Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Key instructions of Commissioner of School Education Department SSA Project Director on management of schools.

పాఠశాలల నిర్వహణ  పై పాఠశాల విద్యా శాఖ కమిషనర్ SSA ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ముఖ్య సూచనలు.

Key instructions of Commissioner of School Education Department SSA Project Director on management of schools.

ముఖ్య సూచనలు.

  • పాఠశాల రీ ఓపెన్ అయిన రోజు నుండే బోధన ప్రారంభించాలి. 
  • ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయులందరూ వారి పూర్తి సమయాన్ని బోధనకే కేటాయించాలి.
  • ప్రతి పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి.
  • ఇయర్ ప్లాన్స్, లెస్సన్ ప్లాన్స్, డైరీ లు ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వ్రాయాలి.
  • టాపిక్ రిలేటెడ్  టి ఎల్ ఏం వినియోగిస్తూ పాఠ్య బోధన చేయాలి.
  • పదిహేను (పక్షం) రోజులకు ఒక సారి ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం నిర్వహించాలి. 
  • ప్రతి నెల తల్లిదండ్రుల కమిటీ సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలి. 
  • ప్రభుత్వ పాఠశాలలలో అందిస్తున్న విద్య పట్ల సమాజం పూర్తి సంతృప్తి చెందేటట్లు బోధన కొనసాగాలి . 
  • మూడవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మొదటి మూడు నెలలు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి . 
  • విద్యార్థులందరికీ బేస్లైన్ టెస్ట్ నిర్వహించాలి . 
  • బేస్లైన్ టెస్ట్ లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వారిని  గ్రేడ్స్ గా విభజించించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
  • రోజు వారీ బోధనకు ఎలాంటి ఆటంకం లేకుండా జులై 5 నుండి జులై 30 మధ్య జే. వి. కే కిట్స్ పంపిణీ చేయాలి.
  • నాణ్యత లేని జే. వి. కే కిట్స్ ను తీసుకోరాదు. వెనక్కు ఇచ్చివేయాలి.
  • జే. వి. కే కిట్స్ నందు అన్ని ఐటమ్స్  వచ్చి  ఉన్న తరగతుల విద్యార్థులకు ముందుగా కిట్స్ పంపిణీ చేయాలి.
  • బయోమెట్రిక్ అటెండన్స్  తో మాత్రమే జే. వి. కే కిట్స్ పంపిణీ చేయాలి . 
  • పాఠశాలలోని బయోమెట్రిక్ పరికరాలను సిద్ధం చేసుకోవాలి . 
  • అవి పనిచేయని స్థితిలో ఉంటే గౌరవ జిల్లా కలెక్టరు గారి ఆదేశాల మేరకు  గ్రామ లేదా వార్డ్ సచివాలయం సిబ్బందిని సంప్రదించి వారి వద్దనున్న బయోమెట్రిక్  పరికరాలను వినియోగించాలి . 
  • కిట్స్ పంపిణీ విద్యార్థులందరికీ ఒకే రోజు కాకుండా పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను అనుసరించి యిరవై ఐదు నుండి యాభై మంది విద్యార్థులకు ఒక రోజు పంపిణీ చేసేటట్లు పాఠశాల వారీగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. 
  • పంపిణీ జరిగే  రోజు, సమయం పేర్కొంటూ టోకెన్స్ సిద్ధంచేసి వాటిని తల్లిదండ్రులకు ముందుగానే పంపించాలి. 
  • ఒకటో తరగతిలో, ఆరవ తరగతిలో  చేరిన ప్రతి విద్యార్దికి, ప్రవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు  ఏ తరగతిలో చేరినా వారందరికీ డిక్షనరీలు ఇవ్వాలి.
  • మిగిలిన తరగతుల విద్యార్థులకు గత సంవత్సరం డిక్షనరీలు ఇవ్వడం జరిగింది. కనుక ఈ సంవత్సరం ఇవ్వరాదు.
  • జే . వి. కే కిట్స్ పంపిణీ విషయంలో పత్రికలలో ఎలాంటి నెగటివ్ వార్తలు రాకుండా పంపిణీ సక్రమంగా చేయాలి.
  • జే. వి. కే కిట్లను మండల కేంద్రాల నుండి  స్కూల్ కాంప్లెక్స్ లకు పంపుటకు మండలవిద్యాశాఖాధికారులకు నిధులు కేటాయించడం జరిగింది.
  • కనుక ఏ మండల విద్యాశాఖాధికారి గాని, ప్రధానోపాధ్యాయుడు గాని వారి ఓన్ కాష్ వినియోగించవలసిన అవసరం లేదు. 
  • పాఠశాలలు ప్రారంభమైన వెంటనే స్కూల్ గ్రాంట్ పి. ఏం.ఎస్ ఎఫ్ అకౌంట్ కు జమచేయడం జరుగుతుంది. 
  • పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు అన్ని తరగతి గదులను, వాటర్ ప్లాంట్లను, మరుగు దొడ్లను అవసరమైన రిపైర్లు చేయించి వినియోగించుటకు వీలుగా ఉండేటట్లు కృషి చేయాలి.
  • నాడు నేడు పనులను నిర్ణీత సమయంలో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయుటకు కృషి చేయాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Key instructions of Commissioner of School Education Department SSA Project Director on management of schools."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0