Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

7 Mysteries of Puri Jagannath Temple that Amaze Scientists

 పూరీ జగన్నాథ్ ఆలయంలో  సైంటిస్టులనే ఆశ్చర్యపరిచే 7 మిస్టరీలు.

7 Mysteries of Puri Jagannath Temple that Amaze Scientists

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయం దేశంలోనే పేరెన్నిక గన్నది. ఇక్కడ ఏటా జరిగే రథయాత్రకు లక్షలసంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ అపురూప దృశ్యాన్ని కవర్ చేసేందుకు దేశ, విదేశాల నుంచి మీడియా ప్రతినిధులు వస్తుంటారు.

అయితే ఇంతటి ప్రతిష్ట , ప్రాశస్త్యం ఉన్న పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎన్నో విశిష్టతలు ప్రత్యేకతలూ వున్నాయి. దేశంలోని మరే ఇతర ఆలయంలో లేనన్ని అద్భుతాలు ఇక్కడ జరుగు తున్నాయి. అవి శాస్త్రవేత్తల మేధస్సుకు కూడా అంతు పట్టకపోవడం విశేషం.  అవేంటో ఒకసారి మీరే చదవండి.

మొదటిది: తనంతట తానే ఆగిపోయే రథం.

ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో ఊరేగింపు గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే  రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇందులో ఎవరి ప్రమేయం వుండదు.

రెండవది.:  నీడ కనిపించని గోపురం.

జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదు . సూర్యుడు వచ్చినా నీడ పడదు . 

ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు ఇది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు.

మూడవది.:  గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండా.

ఎక్కడైనా జండా గాలికి అనుకూలంగా ఎగురుతుంటుంది. కానీ  పూరీ ఆలయ గోపురం పైన వుండే జెండాకు మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంటుంది .

నాలుగవది.:  మనవైపే చూసే చక్రం.

పూరీ జగన్నాథ్ ఆలయం గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రం ఎటువైపు వెళ్లి చూసినా  అది మనవైపే చూస్తున్నట్టు వుంటుంది .

ఐదవది.:  ఈ ఆలయంపై ఎగరని పక్షులు.

ఇది మరో వింత.  ఈ జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. ఎందుకు పక్షులు అక్కడ ఎగరవు  అనే విషయం మాత్రం అంతు పట్టడం లేదు.

ఆరవది.:  ఆలయం లోకి వినిపించని అలల సవ్వడి.

ఇదో విచిత్రం. సముద్ర తీరాన కొలువుతీరిన 

ఈ ఆలయం సింహద్వారంలో అడుగు పెట్టగానే అప్పటివరకూ వినిపించిన సముద్రపు హోరు ఆలయంలో వినిపించదు. మళ్లీ ఆలయం నుంచి అడుగు బయపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది.

ఏడోది.:  ఘుమఘుమల ప్రసాదం .

పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. అయితే  ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసనా రాదు. దేవుడికి ప్రసాదం నివేదించిన తర్వాత మాత్రం ప్రసాదాలు మంచి సువాసనతో ఘుమఘుమలాడుతుంటాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "7 Mysteries of Puri Jagannath Temple that Amaze Scientists"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0