Wipro Recruitment 2022
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీ దిగ్గజం విప్రో (Wipro)ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.
Account Executive - Banking & Financial Services విభాగంలో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ విభాగంలో ఎంపికైన అభ్యర్థులు క్లయింట్ సంబంధిత విధులను నిర్వహించాల్సి ఉంది. ఈ ఉద్యోగాలు హైదరాబాద్ లోకేషన్‌లో ఉంది. దరఖాస్తుకు చివరి తేదీ వివరాలు లేవు. ఈ నేపథ్యంలో తొందరగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ విధానం.
- Step 1 : దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
- Career and Course: నిఫ్టెమ్‌లో ఇంటర్ అర్హతతో ఫుడ్ కోర్సులు.. అప్లికేషన్,కోర్సు మోడల్ వివరాలు
- Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://careers.wipro.com/opportunities/jobs/2617212?lang=en-us&previousLocale=en-US లింక్‌ను సందర్శించాలి.
- Step 3 : అనంతరం Apply ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- Step 4 : కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.
- Step 5 : ఈ మెయిల్ ఐడీ ద్వారా రిజిస్టర్ చేసుకొని తప్పులు లేకుండా అప్లికేషన్ నింపాలి.
- Step 6 : ఇన్‌స్ట్రక్షన్‌లు పూర్తిగా చదివి దరఖాస్తుఫాంను నింపాలి.
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో (Wipro) మహిళలకు (women) గుడ్‌న్యూస్ చెప్పింది. కెరీర్ గ్యాప్ తీసుకున్న మహిళా ఐటీ నిపుణులు (Women IT Experts) తిరిగి తమ కెరీర్‌ను చక్కబెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వారి కోసం 'బిగిన్ ఎగైన్' (begin Again) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
విప్రో ఇన్‌క్లూజన్ అండ్ డైవర్సిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ (Wipro Inclusion and Diversity Initiative Program) కింద కెరీర్ గ్యాప్ ఉన్న మహిళా నిపుణులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కెరీర్ విరామం పొందిన మహిళా నిపుణులు (Women Experts) మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు (Apply) చేసుకోవచ్చని తెలిపింది.
బిగిన్ ఎగైన్ అనేది మహిళల కోసం మొదటిసారిగా ప్రత్యేకంగా మేము ప్రారంభించిన ఇంక్లూజన్ అండ్ డైవర్సిటీ (I&D) ప్రోగ్రామ్. కెరీర్ గ్యాప్ తర్వాత తిరిగి వారి కెరీర్‌ను ప్రారంభించాలని చూస్తున్న మహిళల (women) కోసం దీన్ని ఆవిష్కరించినట్టు సంస్థ పేర్కొంది.
ముఖ్యంగా విశ్రాంతి, మాతృత్వం, వృద్ధుల సంరక్షణ, ప్రయాణం, అభిరుచి లేదా మరేదైనా వ్యక్తిగత కారణాల వల్ల ఏర్పడిన కెరీర్ గ్యాప్ (career gap)కు పుల్‌స్టాప్ పెట్టడానికి సదావకాశాన్నిస్తోంది. ఈ చొరవ ప్రతిభావంతులైన మహిళలకు కెరీర్ అవకాశాలు మెరుగుపర్చేందుకు వీలు కల్పిస్తుంది. తిరిగి తమ కెరీర్‌ను ప్రారంభించడానికి అద్భుతమైన అవకాశం (Opportunity) కల్పిస్తుంది" అని పేర్కొంది.
0 Response to "Wipro Recruitment 2022"
Post a Comment