ 1830 జూలై 22వ తేదీన ఇందల్వాయి ఆలయాన్ని సందర్శించినట్లు కూడా పేర్కొనబడింది. ఈ ఆలయం చుట్టూ 30 మంది బ్రాహ్మణుల అగ్రహారం ఉండేదని పూర్వీకుల ద్వారా తెలుస్తోంది. దీనిని పరిశీలించిన ఆయన అప్పటి నిజాం నవాబుల ధాటికి తట్టుకుని బురదలో కమలం వలే వికసిస్తున్న ఆలయం అని ఆ కాశీ చరిత్ర పుస్తకంలో పేర్కొన్నట్టు చరిత్ర చదివిన వారు చెప్తున్నారు. 

ఇక్కడ వెలిసిన మూల విగ్రహం ఏడు అడుగుల ఎత్తులో ఉంటూ చుట్టూరా దశావతారాలతో పాటు సీతమ్మ తల్లిని తొడపై కూర్చుండబెట్టుకుని శ్రీరాముడు ఏకశిలా విగ్రహంగా కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వడం విశేషం. ఈ ఆలయంలో సీతా సమేతంగా శ్రీరాముడు హనుమంతుడు ఉండి లక్ష్మణుడు లేని దేవాలయంగా ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. వేలాది రామాలయాలు ఉన్న ఈ దేశంలో లక్ష్మణుడు లేని ఏకైక రామాలయం ఇదే అంటూ హిందూ ప్రముఖులు అంటున్నారు. అయితే ఈ దేవాలయం ఈమద్య నిర్మించినది కాదు, ఏకంగా 250 ఏళ్ల క్రితం నిర్మించిన దేవాలయం. అద్బుతమైన కట్టడంగా గుర్తింపు ఉన్న ఈ దేవాలయంలో లక్ష్మణుడు ఎందుకు లేడు అనే విషయమై రకరకాల కారణాలు స్థానికులు చెబుతూ ఉంటారు. 

ఈ దేవాలయంలో శ్రీరామచంద్రుల వారు ఆరు అడుగుల ఆజానుబాహు రూపంలో ఉంటాడు. ఇక్కడ లక్ష్మణుడు లేని శ్రీరామ చంద్రుడిని ప్రముఖ హిందూ పరిరక్షకులు శివాజీ గురువు సమర్ధ రామదాసు ప్రతిష్టించారు. ఆయన ఎన్నో దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ట చేశారు. అయితే స్థానిక పరిస్థితులు మరియు విశిష్టతల నేపథ్యంలో లక్ష్మణుడు లేకుండానే శ్రీరాముడి విగ్రహం ఏర్పాటు చేయాలని భావించాడు. శ్రీరామ చంద్రుల వారు ఆయన కలలో వచ్చి లక్ష్మణుడు లేకుండా విగ్రహ ఆవిష్కరణ చేయాల్సిందిగా చెప్పాడని కొందరు అంటూ ఉంటారు. మొత్తానికి లక్ష్మణుడు లేని ఈ రామాలయం దేశంలోనే ప్రత్యేకమైనదిగా భావించి జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జై శ్రీరామ్.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Have you ever seen a Ramalayam without Lakshmana?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0