ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే సీఎం జగన్ సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. ఐతే ఏ విభాగంలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనేది ఇంకా వెల్లడించలేదు.
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
జాబ్ నోటిఫికేషన్ (Job Notifications) కోసం ఎదురుచూస్తున్నవారికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా పోలీస్ శాఖ (AP Police Jobs) లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది.
పోలీస్ శాఖపై కొన్ని నెలల క్రితం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో పోలీస్ శాఖలో ఖాళీలు, రాష్ట్ర అవసరాలు, కొత్త జిల్లాల తర్వాత అవసరమైన అదనపు పోస్టుల భర్తీపై చర్చించారు. ఈ మేరకు పూర్తి నివేదిక ఇవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీస్ శాఖ.. ఇప్పటికే భర్తీ చేయాల్సిన పోస్టులు, రాష్ట్ర అసరాల దృష్ట్యా అదనపు పోస్టులు మొత్తం కలిపి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలన్నదానిపై సమాచారం సేకరించారు.
రాష్ట్రంలో మొత్తం 26,431 పోస్టులను భర్తీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలిదశలో 6,500 ఉద్యోగాలకు ఈ ఏడాదే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయి. మిగిలిన పోస్టులను దశలవారీగా భర్తీ చేయనున్నారు.
ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే సీఎం జగన్ సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. ఐతే ఏ విభాగంలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనేది ఇంకా వెల్లడించలేదు.
0 Response to "Job Notifications"
Post a Comment