Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sri Varasiddi Vinayaka Pujaa Vidhaanam

వరసిద్ధి వినాయక పూజా విధానం.

Sri Varasiddi Vinayaka Pujaa Vidhaanam

 (తెచ్చుకున్న వినాయక విగ్రహాన్ని పూజించాలి. విగ్రహంపై పువ్వుతో కొద్ది కొద్దిగా పంచామృతాలను చిలకరించాలి.)


శ్లో।।అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణ మిహనో ధేహి భోగమ్, జ్యో కృశ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే మృడయాన స్స్వస్తి.
అమృతం వై ప్రాణా అమృత మాపః ప్రాణానేవ యథాస్థాన ముపహ్వయతే.

శ్లో।।స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూ జావసానకం।
తావ త్త్వం ప్రీతిభావేన బింబే స్మిన్ సన్నిధిం కురు।।
ఆవహీతోభవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ,
అవకుంఠితోభవ, వరదోభవ, ప్రసీద, ప్రసీద, ప్రసీద
(గణపతి విగ్రహానికి నమస్కరించుకోవాలి)
పూజా విధానం : (కింద ఇచ్చిన శ్లోకాలను చదువుతూ, అక్షింతలు వేస్తూ దేవుడికి నమస్కరించుకోవాలి.)
ధ్యానం 
శ్లో।।భవసంచిత పాపౌఘ - విధ్వంసన విచక్షణం।
విఘ్నాంధకార భాస్వంతం - - విఘ్నరాజమహంభజే।
ఏకదంతం శూర్పకర్ణం - గజవక్షం చతుర్భుజం।
పాశాంకుశధరం దేవం -- ధ్యాయేత్సద్ధి వినాయకం।
ఉత్తమం గణనాధస్య -- వ్రతం సంపత్కరం శుభం।
భక్తాభీష్టంప్రదం తస్మాత్ -- ధ్యాయేత్తం విఘ్ననాయకం।।
ధ్యాయేద్గజాననం దేవం -- తప్త కాంచన సన్నిభం।
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం।।
ఓం శ్రీ వరసిద్ది వినాయకాయ నమః
ధ్యాయామి, ధ్యానం సమర్పయామి.
ఆవాహనం.
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ అక్షింతలు వేయాలి.)
శ్లో।। అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర
అనాధనాధ సర్వజ్ఞ -- గౌరిగర్భసముద్భవ।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః
ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి.
ఆసనం.
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ అక్షింతలు వేయాలి.)
శ్లో।।మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నై ర్విరాజితం
రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః
నవరత్న ఖచిత స్వర్ణసింహాసనార్థం --
ఆసనం సమర్పయామి.
అర్ఘ్యం.
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. పువ్వుతో విగ్రహం చేతులపై నీరు చల్లాలి.)
శ్లో।।గౌరీపుత్ర నమస్తేస్తు శంకరస్య ప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షితైర్యుతం।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.
పాద్యం.
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. పువ్వుతో విగ్రహం పాదాలపై నీరు చల్లాలి.)
శ్లో।।గజవక్ష నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః
పాదయోః పాద్యం సమర్పయామి.
ఆచమనీయం...
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. పువ్వుతో నీరు చల్లాలి.)
శ్లో।।అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత।।
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయాప్రభో।।
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
మధుపర్కం.
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. పత్తి, పసపు/గంధం కలిపి చేసిన మధుపర్కాన్ని దేవుడి ముందు ఉంచాలి.)
శ్లో।।దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్।
మధుపర్కం గృహాణేదం గజవక్ర నమోస్తుతే।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః
మధుపర్కం సమర్పయామి.
పంచామృత స్నానం.
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. పువ్వుతో పంచామృతాలు చల్లాలి.)
శ్లో।। స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః
పంచామృత స్నానం సమర్పయామి.
శుద్ధోదక స్నానం
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. పువ్వుతో నీరు చల్లాలి.)
శ్లో।। గంగాది సర్వతీర్థైభ్యః ఆహృతైరమలైర్జలై:।
స్నానం కురుష్వ భగవన్నుమా పుత్ర నమోస్తుతే।।
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
శుద్ధోదక స్నానం సమర్పయామి.
స్నానానంతరం పునః పూజ
(మనం తెచ్చుకున్న వినాయక విగ్రహాన్ని పూజించాలి. విగ్రహంపై పువ్వుతో కొద్ది కొద్దిగా పంచామృతాలను చిలకరించాలి.)
శ్లో।।అసునీతే పునరస్మాసు చక్షుః
పునః ప్రాణ మిహనో ధేహి భోగమ్,
జ్యో కృశ్యేమ సూర్య ముచ్చరంత
మనుమతే మృడయాన స్స్వస్తి.
అమృతం వై ప్రాణా అమృత మాపః
ప్రాణానేవ యథాస్థాన ముపహ్వయతే.
శ్లో।।స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూ జావసానకం।
తావ త్త్వం ప్రీతిభావేన బింబే స్మిన్ సన్నిధిం కురు।।
ఆవహీతోభవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ,
అవకుంఠితోభవ, వరదోభవ,
ప్రసీద, ప్రసీద, ప్రసీద
(గణపతి విగ్రహానికి నమస్కరించుకోవాలి)
వస్త్రం... (కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. దూదిని పల్చగా చేసి వేయాలి.)
శ్లో।।రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం।
శుభప్రదం గృహాణత్వం, లంబోదర హరాత్మజ।।
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
వస్త్రయుగ్మం సమర్పయామి.
యజ్ఞోపవీతం
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. దూదితో చేసిన యజ్ఞోపవీతం వేయాలి.)
శ్లో।। రాజితం బ్రహ్మ సూత్రంచ కాంచనం చోత్తరీయకం!
గృహాణ సర్వ దేవజ్ఞ భక్తానామిష్టదాయక।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి.
గంధం 
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. పువ్వుతో గంధం వేయాలి.)
శ్లో।।చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్।
విలేపనం సురశ్రేష్ఠం ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః
దివ్య శ్రీ చందనం సమర్పయామి.
అక్షింతలు
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. అక్షింతలు వేయాలి.)
శ్లో।।అక్షతాన్ ధవళాన్ దివ్యాన్
శాలీయాంస్తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః అలంకరణార్థం హరిద్రాక్షతాన్ సమర్పయామి.
పుష్పములు
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. పూలు వేయాలి.)
శ్లో।।సుగంధాని చ సుపుష్పాణి, జాజీకుంద ముఖానిచ
ఏకవింశతి పత్రాణి సంగృహాణనమోస్తుతే।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః పుష్పం సమర్పయామి.
అధాంగపూజ.
(కింద ఇచ్చిన నామాలు చదువుతూ పత్ర, పుష్ప, అక్షింతలు వగైరా.. నామానికి ఎదురుగా తెలిపిన చోట పూజించాలి.)
ఓం గణేశాయ నమః -పాదౌ పూజయామి (పాదములు)
ఓం ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి (మడిమలు)
ఓం శూర్పకర్ణాయ నమః- జానునీ పూజయామి (మోకాళ్ళు)
ఓం విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి (పిక్కలు)
ఓం ఆఖువాహనాయ నమః - ఊరుం పూజయామి (తొడలు)
ఓం హేరంబాయ నమః -కటిం పూజయామి (పిఱుదు)
ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి (బొజ్జ)
ఓం గణనాధాయ నమః- నాభిం పూజయామి (బొడ్డు)
ఓం గణేశాయ నమః- హృదయం పూజయామి (ఛాతీ)
ఓం స్థూలకంఠాయ నమః- కంఠం పూజయామి (కంఠం)
ఓం స్కందాగ్రజాయ నమః- స్కంధౌ పూజయామి (భుజములు)
ఓం పాశహస్తాయ నమః -హగ్రౌ పూజయామి (చేతులు)
ఓం గజవక్రాయ నమః -వక్రం పూజయామి (ముఖము)
ఓం విఘ్నహంత్రే నమః- నేత్రే పూజయామి (కళ్లు)
ఓం శూర్పకర్ణాయ నమః - కర్లో పూజయామి (చెవులు)
ఓం ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి (నుదురు)
ఓం సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి (తల)
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః - సర్వాణ్యంగాని
పూజయామి (శరీరమంతటా)...అధ ఏకవింశతిపత్రపూజ (21 ఆకులతో పూజ చేయాలి.)
ఓం సుముఖాయ నమః - మాచీ పత్రం పూజయామి (మాచీపత్రి)
ఓం గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి (వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః - దుర్వారయుగ్మం పూజయామి (గరికె)
ఓం హరసూనవే నమః - దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః - బదరీ పత్రం పూజయామి (రేగు ఆకు)
ఓం గుహాగ్రజాయ నమః - అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణి)
ఓం గజకర్ణాయ నమః - తులసీపత్రం పూజయామి (తులసీదళములు)
ఓం ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి (మామిడి ఆకు)
ఓం వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంత)
ఓం వటవే నమః - దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః - దేవదారు పత్రం పూజయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి (మరువము)
ఓం హేరంబాయ నమః - సింధువార పత్రం పూజయామి (వావిలి ఆకు)
ఓం శూర్పకర్ణాయ నమః - జాజీపత్రం పూజయామి (జాజి),
ఓం సురాగ్రజాయ నమ - గండకీపత్రం పూజయామి (గండకి ఆకు)
ఓం ఇభవక్రాయ నమః - శమీపత్రం పూజయామి (జమ్మి ఆకు)
ఓం వినాయకాయ నమః - అశ్వతపత్రం పూజయామి (రావి ఆకు)
ఓం సురసేవితాయ నమః - అర్జున పత్రం పూజయామి (మద్ది ఆకు)
ఓం కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి (జిల్లేడు)
ఓం శ్రీ గణేశ్వరాయ నమః - ఏకవింశతి పత్రాణి పూజయామి
(పూజ చేయగా మిగిలిన ఆకులన్నీ వేయాలి)
అష్టోత్తర శతనామావళి పూజ
(అష్టోత్తరములోని ప్రతి మంత్రానికి ఒక్కొక్క పువ్వు లేదా అక్షింతలు వేయాలి.)
ప్రతి నామానికి మొదట 'ఓం' అని, చివర 'నమః' అని చేర్చండి.
ఓం గం వినాయకాయ, విఘ్నరాజాయ, గౌరీపుత్రాయ, గణేశ్వరాయ
స్కందాగ్రజాయ, అవ్యయాయ, పూతాయ, దక్షాయ, అధ్యక్ష్యాయ
ద్విజప్రియాయ, అగ్నిగర్బచ్చిదే, ఇంద్రశ్రీప్రదాయ, వాణీప్రదాయ,
సర్వసిద్ధిప్రదాయ, శర్వతనయాయ, శర్వరీప్రియాయ
సర్వాత్మకాయ, సృష్టికర్తే, దేవాయ -, అనేకార్చితాయ, శివాయ
శుద్ధాయ, బుద్ధి ప్రియాయ, శాంతాయ, బ్రహ్మచరిణే, గజాననాయ
ద్వైమాత్రేయాయ, గజస్తుత్యాయ, భక్తవిఘ్న వినాశకాయ, ఏకదంతాయ
చతుర్బాహవే, చతురాయ, శక్తిసంయుతాయ, లంబోదరాయ
శూర్పకర్ణాయ, హరయే, బ్రహ్మవిదుత్తమాయ, కాలాయ,
గ్రహపతయే కామినే, సోమసూర్యాగ్ని లోచనాయ, పాశాంకుధరాయ
చండాయ, గుణాతీతాయ, నిరంజనాయ, అకల్మషాయ, స్వయంసిద్ధాయ
సిద్ధార్చితపదాంబుజాయ, బీజపూర ఫలాసక్తాయ, వరదాయ, శాశ్వతాయ
కృతినే, విద్పత్ప్రియాయ, వీత భయాయ, గదినే, చక్రిణే, ఇక్షుచాపభృతే
శ్రీదాయ, అజాయ, ఉత్పలకరాయ, శ్రీపతయే, స్తుతిహర్షితాయ, కులాదిభేత్త్రే,
జటిలాయ, కలికల్మషనాశనాయ, చంద్రచూడామణయే
కాంతాయ, పాపహారిణే, సమాహితాయ, ఆశ్రితాయ, శ్రీకరాయ, సౌమ్యాయ,
భక్త వాంఛిత దాయకాయ, శాంతాయ, కైవల్యసుఖదాయ
సచ్చిదానందవిగ్రహాయ, జ్ఞానినే, దయాయుతాయ, దాంతాయ
బ్రహ్మ ద్వేష వివర్జితాయ, ప్రమత్త దైత్యభయదాయ, శ్రీకంఠాయ
విబుధేశ్వరాయ, రమార్చితాయ, విధయే, నాగరాజయజ్ఞోపవీతవతే
స్థూలకంఠాయ, త్రయీకర్త్రే , సామఘోషప్రియాయ, పరస్మై
స్థూలతుండాయ, అగ్రణ్యే, ధీరాయ, వాగీశాయ, సిద్ధిదాయకాయ
దూర్వాబిల్వప్రియాయ, అవ్యక్తమూర్తయే, అద్భుతమూర్తిమతే
శైలేంద్రతనయోత్సంగ, ఖేలనోత్సుకమానసాయ, స్వలావణ్యసుధాసారజిత
మన్మథవిగ్రహాయ, సమస్తజగదాధారాయ, మాయినే, మూషిక వాహనాయ
హృష్టాయ, తుష్టాయ, ప్రసన్నాత్మనే, సర్వసిద్ధి ప్రదాయకాయ
శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః అష్టోత్తర శతనామపూజాం సమర్పయామి.
ధూపం.
శ్లో।। దశాంగం గగ్గులోపేతం సుగంధి సుమనోహరం
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ।।
శ్రీ వరసిద్ధివినాయకాయ నమః ధూపమాఘ్రాపయామి.
దీపం
శ్లో।। సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా జ్యోతితం మయా।
గృహాణమంగళం దీప మీశపుత్ర నమోస్తుతే।।
శ్రీ వరసిద్ది వినాయకాయ నమః దీపం దర్శయామి.
నైవేద్యం.
శ్లో।। సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్దెః ప్రకల్పితాన్।।
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయ మేవచ
ఇదం గృహాణనైవేద్యం మయా దత్తం వినాయక।।
శ్రీ వరసిద్ధివినాయకాయ నమః మహానైవేద్యం సమర్పయామి.
తాంబూలం
శ్లో।। పూగీఫలసమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం!
కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్।।
శ్రీ వరసిద్ది వినాయకస్వామినే నమః తాంబూలం సమర్పయామి.
సువర్ణపుష్పం
శ్లో।। సచ్చిదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ
భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక।
శ్రీ వరసిద్ధివినాయకాయ నమః సువర్ణపుష్పం సమర్పయామి.
నీరాజనం
శ్లో।। ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తథా!
నీరాజనం మయా దత్తం గృహాణవరదో భవ।।
శ్రీ వరసిద్ధివినాయకాయ నమః నీరాజనం దర్శయామి.
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి.
దూర్వాయుగ్మ పూజ
ఓం గణాధిపాయనమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం అఖువాహనాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం ఈశ పుత్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం ఏకదంతాయనమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం ఇభవక్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మేన పూజయామి
మంత్రపుష్పం
శ్లో।। గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన!
వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక।।
ఏకదంతైక వదన తథా మూషికవాహన!
కుమారగురవే తుభ్య మర్పయామి సుమాంజలిమ్।।
శ్రీ వరసిద్ధివినాయకాయ నమః మంత్రపుష్పం సమర్పయామి.
ఆత్మ ప్రదక్షిణం.
శ్లో।। ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ!
నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన।।
శ్రీ వరసిద్ధివినాయకాయ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి
పునరర్ఘ్యం
శ్లో।।అర్ఘం గృహాణహేరంబ సర్వభద్ర ప్రదాయక
గంధపుష్పాక్షతై ర్యుక్తం పాత్రస్థం పాపనాశన!
శ్రీ వరసిద్ధివినాయకాయ నమః పునరర్ఘ్యం సమర్పయామి.
ప్రార్థన.
(ఈ శ్లోకం చదువుతూ.. వినాయకుడికి ప్రార్థన చేయాలి.)
శ్లో।। నమ స్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన!
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాం గతిమ్।।
వినాయక నమ స్తుభ్యం సతతం మోదక ప్రియ!
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా।।
ప్రదక్షిణం
శ్లో।। యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ! తాని తాని ప్రణశ్యంతి...ప్రదక్షిణ పదే పదే।। పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల।। అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మా త్కారుణ్యభావేన రక్ష రక్ష వినాయక।।
దీంతో పూజా విధానం సంపూర్ణం
ఉద్వాసనమ్...
శ్లో।। యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమా న్యాసన్, తేహ నాకం మహిమాన స్సచంతే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః ఈ శ్లోకం చదివి వినాయకుడిని ఈశాన్య దిశగా కదల్చాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sri Varasiddi Vinayaka Pujaa Vidhaanam"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0