New President of India
New President of India : భారీ విజయం .భారత్ కు15 వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము .ఈనెల 25 న ప్రమాణ స్వీకారం.
New President of India: ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇందులో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. కాగా, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఓటమి చెందారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము అఖండ విజయం సాధించడంతో హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో సంబరాలు ఆకాశాన్నంటాయి. బీజేపీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. డప్పు, వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తున్నారు.
***********************************
- తొలి రౌండ్ ఫలితం: తొలి రౌండ్‌లో ఎంపీల ఓట్లు లెక్కించారు. మొత్తం 763మంది ఎంపీలు ఓటు వేయగా.. వీటిలో 15 ఓట్లు చెల్లలేదు. దీంతో 748 ఓట్లలో ద్రౌపదీ ముర్ముకు 540 ఓట్లు రాగా (విలువ 3,78,000).. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు (విలువ 1,45,600) వచ్చాయని రిటర్నింగ్ అధికారి, రాజస్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు.
- రెండో రౌండ్ ఫలితం: రెండో రౌండ్‌లో ద్రౌపదీ ముర్ము భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. రెండో రౌండ్‌లో 10 రాష్ట్రాలను ఆంగ్ల అక్షర క్రమంలో తీసుకొని ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆయా రాష్ట్రాల్లో ఓట్ల సంఖ్య 1138 కాగా.. వాటి విలువ 1,49,575. వీటిలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు 809 ఓట్లు (ఓట్ల విలువ 1,05,299) రాగా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 329 (ఓట్ల విలువ 44,276) వచ్చాయి.
- రెండు రౌండ్లలో కలిపి ఇలా.. ఇప్పటివరకు మొత్తం ఓట్లు 1886 కాగా.. వాటి విలువ 6,73,175గా ఉంది. వీటిలో ద్రౌపదీ ముర్ముకు 1349 ఓట్లు (4,83,299 విలువ) రాగా.. యశ్వంత్ సిన్హా 537 ఓట్లు (1,89,876)గా ఉంది.
- మూడో రౌండ్: మూడో రౌండ్ లెక్కింపు పూర్తయింది. ఈ రౌండ్‌లో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు కవర్ అయ్యాయని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ వెల్లడించారు. ఈ రౌండ్‌లో 1333 ఓట్లు చెల్లుబాటు కాగా.. వీటి విలువ 1,65,664గా ఉన్నట్టు తెలిపారు. వీటిలో ద్రౌపదీ ముర్ముకు 812 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 521 ఓట్లు వచ్చినట్టు వెల్లడించారు.
- ద్రౌపదీ ముర్ము స్వగ్రామం ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్‌లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. 20వేల మిఠాయిలు చేసి సిద్ధంగా ఉంచారు. ఫలితాలు వెలువడ్డాక ఆదివాసీ సంప్రదాయ నృత్యంతో విజయోత్సవ ఊరేగింపు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
- కౌంటింగ్ ఈ మధ్యాహ్నం 1.30గంటలకు పార్లమెంట్ హౌస్‌లో ప్రారంభమైంది. తొలి రౌండ్‌లో ఎంపీల ఓట్లు లెక్కించగా.. ఆ తర్వాత అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా ఓట్ల లెక్కింపు కొనసాగిస్తున్నారు.
- ఫలితాలు వెలువడ్డాక ప్రధాని నరేంద్ర మోదీ ద్రౌపదీ ముర్మును కలవనున్నారు. ఆమె తాత్కాలికంగా నివాసం ఉంటున్న నివాసానికి వెళ్లి అభినందనలు తెలపనున్నట్టు సమాచారం.
- ముర్ము విజయం సాధించాక దిల్లీ భాజపా విజయోత్సవ రోడ్‌షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్‌పథ్ వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ రోడ్‌షోలో భాజపా సీనియర్ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. అలాగే, అన్ని రాష్ట్రాల్లో భాజపా నేతలు విజయోత్సవ వేడుకలకు సిద్ధమయ్యారు.
0 Response to "New President of India"
Post a Comment