Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Where do these welfare schemes take our country?

 ఈ సంక్షేమ పథకాలు మన దేశాన్ని ఎక్కడకు తీసుకు వెళ్తాయి .

Where do these welfare schemes take our country?

అభివృద్ది చెందుతున్న దేశాల్లో పేదలకు సంక్షేమ పథకాలు అందించడం ఖచ్చితంగా అవసరం. కాని మన దేశంలో సంక్షేమ పథకాలు అనేవి దారి తప్పాయి. వాళ్లు వీళ్లు అని కాదు.. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు మొత్తం దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల వారికి.. అన్ని ప్రాంతాల వారికి ఏదో ఒక విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అవసరం లేని వారికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం భారీ ఎత్తున నిధులు ఖర్చు అవ్వడం వల్ల దేశ ఖజానాపై భారీ భారీగా పడుతోంది. 

రైతుల నుండి మొదలుకుని ప్రతి ఒక్క వృత్తి వారిలో సాయం అవసరం అయిన వారు ఉన్నారు. వారి వరకు సాయం చేస్తే పర్వాలేదు. కాని 20 మంది సాయం కావాల్సిన వారు ఉంటే.. 60 శాతం మంది సాయం అవసరం లేకున్నా కూడా ఆ 20 శాతం మంది ని చూపిస్తూ సంక్షేమ పథకాలను అనుభవిస్తున్నారు.

దాంతో ఖర్చు అనేది వంద రూపాయలతో పోయేది అయిదు వందలు అవుతుంది. తద్వారా ఫలితం శూన్యం.

మన దేశం అయిదు దశాబ్దాల నుండి కూడా అభివృద్ది చెందుతున్న దేశంగానే పేరు పడిపోయింది. ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి దాపరించింది అంటూ మేధావులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో సంక్షేమ పథకాలను తొలగించలేని స్థితికి రాష్ట్రాలు.. కేంద్ర ప్రభుత్వం వచ్చాయి. సంక్షేమ పథకాలకు నిధులు పెంచడమే తప్ప తగ్గించే పరిస్థితి లేదు. దాంతో అభివృద్ది అనేది కుంటు పడుతుంది. సంక్షేమ పథకాలకు పెట్టే ఖర్చులో కనీసం 50 శాతం వృదా అవుతుందని మేధావుల అభిప్రాయం. కాని ఏ ఒక్కరు ఏమీ చేయలేని పరిస్థితి. అవినీతిమయం అయిన వ్యవస్థలో సంక్షేమ పథకాలు దారి తప్పుతున్నాయి. దాంతో ఈ సంక్షేమ పథకాలు దేశాన్ని ఎక్కడకు తీసుకు వెళ్తాయో అంటూ మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Where do these welfare schemes take our country?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0