Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DA Arriers

 డిఎ ఎరియర్స్ 

DA Arriers

2018 జూలై ,2019 జనవరి ,2019 జూలై నెలల్లో రావలి‌సిన మూడు డిఏలు పాతరేట్ల ప్రకారం మంజూరు చేస్తూ జీవోలు జారీ చేయబడినవి.అందులో మొదటి రెండు డిఏలు పెన్షన్ లో కలిపి వేసారు.

మూడో డిఏ జీవో ఇచ్చిన నెల రోజుల లోపు కొత్త RPS 2022 ప్రకటించినందున దానిని పక్కన పెట్టి, తరువాత నాలుగు డిఏలు తో కలిపి, అయిదు డిఏలు కొత్త రేట్లు ప్రకారం జనవరి 2022నుండి కన్సాలిడేటెడ్ కొత్త పెన్షన్ తో కలిపి ఇప్పటి వరకు ఇస్తున్నారు. 

మొదటి రెండు పాత స్కేల్ డిఏ ఎరియర్స్ ,కొంతమందికి కొన్ని చోట్ల బిల్లు పాస్ చేసి cfmsలో ఒక సంవత్సరం పేమెంట్ పెండింగ్ (గ్రీన్ ఛానల్ )లో వుంచి, 4-4-2022 న ఆర్ధిక సంవత్సరం ముగిసినందున కొత్త టోకెన్ నెంబర్ ఇచ్చి, డ్రాయింగ్ ఆఫీసర్ లకి రీసబ్మిట్ చేయమని తిప్పి పంపించేరు.రెండవసారి అవే బిల్లు లు సబ్మిట్ చేద్దాం అంటే cfms website లో కరెంటు మంత్ జీతాలు పెన్షన్లు తప్ప, ఇంక ఏ బిల్లు లు స్వీకరించకుండా వెబ్ సైట్ బ్లాక్ చేసారు. ఈ మధ్యకాలంలో సబ్మిట్ చేసినట్టుగా సమాచారం. జూన్ 27, 2022న DA కి సంబంధించి, పే స్లిప్పులు జనరేట్ అయినవి, తరువాత జూలై 19న రెండో  డి ఏ పేస్లిప్ జనరేట్ అయినవి. మరి ఈ మొత్తాలు జమ అవుతాయో లేదో చెప్పలేము.

ఇక అయిదు కొత్త డిఏల ఎరియర్స్ విషయానికి వస్తే, అది ఒక పెద్ద విప్పలేని పీట ముడి. విద్యుత్తు నుండి ఉష్ణం ఎలా వేరు చేయడం కష్టమో ,PRC Arrears నుండి ,DA Arrears వేరు చేయడం అంత కష్టం.మిశ్రా కమీషన్ రిపోర్టు కి బదులు

సమీర్ శర్మ కమిటీ రిపోర్ట్ తయారు చేసే సమయంలో ,ఇచ్చేది మరియు తగ్గించేది సమానం చేయడంలో భాగంగా, ఫిట్ మెంట్ -4% అడ్ జస్ట్  చేయడానికి అవకాశం లేకపోయింది.

IRరికవరీ తప్పని సరిఅయిపోయింది.

అందువలన ఈ తేనె తుట్ట కదపడానికి ఎవరూ సాహసించలేక, కాలమే నిర్ణయించాలి అనుకొన్నారు.

PRC ఆర్ధిక ప్రయోజనాలు ఇవ్వని 9 నెలల కాలానికి, 1-7-2019 నుండి 31-3-2020 వరకు మాత్రమే IR రికవరీ మినహాయించారు. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రికల్  ఉద్యోగులు  మరియు పెన్షనర్లు, రాజమండ్రి వారు హైకోర్టులో కేసు వేసి 1/4/ 20 నుంచి IR రికవరీ చేయడం పై, స్టే తెచ్చుకున్నారు.

DA Arrears (5slabs) Arrears  విడిగా చెల్లిస్తే ప్రతి ఉద్యోగి/పెన్షనర్ కి 50వేల నుండి 2లక్షల వరకు ఎరియర్స్ చెల్లించవలసి ఉంటుంది. బడ్జట్ చాలదు. ప్రస్తుతము ఇచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి  ఆ రకంగా కనిపించడం లేదు.

PRC Arrears bill విడిగా తయారు చేస్తే ఋణాత్మకం (మైనస్4%HRA&4%IR)  అవుతుంది.

PRC Arrears, DA Arrears (5 slabs) కలిపి ఒకే బిల్లు లో తయారు చేస్తే,  మొత్తం డిఏ ఎరియర్స్ నుండి తగ్గించిన 4% IR మరియు 4% HRA (ఇదివరలో అదనంగా చెల్లించేసేమనిభావిస్తున్న) రికవరు చేసుకుని, ఇంకా ఏమైనా మిగిలితే 2023 లో నాలుగు వాయిదాలు లో ఇస్తారని ఈమధ్య జీవో జారీ చేశారు. ఇప్పటికీ రెండు డి ఎ  లు వాయిదాల బకాయి రావలసినది కానీ రాలేదు .మరలా పిఆర్సి అరియర్స్ 2023 లో  నాలుగు వాయిదాలలో చెల్లిస్తానని అంటున్నారు, ఇది అర్థం కాని పరిస్థితి.

చివరగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఏమీ అర్థం కాని పరిస్థితిలో అయోమయంగా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది పెన్షనర్లకు మాత్రమే వారికి రావలసిన వంటి వాటిపై అవగాహన ఉన్నది, మిగిలిన వారికి లేదు.ఎక్కువ మంది పెన్షనర్లు చెప్పేది మాకు డి ఏ రావాలి అంటున్నారు తప్ప వారికి అవగాహన లేదు.



.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DA Arriers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0