Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Interesting things to know about Arvind Kejriwal who made Delhi the only debt-free state in the country.

దేశంలో అప్పులు లేని ఏకైక రాష్ట్రంగా ఢిల్లీ ని నిలిపిన అరవింద్‌ కేజ్రీవాల్‌ గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అరవింద్‌ కేజ్రీవాల్‌ దేశంలోనే చాలా స్పెషల్ సీఎం గా పేరు దక్కించుకున్నాడు. దేశంలో అప్పులు లేని ఏకైక రాష్ట్రంగా ఢిల్లీ ని నిలిపిన ఘనత అరవింద్ కేజ్రీవాల్ కు దక్కింది. ఐ.ఐ.టీ. ఖరగ్పూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఉన్నత ఉద్యోగం చేసి.. ఎన్నో సామాజిక పోరాటాలు నిర్వహించి ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసి ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 

కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16న హర్యానాలోని భివాని జిల్లాలోని సివానీ లో ఒక మధ్య తరగతి అగర్వాల్ కుటుంబంలో జన్మించారు.

తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్. 1985లో IIT-JEE పరీక్షకు హాజరై ఆల్ ఇండియా 563 ర్యాంక్ సాధించాడు. దాంతో అతడికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ లో సీటు వచ్చింది. అక్కడ నుండి కేజ్రీవాల్‌ మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. ఖరగ్‌ పూర్ ఐఐటీ  నుండి ఎంతో మంది మేధావులు పట్టభద్రులుగా బయటకు వచ్చారు. 1989 లో టాటా స్టీల్‌లో మొదటి ఉద్యోగంలో చేరాడు. ఆ సమయంలో ఆయనకు ఒక స్వచ్ఛంద సంస్థ తో పని చేసే అవకాశం దక్కింది. ఒక వైపు టాటా కంపెనీ ఉద్యోగం కంటిన్యూ చేస్తూ మరో వైపు ఆ ఎన్జీఓ లో పని చేయడం ద్వారా ప్రజా సేవ మరియు పరిపాలన పై ఆసక్తి పెరిగింది. కేజ్రీవాల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా అర్హత సాధించిన తర్వాత 1995లో ఆదాయపు పన్ను అసిస్టెంట్ కమిషనర్‌గా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో చేరారు.

నవంబర్ 2000 సంవత్సరంలో రెండేళ్ల ఉన్నత విద్యను అభ్యసించడానికి అతనికి రెండు సంవత్సరాల వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయబడింది. రెండు సంవత్సరాల తర్వాత ఉద్యోగం లో తిరిగి చేరకుంటే సెలవు కాలంలో ఇచ్చిన జీతం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దాంతో కేజ్రీవాల్‌ నవంబర్ 2002లో తిరిగి ఉద్యోగంలో చేరాడు. 2008 లో ఈ సంస్థ ఢిల్లీ నకిలీ రేషన్ కార్డు స్కాం ను బట్ట బయలు చేసింది. సమాచార హక్కు చట్టం వినియోగించి ఢిల్లీ లోని ప్రభుత్వ సంస్థ లలో మరియు ఉద్యోగస్తుల అవినీతి ని వెలికితీశారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేతో కలిసి జన లోక్ పాల్ బిల్లు బిల్లు కోసం పోరాడారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఆందోళన చేస్తే సరిపోదు.. ప్రభుత్వాలపై పోరాడితే సమస్యలు తీరవు అని తెలుసుకున్నాడు. అందుకే సొంతంగా పార్టీ పెట్టాలని భావించాడు. అందుకోసం స్నేహితులతో చర్చించాడు. 

2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ అనే రాజకీయ పార్టీని ఢిల్లీలో స్థాపించారు. 2013 డిసెంబర్ 4 న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందాడు. అప్పటికే మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ పై ఏకంగా 25, 864 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ మొదటి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. సంకీర్ణ ప్రభుత్వం లో రాజీ పడుతూ ఉండటం తన పద్దతికి విరుద్ధం అంటూ 49 రోజుల్లోనే తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2014 ఫిబ్రవరి లో సంపూర్ణ మెజార్టీతో ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గా అడుగు పెట్టిన అరవింద్ కేజ్రీవాల్‌ వరుసగా మూడవ సారి కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఢిల్లీలో కాలుష్య నివారణకు వాహనాలను బేసి, సరి సంఖ్య ల విధానంతో రోడ్ల మీదకు రావాలంటూ ఆదేశించారు. 

యువతకు ఉద్యోగ కల్పన మొదలుకుని ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి మళ్లీ మళ్లీ కేజ్రీవాల్‌ సీఎం అవ్వాలని ప్రజలు కోరుకునేలా చేశాడు. ఢిల్లీ నుండి ఇతర రాష్ట్రాలకు ఆమ్‌ ఆద్మీ పార్టీని విస్తరించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ రుణ రహిత రాష్ట్రంగా మారడంతో ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇప్పుడు కేజ్రీవాల్ ను నమ్మే అవకాశం ఉంది. కనుక ఇప్పట్లో కాకున్నా రాబోయే కాలంలో అరవింద్ కేజ్రీవాల్‌ దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలక వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. ఒక మంచి విద్యా వేత్త రాజకీయ నాయకుడు అయ్యి పరిపాలన సాగిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదే అరవింద్ కేజ్రీవాల్ నిరూపించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Interesting things to know about Arvind Kejriwal who made Delhi the only debt-free state in the country."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0