Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Why do people sit in temples after divine darshan...?

 దేవుడి దర్శనం తర్వాత గుడిలో కూర్చొని లేవడానికి గల సైంటిఫిక్ రీజన్స్.

Why do people sit in temples after divine darshan...?

సాధారణంగా ఆలయంలో దైవ దర్శనం తర్వాత గుడిలో కొద్దిపేపు కూర్చొంటారు. ఇలా ఎందుకు కూర్చొంటారో చాలా మందికి తెలియదు. మరికొందరు హడావుడిగా దైవ దర్శనం పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంటారు. నిజానికి దైవ దర్శనం తర్వాత ఆలయంలో కొద్ది సేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెపుతున్నాయి.

స్థిరచిత్తంతో, ఐహికత్వాన్ని మరిచి, మౌనధ్యానంతో, కొంతసమయం దేవాలయంలో కూర్చోవటం శాస్త్రసమ్మతమని పేర్కొంటున్నాయి. దేవాలయంలో అంటే దేవునికి ఎదురుగా అనికాదు. దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు.

ఆలయ ప్రవేశానికీ కొన్ని నియమాలున్నాయి. ఆలయం ప్రవవేశించబోయే ముందు మన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంతస్థు, హోదాను, గొప్పతనం, పలుకుబడిని ఆలయంలో ఎక్కడా.. ఎవరివద్దా ప్రదర్శించరాదు. ముఖ్యంగా మనలో ఉండే కోపాన్ని, అహంకారాన్ని, ఆధిక్యతనూ దేవాలయాల్లో చూపించరాదు.

దేవుడు అందరికీ దేవుడే. దైవకార్యాలకు అందరూ పెద్దలే. దైవప్రీతికి అందరూ పాత్రులే. దైవపూజకు ప్రతి ఒక్కరూ అర్హులే. దైవదర్శనానికి అందరూ సమానమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని నడుచుకోవాలని మన శాస్త్రాలు, వేదాలు ఘోషిస్తున్నాయి.

మరి దేవుడుని దర్శించుకొన్న తర్వాత దేవాలయంలో కూర్చోవడానికి కొన్ని శాస్త్రీయమైన కారణాలు:

ఆలయ ప్రదేశాలలో విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్ర ఉత్తర దక్షిణ ధృవముల తరంగ విస్తృతి అధికముగా ఉండి, ఇటువంటి ధనాత్మక శక్తి విరివిగా లభ్యం అవుతున్నటువంటి చోట వ్యూహాత్మకంగా దేవాలయముల నిర్మాణం జరిగెడిది.

మూల విరాట్టు లేదా ప్రధాన మూర్తిని ఈ ప్రదేశం యొక్క కేంద్రక స్థానం వద్ద ప్రతిష్టించడం జరుగుతుంది. దీనినే గర్భగృహం లేదా మూల స్థానం అని కూడా పిలుస్తారు. ఈ మూలస్థానం వద్ద భూమి అయస్కాంత తరంగాలు అధికముగా ఉంటాయి.

వేద మంత్రాలు వ్రాయబడ్డ తామ్ర పత్రాలు (రాగి రేకులు) మూల విరాట్టు అడుగు భాగంలో భూస్థాపితం చేయబడి ఉంటాయని మన పెద్దలు చెప్పడం మనకు తెలుసు.

వాస్తవానికి ఆ రాగి రేకులు ఏమిటి? పూజారులు శ్లోకాలను మరిచిపోయినప్పుడు చదువుకోవడానికి అవి వారికి ఉపయోగపడతాయా, అంటే కాదు. ఈ రాగి రేకులు భూమి యొక్క అయస్కాంత తరంగాలను గ్రహించి తమ పరిసరాలకు పునః ప్రసారం చేస్తాయి.

ఆ విధంగా ప్రతీ రోజు దేవాలయ సందర్శనానికి వచ్చి, సవ్య దిశలో (గడియారపు ముల్లు తిరిగే మాదిరి) మూల విరాట్టు కి ప్రదక్షిణ చేస్తూ తిరుగుతున్నప్పుడు, ఆ వ్యక్తి శరీరం మూల విరాట్టు అడుగున ఉన్న రాగి రేకులు ప్రసారం చేస్తున్న భూ అయస్కాంత తరంగాలను గ్రహించడం జరుగుతుంద

ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది, అందుకే మన పెద్దలు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా నెమ్మదిగా మౌనంగా చేయాలని చెబుతుంటారు. శాస్త్రీయంగా, మనం అందరం ఆరోగ్యంగా జీవించడానికి ఈ ధనాత్మక శక్తి ఎంతగానో దోహదపడుతుంది.

దేవాలయాలను దర్శించినప్పుడు మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది, దేవాలయంలో భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత శరీరం మనస్సు ఉత్తేజితమవుతాయి.

అందుకు కారణం అక్కడి భగవంతుని మహిమ, మంత్రోచ్చారణలు మాత్రమే కాదు, ప్రత్యేకమైన మన ఆలయ నిర్మాణ శైలి కూడా ప్రధాన కారణం.

దేవాలయాలు శక్తికి కేంద్రకాలు. మంత్రోచ్ఛారణాల్లోని శబ్ధతరంగాల వల్ల మనసు చెడు ఆలోచనల వైపు మరలదు. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం.

ఆధ్యాత్మికంగా ఆత్మానందాన్ని కలిగించే వాతావరణం ఉన్న గుడిలో దైవ సన్నిధిలో ధ్యానం గానీ, జపంకానీ చేయడం వల్ల జ్ఝాపకశక్తి మెరుగై రెట్టింపు ఫలితాలను పొందుతారు.

సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను సాధించవచ్చు. అందుకే దేవాలయాలలో భగవంతుని దర్శనం తర్వాత కాసేపు ఆ ఆవరణలో ప్రశాంతంగా కూర్చోవాలి.

దేవాలయంలో కూర్చుంటే మనస్సుకు ప్రశాంతత, పుణ్యఫలం దక్కుతుందని పెద్దల వాక్కు. అలా కూర్చోకుండా వెళ్లే భగవంతుని దర్శించిన ఫలితం కూడా రాదని అంటుంటారు.

ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని మంచీ , చెడులను ఆలోచించి మంచి వైపు మార్గాన్ని ఎంచుకొనే అవకాశాన్ని మన మనస్సు అందిస్తాయి.

ఇలా ఆలయంలో కూర్చోవడం ఒక రకమైన ద్యానం వంటిది. అలా ఒక 2 నిముషాల పాటు మౌనంగా కూర్చొని మనం దర్శించిన ఆ భగవంతుని తిరిగి స్పృతి చేసుకుంటే వచ్చే ఆనందం మరియు ప్రశాంతత ఉత్తమమైనది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Why do people sit in temples after divine darshan...?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0