Details of the new regulations that came into force on July 1.
జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిభంధనలు వాటి వివరాలు.
బ్యాంకింగ్ , ఇతర వాణిజ్య రంగాలల్లో నిత్యం ఏదొక మార్పులు రావడం సహజం..కొత్త కొత్త నిబంధనలు అమల్లోకి వస్తుంటాయి. అలాగే జూలై 1వ తేదీ నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి..అవేంటో ఇప్పుడు చుద్దాము..పాన్-ఆధార్ లింక్‌పై ఆలస్య రుసుము రెట్టింపు కానుంది.
ఒక వ్యక్తి 31 మార్చి 2022 నుండి 30 జూన్ 2022 తర్వాత ఆధార్‌తో పాన్‌ను లింక్ చేసినట్లయితే, ఆ వ్యక్తి ఆలస్య రుసుము రూ. 500 చెల్లించాలి. అయితే ఒక వ్యక్తి 30 జూన్ 2022లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైతే అతను జూలై1 2022 నుండి పాన్-ఆధార్ సీడింగ్ కోసం రూ. 1,000 రెట్టింపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
వివిధ సంస్థల ఉద్యోగులు, కంపెనీల కార్మికులు వేతనం, పని గంటలతోపాటు వివిధ వర్గాల వారిపై వడ్డించే పన్నులు తదితరాలు మారనున్నాయి. న్యూ వేజ్ కోడ్‌తోపాటు నూతన కార్మిక చట్టాలు అమలు చేయడంతో ఉద్యోగి, కార్మికుడు ప్రతి నెలా వేతనం, ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ లో కంట్రిబ్యూషన్ వచ్చేనెల 1వ తేదీ నుంచి మారిపోనున్నాయి. ఇంకా సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు, డాక్టర్లపై టీడీఎస్ నిబంధనలు, ఇతర రూల్స్ మారనున్నాయి. టీడీఎస్ కొత్త నిబంధన కింద కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మార్గదర్శకాలను జారీ చేసింది.
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు లేబర్ కోడ్‌ల కింద ఇంకా నిబంధనలు ఖరారు చేయలేదు.ఇప్పటి వరకు 23 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వేజ్ కోడ్‌ల కింద ముసాయిదా నిబంధనలు ప్రచురించాయి.ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ పెరగనుంది. ప్రతి యేటా జనవరి, జూలైలో కేంద్రం డీఏను విడుదల చేస్తోంది.
అలాగే క్రెడిట్, డెబిట్ కార్డు లకు టోకేనైజేషన్ వ్యవస్థ అమలు కానుంది.వివిధ పారిశ్రామిక కంపెనీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై జారీ చేయనున్న టోకెనైజేషన్ అమలును సెప్టెంబర్ 30 వరకు వాయిదా వేసింది.1 ఏప్రిల్ 2022 నుండి క్రిప్టోకరెన్సీలపై 30 శాతం ఫ్లాట్ ఇన్‌కమ్ ట్యాక్స్ విధించిన తర్వాత, GoI క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై పెట్టుబడిదారుడు పొందే లాభం లేదా నష్టంతో సంబంధం లేకుండా 1 శాతం TDSని అదనంగా విధించబోతోంది..ఇవి నేటి నుంచి అమలు కానున్న కొత్త నిభంధనలు.
0 Response to "Details of the new regulations that came into force on July 1."
Post a Comment