Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What are the rules for writing a record sheet?

 రికార్డ్ షీట్ రాయుటలో నియమ నిబంధనలు ఏమిటి ?

What are the rules for writing a record sheet?

నవీన కాలంలో వచ్చిన మార్పులు (చైల్డ్ ఇన్ఫో , ఆన్ లైన్, ఆధార్ నెం.) వలన ఇపుడు మార్కెట్ లో దొరికే రికార్డ్ షీట్ పనికి రాదు. మార్కెట్ లో దొరికే రికార్డ్ షీట్ ను  మరి కొన్ని వివరాలు కలుపుతూ రికార్డ్ షీట్ తయారు చేశారు. ఒకే పేజీ లో రెండు వచ్చే విధంగా ప్రభుత్వ అధికార ముద్రతో డిజైన్ చేయబడింది. 

 1 )  రికార్డ్ షీట్ పై వరుస నెంబర్ రాయడం తప్పనిసరి. ఒక వేళ పాఠశాల లో ఇదివరకు సరైన వరుస క్రమం లేనట్లయితే వరుస నెంబర్/సంవత్సరం  పద్దతి లో రాయవచ్చు.

ఉదా: 27/2018

 2 )  రికార్డ్ షీట్ మీద వైట్ నర్ వాడకూడదు. తప్పు పోయినట్లు అయితే కొట్టివేసి HM సంతకం చేస్తే సరిపోతుంది.

3 )  విద్యార్థి పేరు ను పూర్తి గా రాయాలి. ఇంగ్లీష్ లో రాసేవారు పెద్ద అక్షరాల లో రాయాలి.

4)  విద్యార్థి రికార్డ్ షీట్ ఎపుడు తీసుకుంటాడు అదే రోజు నాటి తేదీ నీ ఇష్యూ డేట్ గా రాయాలి. కానీ పాఠశాల వదిలి వెళ్ళిన తేదీ మాత్రం అకాడమిక్ సంవత్సరం చివరి రోజుది వేయాలి. ఇది విద్యార్థి తరగతి పూర్తి చేసినపుడు వర్తిస్తుంది. మద్యలో వెల్లినట్లైతే వెళ్ళిన తేదీ రాయాలి.

5 )  విద్యార్థి కులం రాసే సమయంలో మతం, కులం, ఉప కులం ను రాయాలి మరియు వారి  వరుస నెంబర్ రాయాలి.


ఉదా:మతం:హిందూ , కులం:యాదవ, BC-D(33).

6 )  పుట్టిన తేదిని ఖచ్చితంగా పదాలలో రాయాలి.

7 )  విద్యార్థి తల్లిదండ్రులు తో కాకుండా వేరే వారితో నివాసం ఉంటూ చదివినట్లు అయితే ( ఆమ్మమ్మ దగ్గర ) వారి పేరు రాయవలసి ఉంటుంది.

8 )  రికార్డ్ షీట్ లు రెండు రాయాలి. ఒకటి ఆఫీస్ కాపీ, ఇంకొకటి విద్యార్థికి ఇవ్వాలి. ఒక వేళ విద్యార్థి ఈ రికార్డ్ షీట్ పోగొట్టుకున్న ఎడల మరొకటి రాసి ఇవ్వచ్చు. కానీ వరుస నెంబర్ ( రికార్డ్ షీట్ నెంబర్ ) మారకూడదు . ఆఫీస్ కాపి ను చూసి రాయాలి.

9 )  ఒక వేళ ప్రభుత్వ పాఠశాల అయితే విద్యార్థులను దగ్గర లోని ఉన్నత పాఠశాల లో ప్రధానోపాధ్యాయులు గారే చేర్పించాలి. ఒక వేళ విద్యార్థి తల్లిదండ్రులు వేరే దగ్గర చేర్పిస్తాము అన్నట్లైతే సంబంధిత సర్టిఫికెట్ లు వారికి ఇచ్చి ఆ పాఠశాల పేరును ఆఫీస్ కాపి పై రాయాలి.

10 )  విద్యార్థికి రికార్డ్ షీట్ ఇచ్చే సమయంలో విద్యార్థి తల్లిదండ్రులు సమక్షం లో ఇవ్వడం మంచిది. మరియు విధిగా వారు అడగక పోయినా వారికి  బోనఫైడ్ సర్టిఫికెట్, క్యుములెట్ రికార్డ్ ( మార్క్ ల షీట్ ) , రికార్డ్ షీట్ , ఆరోగ్య కార్డు లు ను ఒక ఫైల్ కవర్ లో ఇవ్వాలి.

11 )  ప్రాథమిక పాఠశాలలో పిల్లలు చిన్న పిల్లలు కావున, వారికి బోనఫైడ్ సర్టిఫికెట్, క్యుములెట్ రికార్డ్ ( మార్క్ ల షీట్ ) , రికార్డ్ షీట్ , ఆరోగ్య కార్డు లు ముట్టనట్లు గా విద్యార్థి నుండి మరియు విద్యార్థి తల్లిదండ్రులు నుండి సంతకం తీసుకోవాలి.

12 )  రికార్డ్ షీట్ మరియు  బోనఫైడ్ లను కొన్ని వివరాలు మనకు వీలైనపుడు ముందే రాసి పెట్టుకుంటే ఇచ్చే సమయంలో గాబార పడాల్సి రాదు.

13 )  రికార్డ్ షీట్ ఇచ్చే సమయంలో అడ్మిషన్ రిజిష్టర్ లో వివరాలు నమోదు చేసి అందులో సంతకం చేసిన తర్వాత మాత్రమే రికార్డ్ షీట్ ఇష్యూ చేయాలి. పని ఒత్తిడి లో గాని గాబరా లో గాని అడ్మిషన్ రిజిష్టర్ లో రాయడం మరచి పోవడం పరిపాటి, కానీ ఇదే విద్యార్థికి మరియు అప్పటి HM కు తీవ్ర నష్టం కలుగుతుంది.

14 )  పుట్టు మచ్చలు రెండు  రాయాలి, ఒక వేళ రెండు దొరకక పోతే కనీసం ఒకటి రాయడం తప్పనిసరి. 

15 )  పుట్టు మచ్చలు ఖచ్చితంగా బయటకు కనిపించేవి మాత్రమే రాయాలి. ఉదా: ముఖం, మెడ, మోచేతి వరకు చేతి పైన, కాలి మడమల వరకు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What are the rules for writing a record sheet?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0