Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

No Driving Test: Those who want to get a driving license do not need a driving test from Good News.

 No Driving Test : డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి గుడ్ న్యూస్ఇక నుంచి డ్రైవింగ్ టెస్ట్ అవసరం లేదు .

No Driving Test: Those who want to get a driving license do not need a driving test from Good News.

రవాణా శాఖ నియమ నిబంధనల ప్రకారం వాహనం నడిపే ప్రతీ ఒక్కరికీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి.

అయితే దానిని తీసుకోవాలంటే.. దరఖాస్తు చేసుకొని.. డ్రైవింగ్ టెస్ట్ చేసిన తర్వాత అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ ను మంజూరు చేస్తారు. 

ఇలా ఆర్టీవో కార్యాలయానికి ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది. ఇలా కాకుండా.. ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరిగే పనిలేకుండా.. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ జారీ చేసిన కొత్త నియమాలు అమల్లోకి వచ్చేశాయి. 

ఈ నియమాల్లో.. డ్రైవింగ్ టెస్ట్ లేకుండా.. ఆర్టీవో కార్యాలయానికి వెళ్లకుండానే మీరు లైసెన్స్ తీసుకోవచ్చు. ఈ కొత్త నియమాల్లో గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నిర్వహించే టెస్ట్ ఉత్తీర్ణులైతే చాలు.

ఇనిస్టిట్యూట్ లో అర్హత సాధించిన వారికి మాత్రమే లైసెన్స్ లభ్యమవుతుంది. దీని వల్ల ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ.. క్యూలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలు డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్‌లు ప్రారంభిస్తున్నాయి. 

డ్రైవింగ్ లైసెన్స్ కావాలని దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ సంస్థ నిర్వహించే పరీక్ష పాస్ అవ్వాల్సింటుంది. ఆ తర్వాత వాళ్లు మీరు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయినట్లు ఓ సర్టిఫికెట్ ను జారీ చేస్తారు.

ఆ తర్వాత ఆ సర్టిఫికేట్ ఆధారంగా.. ఆర్టీఓ కార్యాలయంలో లైసెన్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆ తరువాత ఆర్టీవో నుంచి ఏ విధమైన టెస్టింగ్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ జారీ అవుతుంది.

ఈ డ్రైవింగ్ కోర్సు లైట్ మోటార్ వెహికల్ కోసం అందించనున్నారు. కోర్సు వ్యవధి 29 గంటలు అంటే.. గరిష్టంగా నాలుగు వారాలు పాటు ఉంటుంది. ఈ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టీసు కూడా ఉంటుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "No Driving Test: Those who want to get a driving license do not need a driving test from Good News."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0