Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If our phone is lost or thrown away, we must block these. How to do it.

మన ఫోన్ పోయినా లేదా పారేసుకున్న మనం వీటిని తప్పకుండా బ్లాక్ చేయాలి ఎలాచేయాలో వివరణ.

If our phone is lost or thrown away, we must block these. How to do it.

డిజిటల్‌ చెల్లింపుల యుగమిది. జేబుల్లో డబ్బు పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. చేతిలో డివైస్‌, అకౌంట్‌లో మనీ ఉంటే చాలు సమస్త ఆర్థిక లావాదేవీలను కానిచ్చేయవచ్చు. పేమెంట్స్‌కు యూపీఐ(యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌) ప్రాథమిక విధానం కాగా మొబైల్‌ పూర్తిగా వ్యక్తిగత సమాచారానికి నెలవుగా రూపొందింది. ఫలితంగా ఫోన్‌పోతే మనీపరంగానూ నష్టపోవాల్సి వస్తుంది. ప్రైవేటు సెట్టింగ్స్‌ను ఎనేబుల్‌ చేసుకోలేనిపక్షంలో చాలా సులువుగా ఇతరులు యాక్సెస్‌ పొందే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల డివైస్‌ పోయిందని గుర్తించగానే ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంను బ్లాక్‌ చేసుకోవాలి. అదెలాగంటే.

ఫోన్‌ పోయిందా!  ఇవి బ్లాక్‌ చేయండి

  • 01204456456 అంటే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయాలి.
  • ‘లాస్‌ ఫోన్‌’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
  • ‘ఎంటర్‌ ఎ డిఫరెంట్‌ నంబర్‌’ని సెలెక్ట్‌ చేసుకుని పోగొట్టుకున్న ఫోన్‌  నంబర్‌ను టైప్‌ చేయాలి. 
  • లాగౌట్‌ ఆఫ్‌ ఎవ్విర్‌ డివైస్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి.
  • పేటీఎం వెబ్‌సైట్‌లోకి వెళ్ళి 24 ఇంటూ 7 హెల్ప్‌ని సెలెక్ట్‌ చేసుకోవాలి.
  • ‘రిపోర్ట్‌ ఎ ఫ్రాడ్‌’ని ఎంపిక చేసుకుని ఎనీ కేటగిరీని సెలెక్ట్‌ చేసుకోవాలి.
  • ఒక ఇష్యూని సెలెక్ట్‌ చేసుకున్న తదుపరి పేజీ అడుగున ఉన్న ‘మెసేజ్‌ అజ్‌’ బటన్‌ని క్లిక్‌ చేయాలి.
  • అకౌంట్‌ ఓనర్‌షిప్‌నకు సంబంధించి ప్రూఫ్‌ని అందించాలి. 
  • డెబిట్‌/క్రెడిట్‌ కార్డ్‌ స్టేట్‌మెంట్‌ - అందులో పేటీఎం అకౌంట్‌ లావాదేవీలు ఉండాలి, కన్ఫర్మేషన్‌ ఈమెయిల్‌ లేదా పేటీఎం లావాదేవీలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌, ఫోన్‌ నంబర్‌కు సంబంధించిన ఓనర్‌షిప్‌ డాక్యుమెంటేషన్‌, లేదా ఫోను పోగొట్టుకున్నట్టు పోలీసుకు ఇచ్చిన రిపోర్టు డాక్యుమెంటేషన్‌ ప్రూఫ్‌గా ఇవ్వాలి.

గూగుల్‌ పే యూజర్లు

  • 18004190157 నంబర్‌కు డయల్‌ చేస్తే కస్టమర్‌ సర్వీస్‌కు కనెక్ట్‌ కావచ్చు.
  • అకౌంట్‌ను బ్లాక్‌ చేయడంలో అందుబాటులోకి వచ్చిన ప్రతినిధి సహాయపడతారు.
  • ప్రత్యామ్నాయం కావాలని అనుకుంటే, ఆండ్రాయిడ్‌ డివైస్‌ను ఉపయోగిస్తున్నపక్షంలో డేటాను పూర్తిగా తుడిచిపెట్టాలి. తద్వారా గూగుల్‌ పే యాప్‌ యాక్సెస్‌ అలా గూగుల్‌ అకౌంట్‌ పొందకుండా చూసుకోవచ్చు. 
  • ఐఓఎస్‌ యూజర్లు సైతం ఇదే పని చేయవచ్చు. 

ఫోన్‌ పే యూజర్లు

  • 08068727374 లేదా 02268727374కి డయల్‌ చేయాలి.
  • ప్రాబ్లమ్‌ను తెలియజేయమంటూ నెంబర్‌ ఇచ్చినప్పుడు దాన్ని ప్రెస్‌ చేయాలి.
  • కన్ఫర్మేషన్‌ కోసం ఓటీపీ వస్తుంది
  • ‘ఐ హేవ్‌ నాట్‌ రిసీవ్డ్‌ యాన్‌ ఓటీపీ’ని ఎంట్రీ కోసం ఎంపిక చేసుకోవాలి. 
  • ఎస్‌ఐఎం లేదంటే డివైస్‌ పోగొట్టుకున్నట్టు తెలిపే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. 
  • సంస్థ ప్రతినిధిని మీ ఫోన్‌ నంబర్‌, ఈమెయిల్‌ అడ్రస్‌, ఆఖరు పేమెంట్‌ వ్యవహారం, దాని వాల్యూ తదితరాలు పొందగానే ఫోన్‌పే అకౌంట్‌ బ్లాక్‌ అవుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If our phone is lost or thrown away, we must block these. How to do it."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0