Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Voter ID Card

 Voter ID Card : 17 ఏళ్లకే ఓటర్ కార్డు దరఖాస్తుకు అవకాశం. ఈసీ కీలక నిర్ణయం.

Voter ID Card

ఓటర్‌ జాబితాలో పేరు నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందేందుకు ఎవరైనా 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే.

జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టిన వారు మాత్రమే ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ, 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. 17 ఏళ్లు నిండిన యువత ఓటర్‌ కార్డు కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.

జనవరి 1వ తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూడకుండా 17 ఏళ్ల వయసు దాటిన వారు ఓటర్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. 18 ఏళ్లు నిండిన తర్వాతనే ఓటర్‌ కార్డు అందిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజివ్‌ కుమార్‌, ఎలక్షన్‌ కమిషనర్‌ అనుప్‌ చంద్ర పాండేల నేతృత్వంలోని ఈసీఐ.. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 17 ఏళ్లుపైబడిన యువత ఓటర్‌ జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించింది. ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపింది.

ఏడాదిలో మూడుసార్లు అవకాశం..
యువత కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబర్‌ 1వ తేదీల్లో ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఈసీ. ప్రతి త్రైమాసికానికి ఓటర్‌ జాబితాను అప్డేట్‌ చేస్తారు. దాంతో ఆ మధ్య 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్‌ కార్డు జారీ చేశారు. 2023లో ఏప్రిల్‌ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్‌గా ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్‌పీ యాక్ట్‌ 1950లోని సెక్షన్‌ 14బీ, రిజిస్ట్రేషన్ ఆఫ్‌ ఎలక్టోర్స్ రూల్స్‌, 1960 చట్టాల్లో మార్పులు చేసింది న్యాయశాఖ. దరఖాస్తు ఫారాలను సైతం యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చనుంది ఈసీ. కొత్త దరఖాస్తు ఫారాలు 2022, ఆగస్టు 1వ తేదీ తర్వాత అందుబాటులోకి రానున్నాయి. అయితే.. ఆలోపు పాత దరఖాస్తుల్లో వివరాలు అందించిన వారికి అనుమతిస్తారు.

Voter ID: ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు

సౌలభ్యం కలిపించిన కేంద్ర ఎన్నికల సంఘం

దిల్లీ: ఓటరు కార్డు (Voter ID) కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. యువకులు 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడనవసరం లేదని ఎన్నికల సంఘం (Election Commission) పేర్కొంది. ఇప్పటి వరకు జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండినవారికే ఓటరు జాబితాలో నమోదుకు అర్హులు కాగా.. తాజా నిర్ణయంతో 17ఏళ్ల వారందరికీ అవకాశం లభించినట్లయ్యింది.

ఓటరు జాబితాలో యువత పేర్ల నమోదుకు సంబంధించి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌తోపాటు ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్రపాండే ఈ నిర్ణయాన్ని వెలువచూడనవసరం  ఈ సందర్భంగా ముందస్తుగా ఓటరు నమోదుకు అవసరమైన సాంకేతికతకు అందుబాటులో ఉంచాలని అన్ని రాష్ట్రాల్లోని సీఈఓ/ఈఆర్‌ఓ/ఏఈఆర్‌ఓలకు సూచించారు. మరోవైపు ఆధార్‌ సంఖ్యతో ఓటరు కార్డుల అనుసంధాన ప్రక్రియను ఆగస్టు 1 నుంచి ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేసిన ఈసీ.. ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని, స్వచ్ఛందం మాత్రమేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఓటు హక్కు వినియోగానికీ ఆధార్‌ అనుసంధానానికి ఎటువంటి సంబంధం ఉండదని కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతోంది. ఆధార్‌ అనుసంధానంతో బోగస్‌ ఓటర్లను తొలగించటం సులభమవుతుందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్న విషయం తెలిసిందే.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Voter ID Card"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0