Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSC Job Notifications

 APPSC : ఏపీ నిరుద్యోగులకు అలర్ట్ .. అతి త్వరలో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 జాబ్ నోటిఫికేషన్లు . మొత్తం పోస్టుల వివరాలు.

APPSC Job Notifications


APPSC Job Notifications: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) చైర్మన్ గౌతమ్ సవాంగ్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఆగస్టులో 110 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్‌, 182 గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ (APPSC Job Notification) విడుదల చేయనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరో 13 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. తద్వారా మరో 2000 ఉద్యోగాలను (APPSC Jobs) భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

APSRTC: ఏపీ మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. ఇకపై RTC లో మహిళా డ్రైవర్లు.. ఉచిత శిక్షణ కూడా.. ఉండాల్సిన అర్హతలివే

APSRTC To Get Woman Bus Drivers: తాజాగా ఏపీ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళా డ్రైవర్లు ఆర్టీసీ (APSRTC) బస్సు స్టీరింగ్ పట్టబోతున్నారు. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు మొదలు పెట్టింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు రాష్ట్రంలోని ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. దీంతో ఆర్టీసీలో ఇప్పటివరకు మహిళా కండక్టర్లు ఉన్నారు. ఇకపై మహిళా డ్రైవర్లు కూడా రంగంలోకి దిగనున్నారు.

సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా శిక్షణ పొందే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు త్వరలో మార్గదర్శకాలను విడుదలకానున్నాయి. ఇప్పటికే 13 ఉమ్మడి జిల్లాల ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీలకు ప్రాథమికంగా ఆదేశాలు ఇచ్చారు. 10వ తరగతి పాసైన వారు ఈ శిక్షణకు అర్హులుగా ఉంటారు. మహిళల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేయనున్నారు. వీరికి ఉమ్మడి జిల్లాల్లోని అందుబాటులో ఉన్న ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూళ్లలో 32 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఆర్టీసీ బస్సుపైనే శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ ఇచ్చినందుకు ఆర్టీసీకి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది. డ్రైవింగ్‌లో శిక్షణతో పాటు మహిళలకు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా ఇస్తారు.

ఇలా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులకు ఆర్టీసీలోనే డ్రైవర్‌గా పోస్టింగ్‌ ఇస్తారు. ఈ అభ్యర్థుల్లో అర్హత, నైపుణ్యాన్ని బట్టి తొలి దశలో ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఎస్సీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో నియమించేందుకు ప్రతిపాదించారు. అర్హుల ఎంపిక కోసం అవసరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామన్నారు మంత్రి మేరుగ నాగార్జున. ఎంపికైన ఎస్సీ మహిళలకు ఆర్టీసీ ద్వారా భారీ వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను తొలి దఫా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 310 ఎస్సీ బ్యాక్‌లాగ్‌ డ్రైవర్‌ పోస్టుల్లో నియమించేలా ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSC Job Notifications"

Post a Comment