Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Alert for railway passengers.. Regulations to be implemented from August 1.

 India Railway : రైల్వే ప్రయాణికులకు అలర్ట్ .. ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న నిబంధనలు.

Alert for railway passengers.. Regulations to be implemented from August 1.

రైళ్లల్లో ప్రయాణించే వారి కోసం భారతీయ రైల్వే (Indian Railway) కీలక అలర్జ్ జారీ చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ మరో నిబంధనను అమలులోకి తీసుకురానుంది.

ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్‌లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ చెల్లింపులు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆగషస్టు 1నుంచి రైల్వేస్టేషన్‌లో క్యాటరింగ్‌తో సహా అన్ని స్టాల్స్‌లో నగదుకు బదులుగా డిజిటల్ పద్ధతిలో (Digital Payments) డబ్బు స్వీకరిస్తారు. నగదు రహిత బదిలీలను అంగీకరించని స్టాల్స్ నుంచి రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీని కోసం యూపీఐ, పేటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్‌లు, స్వైపింగ్ మెషీన్‌లను కలిగి ఉండటం తప్పనిసరిగా ఆదేశాల్లో వెల్లడించింది. అంతేకాకుండా ప్రయాణికులకు కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వాలని సూచించింది. రైల్వే బోర్డు తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాంపై ఏ వస్తువునైనా ఎమ్మార్పీ ధరకే స్టాళ్ల నిర్వాహకులు విక్రయించనున్నారు.

రైల్వే స్టేషన్లలో అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారన్న ఆరోపణలను ఈ విధానం ద్వారా అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రూ.15 వాటర్ బాటిల్‌ను రూ.20కి అమ్మి ప్రయాణికులను దోచుకునేవారు. క్యాష్ లెస్ చెల్లింపులతో ఇకపై ఎక్కువ ధరకు విక్రయించలేరు. క్యాటరింగ్ క్యాష్‌లెస్ చెల్లింపులపై గతంలో రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలు, ఐఆర్‌సీటీసీకి ఆదేశాలు జారీ చేసింది. స్టాల్స్‌తో పాటు ట్రాలీలు, ఫుడ్ ప్లాజాలు, రెస్టారెంట్లు మొదలైన వాటిలో నగదు రహిత లావాదేవీలు జరుగుతాయని రైల్వే బోర్డు స్పష్టం చేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Alert for railway passengers.. Regulations to be implemented from August 1."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0