Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

There are no mahurtas until December beyond August

 ఆగస్టు దాటితే డిసెంబర్ వరకు మహూర్తాలు లేవు

There are no mahurtas until December beyond August

జంటలకు వివాహం జరిపించాలన్నా. నూతన గృహ ప్రవేశం చేయాలన్నా. ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభించాల్సి వచ్చినా. శుభ ముహూర్తం కోసం వెతుకుతాం. అదే రోజు.

అదే సమయానికి సంప్రదాయంగా జరుపుతాం. ముఖ్యంగా వివాహాలు కచ్చితంగా ముహూర్తానికే జరగాలని అందరూ భావిస్తారు. కోవిడ్ అనంతరం రెండేళ్ల తర్వాత పెళ్లి మంత్రాలు మారుమోగుతు ఉన్నాయి. తమ పిల్లల వివాహాలను అందరూ మెచ్చు కునేలా వైభవంగా చేయాలని తల్లిదండ్రులు తహత హలాడుతుంటారు. అందుకే ఆలస్యమైనా అన్నీ సవ్యంగా కుదిరాకే పెళ్లిళ్లు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ట్రెండ్ మారింది. సుముహూర్తాలు తక్కువగా ఉండడంతో. ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా నిశ్చయం అయింది. మొదలు. ఉరుకులు, పరుగులతో పెళ్లిళ్లు కానిచ్చేస్తు న్నారు. ఈ ఐదు నెలల్లో జిల్లాలో వేలాది వివాహాలు జరుగగా, జూన్ వరకు మాత్రమే సుమూహూర్తాలు ఉండటంతో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.

రెండేళ్లుగా మోగని బాజా కరోనా దెబ్బతో చాలామంది రెండేళ్ల పాటు వివాహాల మాటే ఎత్తలేదు. కొందరు ధైర్యం చేసి పిల్లల పెళ్లి చేద్దామన్నా నిబంధనల కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గడం వివాహ ముహూర్తాలు జూన్ వరకే ఉండడంతో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వేలాది వివాహాలు జరిగాయి. ప్రస్తుతానికి ఈ నెల 23వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఆగస్టులో మంచి ముహూర్తాలు న్నా. ఆపై ఆషాఢం, శుక్ర మూఢం కారణంగా డిసెం బర్ వరకూ మంచి ముహూర్తాలు లేవు. డిసెంబర్ ఒకటవ తేదీతో శుక్ర మూఢం ముగుస్తుంది. అనం తరం శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో నిశ్చయ తాంబూలాలు తీసుకున్న వారు. ఆరు నెలల పాటు ఎదురు చూడడం ఎందుకన్న ఉద్దేశంతో పెళ్లికి తొందరపడుతున్నారు.

ఒక పెళ్లి. ఎంతో మందికి ఉపాధి. పెళ్లంటే రెండు కుటుంబాలు కలవడం అంటారు. అంతేకాదు పెళ్లి ఏర్పాట్లలో ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. దీంతో ఎన్నో కుటుంబాలకు ఉపాది దొరుకుతుంది. పెళ్లంటే ముందుగా గుర్తొచ్చేవి శుభ లేఖలు, పట్టు చీరలు, వధూవరుల పరిణయ వ స్తాలు, ఫొటోలు, వీడియో, ట్రావెల్స్ ఏజెంట్లు, పెళ్లి మంటపాలు, పూలు, పురోహితులు, సాంస్కృతిక కళాకారులు, ఎలక్ట్రిషియన్స్, బ్యాండ్ మేళం. వీరంతా రెండేళ్లుగా ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ముహూర్తాలు ఉండడంతో ఉపాధి దొరుకుతుందని సంబర పడుతున్నారు. కోలుకుంటున్న వ్యాపారాలు

కరోనాతో వరుసగా రెండేళ్లు పాటు దెబ్బతిన్నవ్యాపారాలు వివాహాల వల్ల కాస్త కోలుకున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకూ వివాహాలు వేల సంఖ్యలో జోరుగా సాగాయి. కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు అన్ని రకాల వ్యాపారాలు ఊపందుకున్నాయి. బంగారం కొనుగోళ్లు భారీగీ పెరగడంతో జ్యుయలరీ షాపులు కళకళలాడుతున్నాయి. ముహూర్తాల వివరాలు. ఈ నెలలో 15, 16, 17, 18, 19, 22, 23 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. జూలైలో ఆషాఢ మాసం ప్రారంభం కావడంలో శుభ ముహూర్తాలు లేవు. ఆగస్టులో 3, 4, 5, 6, 10, 11, 13, 17, 20, 21 తేదీల్లో ముహూర్తాలున్నాయి. సెప్టెంబరులో భాద్రప దమాసం, శుక్ర మూఢమి. ప్రారంభంలో ముహూర్తాలు లేవు. అక్టోబరు, నవంబరు నెలల్లో శుక్ర మూఢమితో మంచి రోజులు లేవు. డిసెంబరు 2,. 3, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "There are no mahurtas until December beyond August"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0