Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

No more secretariats over schools - the government that issued the orders

పాఠశాలలపై ఇక సచివాలయాల పెత్తనం - ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

No more secretariats over schools - the government that issued the orders

విద్యాశాఖలో విపరీత ధోరణులకు ప్రభుత్వం తెరతీస్తోంది . తాజాగా పాఠశాలలపై గ్రామ , వార్డు సచివాల యాల సిబ్బందికి పెత్తనం అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది . పాఠ శాలలను వారానికి ఒకసారి తనిఖీ చేసే అధికారాలను గ్రామ , వార్డు సచి వాలయాల సిబ్బందికి అప్పగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచే సింది . పాఠశాలల పర్యవేక్షణకు మండల విద్యాధికారులు , ఉప విద్యాధి కారి పోస్టులు భర్తీచేయకుండా పాఠశాలల తనిఖీ అధికారాలను సచివా యాల సిబ్బందికి అప్పగించడాన్ని టీచర్లు వ్యతిరేకిస్తున్నారు . సచివాల యాల పరిధిలోని పాఠశాలల్లో సంబంధిత ఎడ్యుకేషన్ అసిస్టెంట్ , మహిళా పోలీసులకు తనిఖీ అధికారాలను కట్టబెట్టారు . తనిఖీ వివరా లను స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ( ఎస్ఓపీ ) ప్రకారం సంబంధిత యాప్ వివరాలను ఫొటోలతో అప్లోడ్ చేయాలి . వారం వారం క్రమం తప్పకుండా వీరు పాఠశాలలను తనిఖీ చేసి వివరాలను నమోదు చేయాలి . గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరెవరు ఏమి తనిఖీ చేయాలో కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు . వార్డు ఎడ్యుకేటర్ అసి స్టెంట్ / వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరి పాఠశాలలో విద్యార్థుల నమోదు , హాజరు పరిశీలించాలి . ఎక్కువ రోజులు పాఠశాల లకు గైర్హాజరయ్యే విద్యార్థులపై ఫోకస్ పెట్టి వారు తిరిగి హాజరయ్యేలా చూడాలి . నాడు- నేడు పథకం కింద పాఠశాలలకు కల్పించిన వసతులు , వాటి నాణ్యత , వినియోగిస్తున్న సామగ్రిని పరిశీలించాలి . మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించడంతోపాటు విద్యార్థులకు జేవీకే కిట్లు పంపిణీ చేశారా లేదా ఇస్తే విద్యార్థులు వినియోగిస్తున్నారా లేదా అనేది . పరిశీలించాలి . పాఠశాలల భద్రత , విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ఫోకస్ పెట్టి తనిఖీలు నిర్వహించి ప్రత్యేక యాప్ లో వివరాలన్నింటిని నమోదు చేయాలి . మహిళా పోలీసులు ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాలలను కనీసం నెలకు ఒకసారి తనిఖీ చేయాలి . వీరు పాఠశాలల్లో విద్యార్థుల భద్రత , ప్రమాణాలు , దిశ మొబైల్ అప్లికేషన్ , బాల్య వివాహాలను నిరోధిం చడం , పోక్సో చట్టం తదితర వాటి వివరాలను తనిఖీ చేసి యాప్లో వివ రాలు నమోదు చేయాలి . పాఠశాలలు తనిఖీ అధికారాలను గ్రామ , వార్డు సచివాలయాల సిబ్బందికి అప్పగించడంపై టీచర్లలో వ్యతిరేక వ్యక్తం అవు తున్నది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "No more secretariats over schools - the government that issued the orders"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0