Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CM Jagan's review of education department

 విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan's review of education department

ముఖ్యమంత్రి  విద్యాశాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్న డిజిటల్‌ డిస్‌ప్లేలకు సంబంధించి వివిధ కంపెనీలు ఉపకరణాలను ముఖ్యమంత్రి పరిశీలించారు.

గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని, నాడు నేడు రెండోదశ కింద 22,344 స్కూళ్లలో చేపడుతున్న పనుల ప్రగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

అంశాలు.

  • నాడు – నేడు పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
  • స్కూళ్లలో విలువైన ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందున భద్రతదృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
  • సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఆలోచన చేయాలన్న సీఎం
  • ఎస్‌డీజీ లక్ష్యాలను చేరుకునే ప్రక్రియలో భాగంగా విద్యా వ్యవస్థలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన డేటా  నిరంతరం అప్‌లోడ్‌ అయ్యేలా చూడాలన్న సీఎం
  • దీనికి సంబంధించి ఎస్‌ఓపీలను రూపొందించాలన్న సీఎం
  • జిల్లా స్దాయిలో కలెక్టర్లు కూడా సమీక్ష చేయాలని ఆదేశం
  • టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్‌లను సమర్థవంతంగా వినియోగించుకుని స్కూళ్ల నిర్వహణను పటిష్టం చేయాలన్న సీఎం
  • తరగతి గదుల్లో డిజిటిల్‌ మౌలికసదుపాయాలపై సీఎం సమీక్ష.
  • విద్యార్థులకు సబ్జెక్టులు మరింత నిశితంగా అర్థం అయ్యేలా బోధించేందుకు ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లేలు లేదా ప్రొజెక్టర్లు పెట్టాలన్న సీఎం
  • దీనికి సంబంధించి వివిధ మోడళ్లను సీఎంకు చూపించిన అధికారులు
  • వాటి ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం
  • స్మార్ట్‌ బోధన సదుపాయాల వల్ల ఇటు పిల్లలకూ, అటు ఉపాధ్యాయులకూ మేలు జరుగుతుందన్న సీఎం
  • తరగతి గదుల్లో పెట్టే ప్రొజెక్టర్‌లు, ఇంటరాక్టివ్‌ టీవీలు నాణ్యతతో ఉండాలని సీఎం ఆదేశం
  • పీపీ –1 నుంచి రెండో తరగతి వరకూ స్మార్ట్‌ టీవీలు, 3వ తరగతి ఆపైన ప్రొజెక్టర్‌లు పెట్టేలా ఆలోచన చేయాలన్న సీఎం
  • అన్ని హైస్కూళ్లలోనూ, నాడు –నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో మొదటి దశ కింద ఏర్పాటు చేయాలన్న సీఎం
  • వచ్చేవారం నాటికి దీనిపై కార్యాచరణ సిద్ధంచేయాలన్న సీఎం. 
  • ఈ సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్‌లపైనా సీఎం సమీక్ష
  • ట్యాబ్‌లన్నీ నాణ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం
  • ఈ ట్యాబ్‌ల్లోకి కంటెంట్‌ లోడ్‌ చేయనున్న బైజూస్‌

విద్యాకానుకపైనా సీఎం సమీక్ష.

  • వచ్చే ఏడాదికి విద్యాకానుకకు సంబంధించి ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్న సీఎం
  • విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ప్రతి స్థాయిలో కూడా పర్యవేక్షణ కూడా అంతే బలంగా ఉండాలన్న సీఎం
  • విద్యాశాఖలో డీఈఓ, ఎంఈఓ సహా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలున్న పోస్టులను వెంటనే భర్తీచేయాలని సీఎం ఆదేశం
  • ఎస్‌సీఈఆర్టీ, డైట్‌ సీనియర్‌ లెక్చరర్స్, డైట్‌ లెక్చరర్స్‌ పోస్టుల భర్తీపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
  • హాస్టళ్లలో కూడా నాడు – నేడు పనులను రెండోదశ కింద చేపట్టాలన్న సీఎం

సమావేశానికి విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఎ మురళీ, ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ కార్యదర్శి ఏ సాంబశివారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CM Jagan's review of education department"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0