Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Vastu Tips for Money

 Vastu Tips for Money : ఈ 3 వాస్తు దోషాలను సరి చేసుకుంటే . ఆరోగ్యంతో పాటు ఆర్ధికంగా కూడా ఉండవచ్చు.

వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మన దేశంలోని ప్రతీ రాష్ట్రంలో ఉన్నారు. వాస్తు ప్రకారమే ఇంటిని కొనుగోలు చేస్తారు. ఇటీవల కాలంలో ఇంటి స్థలాన్ని కూడా వాస్తు ప్రకారం కరెక్ట్ గా ఉందా లేదా అని చూసుకొని కొనుగోలు చేస్తున్నారు.

ఇంటిని తమ సొంతం చేసుకున్న తర్వాత ఇంట్లో వస్తువులు కూడా వాస్తు ప్రకారం సర్దుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో పాటు.. ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. వీటితో పాటు వారికి తెలియకుండానే కొన్ని వాస్తు తప్పులు చేస్తుంటారు. వీటి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అవి ఏంటి.. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1 . నిత్యం ఇంట్లో తడిగా ఉండటం..
ఎవరి ఇంట్లో అయితే నిత్యం తడిగా ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలు ఉండవని.. లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు ఉండదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇంట్లో ఉన్న గదులను తడిగా ఉండకుండా చూసుకోవాలి. 

2 . ఇంట్లో పావురం గూడు.. కొన్ని పక్షుల గూడ్లను తమ ఇంట్లో ఉంచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే ఇలా ఉండటం వాస్తు దోషం అని నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా పావురం గూడు.

ఈ గూడ్లను ఇంటి ఆవరణలోనే కాదు.. బెడ్రూంలో కూడా చాలా మంది ఏర్పాటు చేస్తుంటారు. ఇది ఎప్పటికీ మంచిది కాదని... దీని వల్ల పావురానికి మంచి జరగవచ్చు కానీ.. ఆ ఇంట్లో ఇది ఒక వాస్తు దోషం అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

3 . కుళాయి నుంచి నీరు కారడం..
వాస్తు ప్రకారం ఇంట్లో కుళాయి నుంచి నీరు కారడం కూడా ఇంటికి మంచిది కాదు. దీని వల్ల నీరు వృధా కావడంతో పాటు.. ఇది కూడా ఒక వాస్తు దోషంగా నిపుణులు చెబుతున్నారు. ఈ దోషం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని కలిగిస్తుంది. ఇలాంటి వారిపై లక్ష్మీదేవి ఆగ్రహం చూపిస్తుందంటూ నిపుణులు చెబుతున్నారు. 

పై మూడు వాస్తు దోషాలను సరి చేసుకుంటే.. ఆరోగ్యంతో పాటు.. ఆర్థిక సమస్యల నుంచి బయటపడొచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Vastu Tips for Money"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0