Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Abraham Lincoln Letter

స్కూల్ అంటే పదవ తరగతి ఫలితాలు ఒక్కటే కాదు..ప్రామాణికం!

Abraham Lincoln Letter

అబ్రహం లింకన్ తన కుమారుని పాఠశాలకు పంపే రోజు టీచర్ కు రాసిన ఉత్తరం.

ఈరోజు నుండి నాకొడుకుకి విద్యాలయంలో విద్యాబ్యాసం మొదలు. కొంత కాలం వాడికి అక్కడి పరిస్థితులు అన్ని కొత్తగా వింతగా అనిపిస్తాయి, వాడిని సున్నితంగా చూసుకుంటారనే భావిస్తున్నాను. ఈరోజు వాడికి ఒక సాహసం వంటిది, ఈసాహాసం వాడికి ఖండఖండాంతరాలు తిరిగే అవకాశం ఇవ్వచ్చు. చరిత్రలో సాహసాలు రాజ్యాలనీ, యుద్దలనీ , వేదననీ మాత్రమే మిగిల్చాయి. కానీ జీవితం మీద సాహసం చెయ్యటానికి, ఒక మంచి మనిషిగా మిగలటానికి వాడికి నమ్మకం, ప్రేమ, దైర్యం అవసరం.

  • ప్రియమైన ఉపాధ్యయులారా, నా కొడుకుని మీచేతులలోకి తీసుకుని వాడికి అవసరమైనవన్నినేర్పండి, కానీ సున్నితంగా వాడి మనసుకి అర్థమయ్యేలా.
  • మనుష్యులు అందరూ నీతిమంతులు కారనీ – మను ష్యులు అందరూ సత్యవాదులు కారనీ – వాడు నేర్వాలని నాకు తెలుసు. కానీ ప్రతి నీచుడికి ఒక ఉత్తముడు కూడా ఉంటాడని – ప్రతి స్వార్ధ రాజకీయనాయకుడికి ఒక నిబద్ద నాయకుడు కూడా ఉంటాడని వాడికి భోదించండి.
  • ప్రతి శత్రువుకి ఒక మిత్రుడు కూడా ఉంటాడని వాడికి తెలియ పరచండి.
  • ఈర్ష్యకు వాడిని దూరం చెయ్యండి. మాట్లాడే మాట మీద నియంత్రణ, మాటల్లో గొప్పతనం వాడికి నేర్పండి.
  • ఎదుటివారి మీద ఆదారపడి బ్రతకటం కన్నా, సొంత కాళ్ళ మీద నిలబడటం గౌరవం అని భోదించండి.
  • మీవల్లనయితే నిశబ్దపు నవ్వులో రహస్యాన్ని విప్పండి. సాద్యమైతే పుస్తకాలు, వాటి గొప్పతనం వాడు తెలుసుకునేలా చేయండి.
  • అయితే అదే సమయంలో… ఆకాశంలోని పక్షులలో, ఎండలోని తేనటీగల్లో, పచ్చని కొండల్లోని పువ్వులలోఎడతెగని మర్మాన్ని గ్రహించేటంత నిశబ్ద ఖాళీ సమయా న్ని కూడా వాడికి ఇవ్వండి.
  • ప్రకృతిని వాడు ఆరాధించి, ఆస్వాదించే మనస్సుని పెంచండి.
  • వంచనకన్న ఓటమి మంచిదని, గొప్పగా ఉంటుందని మీ పాఠశాల లో భోదించండి.
  • దొరికిన 100 రూపాయల కన్నాసంపాదించిన 10 రూపాయలు విలువ ఎక్కువని వాడికి చెప్పండి.
  • వాడికి వచ్చే సొంత మంచి ఆలోచనలపై నమ్మకాన్ని కలిగి ఉండటం నేర్పించండి.
  •  వాడి ఆలోచనలు తప్పు అని అందరూ అంటున్నా సరే సున్నితస్తులతో సున్నితంగా, మొండివాళ్ళతో మొండిగా ఎలా ఉండాలో నేర్పించండి.
  • అందరూ వేలంవెర్రిగా ఒకే మందలో చేరి పోతునప్పుడు గుడ్డిగా అనుసరించక, ప్రక్కకు నిలబడగలిగి, నిర్ణయించుకోగల సామర్ద్యాన్ని నాకొడుక్కి ఇవ్వండి.
  • ఎవరు ఏది చెప్పిన, వినడాన్ని భోదించండి.అయితే విన్న అన్నిటి ని, సత్యపు జల్లెడలో వడకట్టి, పైన నిలిచే మంచి మాత్రమే గ్రహించ టాన్ని నేర్పించండి.
  • మీవల్లనయితే విషాదంలో నవ్వటం ఎలానో భోదించండి. ఓటమిని-గెలుపుని, సుఖాన్ని-ధుఃఖాన్నికూడా సమానంగా ఎలా స్వీకరించి ఆనందించాలో భోదించండి. కన్నీరు లజ్జాకరం కాదని భోదించండి.
  • వాడిదగ్గర ఉన్నది నలుగురికి పంచటం నేర్పించండి. అలాగే అతి చనువు పట్ల జాగురూకత భోదించండి.
  • అలాగే బలాన్ని బుద్దిని అత్యదిక ధరకు అమ్ముకోవటం భోదించండి. కానీ వాడి 
  • హృదయంపైన, అత్మపైన అమ్మకపు ధర అతికించుకోవద్దు అని చెప్పండి.
  • సత్యం తనవైపు ఉన్నదని తెలిసినప్పుడు లోకుల మూకుమ్మడి కేకలను పట్టించుకోకుండా, దైర్యంగా నిలబడటాన్ని, పోరాడటాన్నిభోదించండి.
  • వాడికి అన్ని నెమ్మదిగా నేర్పించండి, సున్నితంగా ప్రవర్తించండి, అలా అని గారాభం, ఎత్తుకు తిప్పటం చేయకండి.
  • వాడికి తప్పు అంటే భయం నేర్పండి, వీటితోపాటు ఎంత కష్టానికైనా దైర్యంగా నిలబడే సహనాన్ని భోదించండి. ఎందుకంటే నిప్పులో కాలినాకే నిజమైన బంగారం బయటకి వస్తుంది.
  • వాడిమీద వాడికి ఉత్కృష్టమైన విశ్వాసాన్ని పెంచండి. అది వాడికి సమస్త మానవాళిమీద అదే విశ్వాసాన్ని పెంచుతుంది. ఇవన్నీ వాడు తెలుసుకున్ననాడు వాడు మనుష్యులలో ఉత్తముడిగా మిగులుతాడు.
  • ఇదంతా పెద్ద పట్టికే, తండ్రిగా వాడు అలా ఉండాలని నా కోరిక.. అలా తయారుచేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ మీవల్లనేమవుతుందో అది మీరు చేయండి.
  • వాడు ఒక పసిపిల్లవాడు, మనం ఎలా మలుస్తామో అలా పెరుగుతాడు జాగ్రత్తగా చూసుకోండి.
  • ప్రతి ఉపాధ్యాయుడు ఈ మానవీ యతా విలువలను గుర్తెరిగి బోధన చేస్తే మంచి సమాజం ఏర్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు కదా మిత్రమా..!

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Abraham Lincoln Letter"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0