Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC Recruitment 2022

 SSC Recruitment 2022 : నిరుద్యోగులకు అలర్ట్ .. 1411 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ .పూర్తి వివరాలివే.

SSC Recruitment 2022

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు నోటిఫికేషన్ (SSC Job Notification) విడుదల చేసింది SSC. మొత్తం 1411 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దిల్లీ పోలీస్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..

మొత్తం పోస్టులు : 1411

కేటగిరీపోస్టుల సంఖ్య
జనరల్604
EWS142
OBC353
ఎస్సీ262
ఎస్టీ50
మొత్తం:1411

అర్హతల వివరాలు:

10+2 (సీనియర్ సెకండరీ) విద్యార్హతల కలిగిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హెవీ మోటార్ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వాహనాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి యస్సు జులై 1 నాటికి 18-27 ఏళ్ల వయస్సు ఉండాలి

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం:07.07.22

దరఖాస్తులకు ఆఖరి తేదీ: 29.07.22

ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ: 30.07.22

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT): అక్టోబర్

ఇతర వివరాలు:

అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. ఈ ఎగ్జామ్ కోసం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, గుంటూరు, చీరాల, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, నెల్లూరు, విజయనగరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSC Recruitment 2022 "

Post a Comment