Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

To the birth mother. Right to decide child's surname : Supreme Court

 జన్మనిచ్చిన తల్లికి . పిల్లల ఇంటిపేరు నిర్ణయించే హక్కు ఉంటుంది : సుప్రీంకోర్టు

To the birth mother.  Right to decide child's surname : Supreme Court


న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఈ రోజు ఓ కీలక విషయాలపై స్పష్టత ఇచ్చింది. తండ్రి చనిపోయిన తర్వాత పిల్లలకు సహజ సంరక్షకురాలు తల్లి మాత్రమే అని, కాబట్టి, ఆ సందర్భంలో పిల్లల ఇంటి పేరు నిర్ణయించే హక్కు ఆమెకు ఉంటుందని వివరించింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పును పక్కనపెడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

ఈ కేసులు ఓ తల్లికి.. ఆమె మాజీ అత్తమామలకు సంబంధించింది. ఆ మహిళ తల్లి అయిన తర్వాత భర్త మరణించాడు. అనంతరం, ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మొదటి భర్తతో కలిగిన సంతానాన్ని కూడా తన రెండో భర్త కుటుంబంతో కలిపేసుకుంది. ఆ సంతానానికి తన రెండో భర్త ఇంటి పేరునే పెట్టాలని తల్లి నిర్ణయించింది. కానీ, ఆమె మొదటి భర్త తల్లిదండ్రులు మాత్రం అభ్యంతరం తెలిపారు. మరణించిన తమ కొడుకు సంతానానికి ఆమె రెండో భర్త ఇంటి పేరు పెట్టడాన్ని తాము అంగీకరించబోమని వాదిస్తున్నారు. ఈ కేసు తొలుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో తన రెండో భర్త పేరును సవతి తండ్రిగా రికార్డుల్లో ఎక్కించాలని ఆదేశించింది.

అయితే, ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆ చిన్నారికి బయలాజికల్ ఫాదర్ లేడు.. కానీ, బయలాజికల్ మదర్ ఉన్నది. అంటే.. ఆ చిన్నారికి ఇంటిపేరు నిర్ణయించే హక్కు, దత్తతకు ఇచ్చే హక్కు చిన్నారి బయలాజికల్ మదర్‌కే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ క్రిష్ణ మురారిల ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. కోర్టు ఈ విషయాలపై జోక్యం చేసుకోవచ్చునని, కానీ, ఆ బాలుడి భవిష్యత్‌ కంటే మరే కారణాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన ఎక్కువ ప్రాధాన్యమున్నవి కావని వివరించింది.

ఆ తల్లి రెండో పెళ్లి చేసుకుని తన మొదటి కొడుకును రెండో భర్తకు దత్తత ఇచ్చిందని, తద్వారా ఆ చిన్నారి తన తండ్రి కుటుంబ బాధ్యతలు, హక్కులు కోల్పోయి.. రెండో తండ్రి కుటుంబ బాధ్యతలు, హక్కులు పొందుతాడని బెంచ్ వివరించింది. ఆ చిన్నారి ఇంటిపేరును నిర్ణయించే అధికారం ఏకైక సహజ సంరక్షకురాలైనా తల్లికే ఉంటుందని తెలిపింది.

ఇంటి పేరు వేరుగా పెడితే.. తన రెండో కుటుంబంలోనూ ఆ చిన్నారి వేరుగా ఉంచినట్టు అవుతుందని, అది వారి పెరుగుదలపై ప్రతికూల ప్రభావం వేస్తాయని బెంచ్ తెలిపింది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "To the birth mother. Right to decide child's surname : Supreme Court"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0