Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Vastu Tips for Broom

 Vastu Tips for Broom : ఇంట్లో పాత చీపురుని పడేయాలన్నా .. కొనాలన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులున్నాయి .వాటి గురించి వివరణ.

Vastu Tips for Broom

Vastu Tips for Broom: ఇంటిని శుభ్రపరిచే చీపురుని లక్ష్మిదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది. ఇంట్లో నివసించే వారందరినీ వ్యాధుల నుండి రక్షిస్తుంది.

అయితే తరచూ ఇంట్లో చీపురు పాతబడిపోతే కొత్త చీపురు కొని తెచ్చుకుంటాం.. అయితే ఇంట్లోంచి పాత చీపురుని పాడవెయ్యడానికి.. కొత్త చీపురుని కొనుగోలు చేయడానికి తగిన సమయం ఉందట. వాస్తు శాస్త్రంలో ఇంట్లో చీపుర్లు ఉంచడం, కొనడం, విసిరేయడం మొదలైన అన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. ప్రతి వ్యక్తి ఈ నియమాలను పాటించాలి.. లేదంటే.. ఇంట్లో ప్రతికూలత ఏర్పడుతుంది. ఈరోజు చీపురుకు సంబంధించిన వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం..

పాత చీపురును ఇంట్లో ఎప్పుడూ ఉంచవద్దు.

చీపురు పాతబడితే ఇంట్లో పెట్టుకోకూడదని.. ఇలా పాత చీపురని ఇంట్లో ఉంచడం వలన ప్రతికూలత వస్తుందని అంటారు. శనివారం లేదా అమావాస్య రోజున పాత చీపురుని ఇంటి నుండి తీసివేయాలి. ఇంట్లోని పాత చీపురును తీసివేస్తే ఆ ఇంటి దారిద్ర్యం కూడా తొలగిపోతుందని.. తద్వారా ఇంట్లో సానుకూలత ఏర్పడుతుందని నమ్మకం.

పాత చీపురుని ఎప్పుడు, ఎక్కడ విసరాలి.

శనివారం, అమావాస్య రోజులో మాత్రమే కాదు.. గ్రహణం తర్వాత ,హోలికా దహనం తర్వాత కూడా పాత చీపురుని ఇంటి నుంచి తొలగించవచ్చు. అయితే ఎప్పుడూ ఏకాదశి, గురువారం, శుక్రవారం నాడు పాత చీపురు ఇంటి నుంచి బయటకు విసరకండి. ఏకాదశి, గురువారం నారాయణునికి అంకితంమైన రోజు అయితే.. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజు. కనుక ఈ రోజుల్లో చీపురని ఇంటినుంచి తీయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్మకం. అంతే కాకుండా.. చీపురును ఏ చెట్టు దగ్గర లేదా కాలువ దగ్గర పడేయకూడదు లేదా కాల్చకూడదు. చీపురుపై ఎవరి పాదాలు పడని చోట విసరాలి.

కొత్త చీపురు కొనుగోలుకి నియమాలు.

కొత్త చీపురు కొనడానికి వాస్తు నియమాలు కూడా ఉన్నాయి. చీపురుని ఎల్లప్పుడూ మంగళవారం, శనివారం, అమావాస్యల రోజుల్లో కొనుగోలు చేయాలి. ముఖ్యంగా కృష్ణ పక్షంలో కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో చీపురు పెట్టుకునే ప్రదేశం ఎవ్వరూ నేరుగా చూడలేని విధంగా ఉండాలి. చీపురు ఎక్కడ ఉంచినా పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Vastu Tips for Broom"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0