Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

God's favorite flowers

 భగవంతునికి  ఇష్టమైన పూలు

God's favorite flowers

  • అహింస  ప్రథమం  పుష్పం  పుష్పం  ఇంద్రియ  నిగ్రహః                                     
  • సర్వ భూత  దయా పుష్పం  క్షమా  పుష్పం  విశేషతః                                                  
  • జ్ఞాన  పుష్పం  తపః పుష్పం      శాంతి  పుష్పం  తథైవ  చ                                     
  • సత్యం  అష్ట విధం  పుష్పో: విష్ణో హో  ప్రీతి కరం  భవేత్"

1. అహింసాపుష్పం : 

ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే ‘ప్రధమ పుష్పం.’

2. ఇంద్రియ నిగ్రహం : 

చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవునికి అందించాల్సిన రెండో పుష్పం!’

3.  దయ : 

కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.  ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.

4.  క్షమ : 

ఎవరైనా మనకి అపకారం చేసినా,  ఓర్పుతో సహించడమే క్షమ.  ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.

5. ధ్యానం : 

ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం. ఇది దేవుని అందించే ఐదవ పుష్పం!

6. తపస్సు : 

మానసిక ( మనస్సు), వాచిక (మాట), కాయక ( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.  ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.

7. జ్ఞానం : 

పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం.  ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.

8. సత్యం : 

ఇతరులకు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.  ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.

ఇవన్నీ చాలా అరుదైన పుష్పాలే, అవన్నీ మీ తోటలో లేవంటారా. మరేం పరవా లేదు, ఇవాళే మొక్కలు నాటండి. త్వరలోనే మిగతా పూలు పూయించండి.


   లోకా సమస్తా సుఖినోభవంతు!

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "God's favorite flowers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0