Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Information on the discussions with the Minister of Education

 గౌ!!విద్యాశాఖామంత్రి తో చర్చల సమాచారం

Information on the discussions with the Minister of Education


విద్యాశాఖ మంత్రితో ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో చర్చించిన అంశాలు :

ఒక కి.మీ పరిధిలోని 3-5 తరగతులు HS లలో  విలీనం  ఆగదు.ఇది political decision.

6-8 వతరగతి వరకు ఇంగ్లీషుమీడియం విషయములో ప్రభుత్వ నిర్ణయం లో మార్పులేదు.

జి.ఓ. నం.117కు ఈ రోజు లేక రేపు మార్పులు చేసి ఉత్తర్వులు ఇస్తాము..

అవి

ప్రాథమిక పాఠశాలల్లో 1:20గా చూస్తారు. 21 రోల్ దాటితే 2వ పోస్టు ఇస్తామన్నారు.

ఎల్ఎఫ్ఎల్ హెచ్.ఎం. పోస్టు 150 రోల్ పైన ఉన్న పాఠశాలకు అదనంగా ఇస్తారు.

ఎన్ రోల్ మెంట్ తేదీని 05.05.2022గానే ఉంచారు.  

3-5 &6-0హైస్కూల్లో 2వ హిందీ టీచర్ పోస్టు  10   వసెక్షన్ వద్ద ఇస్తారు.

ప్రీ హైస్కూల్స్ లో 98 రోల్ పైన ఉన్న చోట 6గురు స్కూల్ అస్టిస్టెంట్లు 1 పిఇటిని ఇస్తారు.

రాష్ట్రంలోని హైస్కూల్స్ లో 998 హెచ్.ఎం. పోస్టులు అప్ గ్రేడేషన్ కోసం ఫైనాన్స్ కి ఫైల్ పెట్టారు.

స్కూల్ అసిస్టెంట్  5419 పోస్టులు అప్ గ్రేడేషన్ కోసం ఫైనాన్స్ కి ఫైల్ పెట్టారు. అనుమతి రాగానే పదోన్నతులు ఇస్తాము.

రాష్ట్రంలో 2342 ఎస్.ఏ. పోస్టులు తత్సమాన పోస్టులకు కన్వర్షన్ ఇస్తున్నారు.

అన్ని హైస్కూల్స్ కి హెచ్.ఎం. మరియు పి.డి. పోస్టుRoll descending order లో ఇస్తారు.

అన్ని వసతులున్న చోట మాత్రమే మెర్జింగ్ చేస్తారు.

ఏ ఉపాధ్యాయునికి 36 పీరియడ్లు పైబడి ఉండవు.

బదిలీలు

ప్రభుత్వం నుంచి సిఫార్సు బదిలీలు ఉండవు.

జీరో సర్వీసుతో బదిలీలు చేస్తారు.

బదిలీల.కట్ ఆఫ్ డేట్.30:06:2022 జులై నెలాఖరుకు మార్చాలని కోరారు.G.O వచ్చిన. Date నెలమొదటీరోజు.

Maximum sevice:5 years for all cadres, కాని హెచ్ఎంలకు తప్ప మిగిలిన అన్ని క్యాడర్లకు 8 సం.లు ఉండాలని కోరగా సరే చూస్తామన్నారు.

2021 జనవరిలో transfer అయి ప్రస్తుతం rationalization కు గురయ్యే   టీచర్లకు పాత స్టేషన్ పాయింట్స్ ఇస్తారు.

మ్యాపింగ్ వలన ఎఫెక్ట్ అయ్యేవారికి మాత్రమే స్పెషల్ పాయింట్స్ ఇస్తారు. మిగిలిన వారికి రేషనలైజేషన్ పాయింట్లు లేవు.

Against PD పోస్టులలో పనిచేసే PET లు కూడా బదిలీ చేస్తారు.

గర్ల్స జూనియర్ కాలేజీలలో+1 చేరికకు విద్యార్ధులను ప్రోత్సహి చాలి.HM లే Admissons చేపట్టాలి. విద్యార్ధులు చేరి  పదోన్నతిపై PGT లు వచ్చేవరకు Deputations పైనడుపుదాం.

హైస్కూల్స్ లో 1:60 కాకుండా 1:45గా ఉండాలని ప్రాతినిధ్యం చేసాం.

సింగిల్ టీచర్స్ గా మారుతున్న పాఠశాలల్లో 20పైన రోల్ ఉంటే 2వ పోస్టు తప్పనిసరిగా మంజూరు చేయాలని కోరారు.Descending order లో ఇస్తామన్నారు.

అన్ని కేడర్ల వారికి ఆన్ లైన్ లోనే బదిలీలు జరుగుతాయి. No  manual.

Ph  కేడర్లో ortho &Blind వారికే Priority ఉండును.మిగిలిన వారికి Points ఇస్తాము.

సర్వీసు రూల్స్ లేవు గనుకMEO లకు బదిలీలు ఉండవన్నారు.

సీనియార్టీని స్కూల్ base గా కాకుండా స్టేషన్ base గా (పంచాయతీ) బదిలీలు ఉంటాయి.. ఇది వద్దు అన్నారు.

విద్యాశాఖ తాను అనుకొన్న విధానానికి కొద్ది మార్పులు చేసి ప్రభుత్వ పరంగా  ముందుకు పోతారనే అభిప్రాయం మాటలలోవ్యక్తం అయినది.

"సంఘాలు చేసిన సూచనలను చాలా వాటిని పరిగణన లోకి తీసుకొన్నాం.డ్రాఫ్టు G.O త్వరలో ఇస్తాం .ఇంకేమైనా సహేతుకమైన అభ్యంతరాలుంటేచెప్పండి మరల  కూర్చుందాం . ధర్నాలు చేసుకొంటామంటేమీ ఇష్టం"  అని మంత్రి గారు అనటం కొసమెరుపు

Trouble Shooter గా పేరున్న శ్రీ బొత్స గారు ఏమి చేస్తారో చూద్దాము.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Information on the discussions with the Minister of Education"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0