Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sale of textbooks for academic year 2022-23 - Guidelines issued on Payment Procedure for Supply to Private-On-Aided School.

 విక్రయ పాఠ్య పుస్తకములు 2022-23 విద్యాసంవత్సరం - ప్రైవేట్ -ఆన్-ఎయిడెడ్ పాఠశాలకు సరఫరా పేమెంట్ విధానము పై మార్గదర్శకాలు విడుదల.

Sale of textbooks for academic year 2022-23 - Guidelines issued on Payment Procedure for Supply to Private-On-Aided School.

RC number 106/NT Books/2022-1,తేదీ: 09.07.2022

ఆదేశములు:

పాఠశాల విద్యాశాఖ కమీషనర్, ఆంధ్రప్రదేశ్ వారి కార్యవర్తనములు.

ప్రస్తుతం: శ్రీ ఎస్. సురేష్ కుమార్ ఐ.ఏ.ఎస్.

విషయం:- పాఠశాల విద్య పాఠ్యపుస్తకములు (విక్రయ పాఠ్య పుస్తకములు) 2022-23 విద్యా

సంవత్సరం - ప్రైవేట్ ఆన్-ఎయిడెడ్ పాఠశాలకు సరఫరా పేమెంట్ విధానము పాఠశాల విద్య

ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు జిల్లా విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు

మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు / యాజమాన్యాలకు మార్గదర్శకాలు యూజర్

మాన్యువల్ - జారీచేయుట గురించి జిల్లా విద్యాశాఖాధికారులకు మండల విద్యాశాఖాధికారులకు

ప్రైవేట్ ఆన్-ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలకు మార్గదర్శకాలు గురించి,

సూచిక : 1 ఆర్ సి నెంబర్ 106/NT Books/2022, తేదీ: 25.06.2022, పాఠశాల

విద్యాశాఖ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ వారి కార్య వర్తనములు.

సూచిక 1 అనుసరించి ప్రైవేట్ యాజమాన్యంలోని పాఠశాలలు విద్యార్థులకు అవసరమైన ప్రభుత్వ

పాఠ్యపుస్తకాల సరఫరా మరియు పంపిణికి సంబంధించి సమగ్రమైన ఉత్తర్వులు ఇవ్వడమైనది. ప్రైవేట్ ఆన్-ఎయిడెడ్

పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలల లాగిన్ల ద్వారా అవసరమైన పాఠ్య పుస్తకాల కొరకు ఇదివరకే ఇండెంట్

పెట్టడము జరిగినది. తదనుగుణంగా ప్రభుత్వ పాఠ్య పుస్తకాల డైరెక్టర్, 2022-23 సంవత్సరానికి గాను

గుర్తింపు పొందిన ప్రింటర్ల ద్వారా పాఠ్య పుస్తకాలను ముద్రించి జిల్లా పాఠ్య పుస్తకాల మేనేజర్ల ద్వారా అన్ని మండల

కేంద్రాలకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు.


ఈ సూచిక ద్వారా ఒక్కొక్క పాఠ్య పుస్తకం విక్రయ ఖరీదు మరియయు తరగతి వారీగా పుస్తకాల సెట్

ఖరీదును కూడా తెలియపరచడం జరిగినది. అదేవిధముగా ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు

తమకు అవసరమైన పాఠ్య పుస్తకాలను ఆన్ లైన్ పేమెంట్ ద్వారా చెల్లించి తగు రశీదును పొంది మండల

విద్యాశాఖాధికారులను సంప్రదించి పాఠ్య పుస్తకాలు పొందవచ్చని సూచించడమైనది.

వరకు:

ఆన్ లైన్లో పాఠశాలకు అవసరమైన పుస్తకములు కొరకు తగిన సొమ్ము చెల్లించే విధానము మరియు మండల

విద్యాశాఖాధికారి ఏ విధంగా పేమెంట్ ప్రక్రియ ని ధృవీకరించుకొనవలెనో మరియు చెల్లించిన సొమ్ముకి అనుగుణంగా

పుస్తకాలను ఏ విధంగా పంపిణీ చేయవలెనో అయా వివరాలతో కూడిన యూజర్ మాన్యువల్ కూడా దీనికి

File No.ESE02/346/2022-TB SEC-CSE

అనుబంధంగా జత చేయడమైనది.

రాష్ట్రములోని

ప్రాంతీయ విద్య సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారులు జిల్లా పాఠ్య

పుస్తకాల మేనేజర్లు మరియు మండల విద్యాశాఖాధికారులు పాఠ్య పుస్తకాల (విక్రయ) పంపిణీకి సంబంధించి

గతంలో జారీ చేసిన మార్గదర్శకాలననుసరించి తగు ప్రణాళిక ప్రకారం అమలు చేయవలసిందిగా ఇందు మూలముగా దీనితో పాటు యూజర్ మాన్యువల్ జతపరచడమైనది.

1. రాష్ట్రములోని అందరూ ప్రాంతీయ విద్య సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారులు, జిల్లా

పాఠ్య పుస్తకాల మేనేజర్లు మరియు మండల విద్యాశాఖాధికారులకు తగు చర్య నిమిత్తము,

2. ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలకు తగు సమాచారము కొరకు.

S Suresh Kumar

పాఠశాల విద్యాశాఖ కమిషనర్,

ఆంధ్రప్రదేశ్.

తరగతులు వారీగా పాఠ్యపుస్తకాల ధరలు వివరాలు



Download proceedings


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sale of textbooks for academic year 2022-23 - Guidelines issued on Payment Procedure for Supply to Private-On-Aided School."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0