Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Statue Of Equality

 Statue Of Equality: సమతా తరంగిణి.. తెలంగాణ సిగలో సమతామూర్తి నిలువెత్తు విగ్రహం.. పలు ఆసక్తికర విషయాలు.

Statue Of Equality

సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. 'సమానత్వం విగ్రహం'(Statue of Equality)గా పిలువబడే రామానుజాచార్య (Sri Ramanujacharya) 216 అడుగుల భారీ విగ్రహాన్ని  ఫిబ్రవరి 5 న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించి నారు.

శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో 45 ఎకరాల సువిశాల స్థలంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి నిర్మించిన ఆలయంలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహావిష్కరణకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహం. కాగా భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ విగ్రహాన్ని గతేడాది అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం. దీని ఎత్తు 182 మీటర్లు. కాగా నేడు ముచ్చింతల్‌లో ఆవిష్కృతం కానున్న రామానుజ విగ్రహం ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహం కానుంది. థాయిలాండ్‌లోని బుద్ధ విగ్రహం (301 అడుగులు) కూర్చున్న భంగిమలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందింది.

45 ఎకరాల సువిశాల స్థలంలో..

తెలంగాణలోని రంగారెడ్డి శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో 45 ఎకరాల స్థలంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఏర్పాటుకు 2014లోనే శంకుస్థాపన చేశారు చిన్నజీయర్‌ స్వామి. ప్రవేశద్వారం రూపకల్పన తెలంగాణలోని ప్రసిద్ధ ‘కగాడియా’ శైలిలో రూపొందించారు. ప్రధాన ద్వారం వద్ద 18 అడుగుల ఎత్తైన హనుమాన్, గరుడ విగ్రహాలను కూడా ఉంచారు. ఆలయ గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహన్ని ఏర్పాటు చేశారు. ఇది రామానుజాచార్యుల జీవితపు 120 సంవత్సరాలను పురస్కరించుకుంటుంది. ఈ విగ్రహానికి రోజూ అభిషేకం, పూజలు, రాజభోగ సమర్పణ వంటి అన్ని రకాల సేవలు జరుగుతాయి. ఈ సమతామూర్తి మహా విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తామర పువ్వుపై కూర్చున్న రామానుజాచార్యుని విగ్రహం ఐదు లోహాలతో తయారు చేశారు. 42 అడుగుల ఎత్తులో రాగి ఫౌంటెయిన్ కూడా ఏర్పాటు చేశారు. లోపల 54 అంగుళాల ఎత్తులో 120 కిలోల బంగారంతో చేసిన మరో శ్రీరామానుజాచార్యుల విగ్రహం ఉంటుంది. రామానుచార్య విగ్రహం చుట్టూ నల్లరాతితో చెక్కబడిన 108 చిన్న ఆలయాలు ఉన్నాయి. వీటిని దివ్య దేశం అంటారు. ఇవి బద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, తిరుమల ఆలయాల తరహాలో రూపొందించడం జరిగింది. లోపల, ఆ ఆలయంలో దేవాగ్రహం కూడా పూజ్యమైన దేవత రూపంలో ఉంటుంది.

ఇక మహా విగ్రహం చుట్టూ 8 పుణ్య క్షేత్రాలు, గర్భాలయాల ఆకృతిలో ఏకంగా 108 ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయాలను అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు. మరోవైపు దివ్య క్షేత్రంలోకి అడుగుపెట్టగానే అష్టదళ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఫౌంటెయిన్ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫౌంటెయిన్ పద్మ పత్రాలు విచ్చుకొనేలా రూపొందించారు. పద్మపత్రాల మధ్య నుంచి నీళ్లు, రామానుజులను అభిషేకిస్తున్న భావన భక్తులకు కలిగేలా తీర్చి దిద్దారు. అలాగే, రామానుజులు ప్రభోధించిన సమానత్వ ఘట్టాలను సూర్యాస్తమయం తరువాత మ్యూజిక్‌తో త్రీడీ షో ద్వారా ప్రదర్శించనున్నారు. రాజస్థాన్‌లో మాత్రమే లభించే పింక్ గ్రానైట్‌తో తయారు చేసిన పలు ఆకృతులు క్షేత్రం ఆవరణలో కనువిందు చేస్తున్నాయి. సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో తయారు చేసిన 36 శంఖు, చక్రాలతో పాటు ఏనుగు ఆకృతులు అమర్చారు. రామానుజుల జీవిత విశేషాలు తెలిపే మ్యూజియంను కూడా నిర్మించారు. దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు, రెండు లక్షల మొక్కలు ఆధ్యాత్మిక శోభను మరింత పెంచేలా దర్శనమిస్తున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమయ్యే సహస్రాబ్ది ఉత్సవాల్లో దేశం నలుమూలల నుంచి 5వేల మంది రుత్వికులు పాల్గొననున్నారు. దీనికోసం 120 యాగశాలల్లో ఒక వెయ్యి 35 హోమగుండాలను సిద్ధం చేశారు.

Statue Of Equality


శ్రీ రామానుజాచార్య స్వామి ఎవరంటే..

1017లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జన్మించారు శ్రీ రామానుజాచార్య స్వామి. తల్లి పేరు కాంతిమతి కాగా తండ్రి ఆసూరి కేశవ సోమయాజి. కంచి అద్వైత పండితుల వద్ద వేదాంత విద్యను అభ్యసించారు. అతను దేశవ్యాప్తంగా ప్రముఖ ద్వంద్వవాదాన్ని వ్యాప్తి చేశారు. అదేవిధంగా దేశమంతటా పర్యటించి అన్ని వర్గాల ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. దేవాలయాలను మత కేంద్రాలుగా నిర్మించారు. ఆయన అనుగ్రహం వల్ల అందరికీ ‘ఓం నమో నారాయణ్‌’ అనే ముక్తి అష్టాక్షరీ మంత్రంతో పరిచయం ఏర్పడింది. సమానత్వం, ఆప్యాయత, భక్తి మార్గమే భగవంతుడిని పొందటానికి ఉత్తమ మార్గమని ఆయన బాగా విశ్వసించారు. ప్రకృతి, గాలి, నీరు, నేల వంటి వనరులను కూడా కాపాడుకోవాలని ప్రచారం చేశారు. ఆ రోజుల్లోనే అత్యంత అణగారిన వారికి విద్యను అందుబాటులోకి తెచ్చి ‘వసుదైక కుటుంబం’ అనే భావనను ప్రజల్లో పెంపొందించారు. అన్నమాచార్య, భక్త రామదాస్, త్యాగరాజు, కబీర్, మీరాబాయి వంటి ప్రాచీన కవులకు సైతం రామానుజుని బోధనలు స్ఫూర్తినిచ్చాయి. సాంస్కృతిక, లింగ, విద్య, ఆర్థిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన సమాజంలో వివక్షకు గురైన వారికి దేవాలయాల తలుపులు తెరిచాడు. కాగా ఆది భగవానుడే రామానుజాచార్యునిగా అవతరించినట్లు భక్తులు నమ్ముతారు. పురాతన గ్రంథాల ప్రకారం రామానుజాచార్యులు సుమారు 120 ఏళ్లకు పైగా జీవించాడని తెలుస్తోంది. 2016 ఆయన జన్మించి వెయ్యి సంవత్సరాలు పూర్తయ్యాయి. జీవించిఉన్నంత సేపు సమానత్వం కోసం పాటుపడ్డ రామానుజునికి నివాళిలో భాగంగానే చిన్న జీయర్ స్వామి ఈ భారీ విగ్రహాన్ని రూపొందించడానికి నడుంబిగించారు.

13 రోజుల పాటు ఉత్సవాలు.

రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల సందర్భంగా 13 రోజుల కార్యక్రమం నిర్వహించారు. ముచ్చింతల్‌ క్షేత్రంలో ఫిబ్రవరి 2 న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 14వ తేదీ వరకు కొనసాగి నాయి. సమతా మూర్తి భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా.. సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్రమంత్రులు, తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. పద్మపీఠంపై పద్మాసనంలో కూర్చున్న భంగిమలో ఉన్న 216 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అలాగే, ఫిబ్రవరి 13న 120 కిలోల బంగారు రామానుజాచార్య బంగారు విగ్రహాన్నిరాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Statue Of Equality"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0