Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explanation of why mother-in-law and daughter-in-law should not walk in the same walk during Ashadamasam.

 ఆషాడమాసం లో అత్తా కోడలు ఒకే వాకిట్లో ఎందుకు నడవ కూడదో వివరణ.

Explanation of why mother-in-law and daughter-in-law should not walk in the same walk during Ashadamasam.


ఆషాడమాసం. దీనికి మరో పేరు శూన్యమాసం. ఆషాడ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది కొత్తగా పెళ్లయిన భార్య భర్తలు దూరంగా ఉంటారు.

ఆ సమయంలో శుభకార్యాలకు అనుకూలం కాదని శాస్త్రం చెబుతోంది. అదే ఆషాడ మాసంలో అత్త కోడలు కూడా ఒకే గడపలో అంటే ఒకే ఇంట్లో ఉండకూడదనేది ఎప్పటినుంచో ఉన్న సాంప్రదాయం. అసలు ఈ సాంప్రదాయానికి ఒక కారణం ఉందట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలావరకు వివాహాలు మాఘ, వైశాఖమాసంలో జరుగుతాయి.

వైశాఖమాసం అంటే చెప్పనవసరం లేదు. మండే వేసవికి అనుకూలమైన మాసం. ఈ మండే వేసవికి కొత్తగా వచ్చిన పెళ్లికూతురుకు అసౌకర్యంగా భావన కలగడంతో అత్తా కోడల మధ్య సఖ్యత లేకుండా పోతుందట. అందువల్లే ఆషాడ మాసంలో పుట్టింటికి పంపిస్తారని చెబుతుంటారు. పెద్దవాళ్ళు. ఇదే ఆషాడ మాసంలో అత్తా కోడలు ఒకే ఇంట్లో ఉండకపోవడానికి కారణం అని కొంతమంది చెబుతుంటారు.

మరి కొంతమంది మాత్రం వేరొక విధంగా చెబుతుంటారు. ఆషాడ మాసం అనేది తొలకరి చినుకులతో పంటలు వేయడానికి అనుకూలంగా ఉండే మాసం. రైతు కష్టపడితే గాని దేశానికి తిండి దొరకదు. ఈ మాసంలో కొత్తగా పెళ్లయిన వరుడు భార్య మీద వ్యామోహంతో వ్యవసాయ పనులను దూరం పెడతారు. కాబట్టి భార్య ను పుట్టింటికి పంపిస్తారని మరో విధంగా చెబుతుంటారు.

అలాగే ఆషాడ మాసంలో భార్యాభర్తలు ఒకే దగ్గర ఉండటం వల్ల వారికి పుట్టబోయే బిడ్డకు మంచి గుణగణాలు రావు అనే ఆచారం ప్రకారం కూడా భార్యను పుట్టింటికి ఆ సమయంలో పంపుతారని చెబుతుంటారు. ఆషాడం లో మాసంలో కోడలు గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డ మండే వేసవికాలంలో పుడతాడని అలా పుట్టడం వల్ల భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉందనే కారణంతో కూడా కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Explanation of why mother-in-law and daughter-in-law should not walk in the same walk during Ashadamasam."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0