Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APSSDC Job Mela

 ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో భారీ జాబ్ మేళా (Job Mela) కు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు అధికారులు.

APSSDC Job Mela

ప్రముఖ Apollo Pharmacy సంస్థలో 100కు పైగా ఖాళీల (Jobs) భర్తీకి ఈ ఇంటర్వ్యూలను (Interviews) నిర్వహించనున్నారు. ఈ ఇంటర్వ్యూలను ఈ నెల 11న అంటే ఎల్లుండి సోమవారం నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనం ఉంటుంది. మొత్తం 4 విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు..

Trainer: ఈ విభాగంలో 1 ఖాళీ ఉంది. M. Pharmacy విద్యార్హతో పాటు రెండేళ్ల అనుభవం ఉన్న వాళ్లు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనం ఉంటుంది. ఇంకా TA, ESI, PF, Bonusతో ఇతర సదుపాయాలు ఉంటాయి. ఎంపికైన వారు రాయలసీమ ప్రాంతంలో పని చేయాల్సి ఉంటుంది.

HR Recruiter: ఈ విభాగంలో 1 ఖాళీ ఉంటుంది. MBA HR విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల వేతనం ఉంటుంది. ఎంపికైన వారికి TA&ఇన్సెంటీవ్స్ ఉంటాయి. ఎంపికైన వారు రాయలసీమలో పని చేయాల్సి ఉంటుంది.

Pharmacist: ఈ విభాగంలో 50 ఖాళీలు ఉంటాయి. బీఫార్మసీ/ఎంఫార్మసీ/డీఫార్మసీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.17 వేల వరకు వేతనం ఉంటుంది. ఇంకా రూ.3 వేల వరకు ఇన్సెంటీవ్స్ సైతం ఉన్నాయి. పులివెందులలో ఎంపికైన వారు పని చేయాల్సి ఉంటుంది.

Retail Trainee Associate: ఈ విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్/డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు పులివెందులలో పని చేయాల్సి ఉంటుంది.

ఇతర వివరాలు:

  • అభ్యర్థులు www.apssdc.in లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులు ఈ నెల 11న ఉదయం 10 గంటలకు భారత్ కోచింగ్ సెంటర్, వాసవీ హోటల్ పైన, పులివెందుల, కడప చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులు Resume, విద్యార్హతల సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్, ఆధార్ కాపీలను ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
  • ఇతర పూర్తి వివరాలకు 9908808914 నంబర్ ను సంప్రదించవచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APSSDC Job Mela"

Post a Comment