SSC jobs
SSC jobs : పదోతరగతి విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు . అప్లికేషన్ ప్రాసెస్ , పరీక్ష విధానం.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భర్తీ చేస్తుంది. తాజాగా సెలక్షన్ పోస్ట్ ఫేజ్ X- 2022 కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను(Applications) ఆహ్వానిస్తోంది.
అర్హతలు.
సెలక్షన్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థి దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (హై స్కూల్) పరీక్షను పూర్తి చేసి ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
పరీక్షా విధానం.
సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 25 | 50 |
జనరల్ ఇంటెలిజెన్స్ | 25 | 50 |
ఇంగ్లీష్ | 25 | 50 |
జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్ | 25 | 50 |
మొత్తం | 100 | 200 |
ముఖ్యమైన అంశాలు
అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి చెల్లించవచ్చు. SBI చలాన్ రూపంలో SBI బ్రాంచ్‌ల్లో లేదా BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు రుసుమును చెల్లించవచ్చు. రిజర్వేషన్‌కు అర్హులైన షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వికలాంగులు (PwD), మాజీ సైనిక కుటుంబానికి (ESM)కి చెందిన మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం
- స్టెప్-1: సంస్థ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inను సందర్శించాలి.
- స్టెప్-2: హోమ్ పేజీలోని ఎస్‌ఎస్‌సీ క్యాండిడేట్స్ పోర్టల్‌లో అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
- స్టెప్-3: ఆ తరువాత ఫేజ్ X 2022 పరీక్ష కోసం లాగిన్ అయి దరఖాస్తు చేయగలరు.
- స్టెప్-4: అన్ని వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. అలాగే అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయగలరు.
- స్టెప్-5: ఆపై దరఖాస్తు రుసుమును చెల్లించి, ఫారమ్‌ను సమర్పించగలరు.
- స్టెప్-6: దరఖాస్తు ఫారమ్ కన్ఫర్‌మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోగలరు.
0 Response to "SSC jobs"
Post a Comment