Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Are you transacting beyond the limit? But this information is for you

పరిమితికి మించి లావాదేవీలు చేస్తున్నారా ? అయితే ఈ సమాచారం మీకోసమే .

Are you transacting beyond the limit?  But this information is for you

ఇంటర్నెట్ డెస్క్ : పరిమితికి మించి అధిక వ్యాల్యూ లావాదేవీలు నిర్వహిస్తున్నారా?.

ఈ వివరాలను ఐటీఆర్ ( Income Tax Returns)లో వెల్లడించడం లేదా ?.. అయితే ఆదాయ పన్నుశాఖ(Income Tax department) నుంచి మీకు నోటీసులు(Notices) వస్తాయి. ఔను నిజమే.. ఈ దిశగా ఐటీ అధికారులు(IT Officals) సన్నద్ధమయ్యారు. అధిక మొత్తం లావాదేవీలపై కన్నేశారు. బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి ఆస్తి సంబంధిత లావాదేవీలు, షేర్ ట్రేడింగ్‌ వంటి నగదు లావాదేవీల దాకా అన్ని చెల్లింపులను ఆదాయ పన్నుశాఖ పర్యవేక్షించనుంది. పరిమితి దాటినట్టు తేలితే అధికారులు నోటీసులు జారీచేస్తారు. స్వచ్ఛందంగా ఐటీఆర్ దాఖలు, పన్ను అధికారుల పర్యవేక్షణలోకి రాకుండా చెల్లింపుదార్లకు అవగాహన కోసం నిర్వహిస్తున్న ఈ-ప్రచారంలో భాగంగా అధికారులు ఈ మేరకు సూచనలు చేశారు. పాన్‌కార్డ్‌కి అనుసంధామైన అధిక మొత్తం లావాదేవీల వివరాలు వెల్లడించకపోతే నోటీసులు అందుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

బిజినెస్

 డెస్క్ : పరిమితికి మించి అధిక వ్యాల్యూ లావాదేవీలు నిర్వహిస్తున్నారా ?. ఈ వివరాలను ఐటీఆర్ ( Income Tax Returns)లో వెల్లడించడం లేదా ?.. అయితే ఆదాయ పన్నుశాఖ(Income Tax department) నుంచి మీకు నోటీసులు(Notices) వస్తాయి. ఔను నిజమే.. ఈ దిశగా ఐటీ అధికారులు(IT Officals) సన్నద్ధమయ్యారు. అధిక మొత్తం లావాదేవీలపై కన్నేశారు. బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి ఆస్తి సంబంధిత లావాదేవీలు, షేర్ ట్రేడింగ్‌ వంటి నగదు లావాదేవీల దాకా అన్ని చెల్లింపులను ఆదాయ పన్నుశాఖ పర్యవేక్షించనుంది. పరిమితి దాటినట్టు తేలితే అధికారులు నోటీసులు జారీచేస్తారు. స్వచ్ఛందంగా ఐటీఆర్ దాఖలు, పన్ను అధికారుల పర్యవేక్షణలోకి రాకుండా చెల్లింపుదార్లకు అవగాహన కోసం నిర్వహిస్తున్న ఈ-ప్రచారంలో భాగంగా అధికారులు ఈ మేరకు సూచనలు చేశారు. పాన్‌కార్డ్‌కి అనుసంధామైన అధిక మొత్తం లావాదేవీల వివరాలు వెల్లడించకపోతే నోటీసులు అందుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

కొన్ని ముఖ్యమైన లావాదేవీలు ఇవీ.

సేవింగ్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు..ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్ బ్యాంక్ అకౌంట్‌(Saving Bank Account) ద్వారా రూ.10 లక్షలు పైబడి ఏ లావాదేవీ జరిగినా ఐదాయ పన్ను విభాగానికి తెలిజేయాలి. ఇదే నిబంధన కరెంట్ అకౌంట్లకూ వర్తిస్తుంది. అయితే కరెంట్ అకౌంట్ ఖాతా నగదు పరిమితి రూ.50 లక్షలు మించకూడదు.

బ్యాంకులో ఫిక్సుడ్ డిపాజిట్లు.

బ్యాంక్ ఫిక్సుడ్ డిపాజిట్లు(Bank Fixed deposits) రూ.10 లక్షలు మించితే ఐటీ డిపార్ట్‌మెంట్‌కి సమాచారమివ్వాలి. ఒకేసారి లేదా వేర్వేరుసార్లు కలిపి ఫిక్సుడ్ డిపాజిట్ల మొత్తం వ్యాల్యూ సూచించిన పరిమితి దాటితే ఫామ్ 61ఏ రూపంలో లావాదేవీల వివరాలను వెల్లడించాలి.

క్రెడిట్ కార్డు బిల్లులు.

క్రెడిట్ కార్డు బిల్లు(Credit Card ) చెల్లింపు(payments) రూ.1 లక్ష కంటే ఎక్కువగా ఉంటే ఐటీ డిపార్ట్‌మెంట్‌కి రిపోర్ట్ చేయాలి. లేదంటే క్రెడిట్ కార్డ్‌ ద్వారా జరిగిన అన్ని లావాదేవీలనూ అధికారులు పర్యవేక్షిస్తారు. క్రెడిట్ కార్డుతో అనుసంధానమైన వివరాలను దాచిపెట్టినట్టు తేలితే నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఒక ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డు బిల్లులు రూ.10 లక్షలు దాటినా ఐటీఆర్‌లో తెలియజేయాలి.

స్థిరాస్తి క్రమవిక్రయాలు.

దేశవ్యాప్తంగా స్థిరాస్తి(Immovable) క్రమవిక్రయాల(sale-purchase) విలువ రూ.30 లక్షలు పైబడితే ఆ సమాచారాన్ని అన్నీ ప్రాపర్టీ రిజిస్ట్రార్లు, సబ్-రిజిస్ట్రార్లు.. ఆదాయ పన్ను అధికారులకు తప్పనిసరిగా తెలియజేయాలి.

షేర్లు, మ్యూచువల్ ఫండ్లు.

మ్యుచువల్ ఫండ్లు(Mutual Funds), స్టాక్స్(Stocks), బాండ్లు(Bonds), డిబెంచర్స్‌(Dibentures)లో పెట్టుబడుల విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు మించకూడదు. ఒకవేళ పరిమితి దాటితే ఐటీఆర్ ఫైలింగ్‌లో వివరాలను వెల్లడించాలి. లేదంటే ఏఐఆర్(యాన్యూవల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్) స్టేట్‌మెంట్‌ను పరిశీలించి లావాదేవీలను అధికారులు గుర్తిస్తారు. ఫామ్ 26ఏఎస్ ఫామ్‌లోని పార్ట్-ఈ మీ అధిక వ్యాల్యూ లావాదేవీల వివరాలన్నీ ఉంటాయి.

సేల్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ.

ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకుమించిన విదేశీ నగదు(ఫారెన్ కరెన్సీ) విక్రయిస్తే ఆదాయ పన్ను విభాగానికి తెలియజేయాలి. లేదంటే ఐటీ అధికారుల నుంచి నోటీసులు అందుకోవాల్సి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Are you transacting beyond the limit? But this information is for you"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0